Tuesday, January 27, 2015

ఓ మైగాడ్ అన్నీ ఆన్‌లైన్ సేవలే!

NEWS


1/12/2015 1:35:26 AM
ఓ మైగాడ్ అన్నీ ఆన్‌లైన్ సేవలే!
కలగంటి.. కలగంటి. ఇప్పుడిటు కలగంటి అని వెంకన్న కోసం వేచి చూడక్కర్లేదు. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా అని శ్రీరామచంద్రునికోసం ఆవేదన చెందక్కర్లేదు. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ.. నను బ్రోవమని చెప్పవే! అని భద్రాద్రి కోసం సీతమ్మను రికమండ్ చేయాల్సిన పని లేదు. ఒక్క మౌస్ క్లిక్‌తో అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. దర్శనం ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రసాదాలూ తెప్పించుకోవచ్చు. చేసిన మనుషులు సృష్టించిన టెక్నాలజీ గుడిమెట్ల మీద కొత్త పోకడలు సృష్టిస్తున్నాయి.

-దేవుడిని నమ్మని గోపాల్‌రావు.. దేవుడి ప్రతిమలు అమ్మే షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటాడు. షాపు దగ్ధమవ్వడంతో దేవుడిపైనే కేసు వేసి కోర్టుకెక్కుతాడు. గోపాల గోపాల సినిమాలో నాస్తికుడిగా హీరో వెంకటేశ్ పాత్ర ఇది.
-భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసి తన రిమోట్‌కంట్రోల్ పోగొట్టుకుంటాడు. తన రిమోట్‌ని కొట్టేసిన వారిని నిలదీస్తాడు. దేవుడిమీద ఉన్న భక్తిని.. భయంగా మార్చి కొంతమంది ఇలాంటివి చేస్తున్నారని పీకే సినిమాలో ఆమిర్‌ఖాన్ తన పాత్ర ద్వారా చెప్తాడు. ఆ క్యారెక్టర్లకు ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇవి రెండూ దేవుడికి సంబంధించినవి. పైగా ఇప్పుడివే హాట్ టాపిక్స్. కుటుంబ సభ్యులు అగ్నిగుండాల్లోకి ప్రవేశిస్తే అది నచ్చక దైవదూషణ చేయడంతో గోపాల్‌రావు షాపు దగ్ధమవుతుంది. తమ రహస్యాలు చెప్తాడని గ్రహించి గ్రహాంతరవాసి రిమోట్‌ను ఎవరు కొట్టేశారు.. వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటని పీకే నిరసిస్తాడు. సో.. సినిమాలోవలె కూడా దేవుడి గురించి భక్తులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దు. భక్తితో నేరుగా తమకు ఇష్టమొచ్చిన దేవుడిని.. ఇష్టమొచ్చిన రీతిలో పూజించాలి. ఒకవేళ తీరిక లేకపోతే ఆన్‌లైన్ దర్శనం కూడా అందుబాటులో ఉంది. కొత్తగా.. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! అవును కొత్తగా ఇప్పుడు ఇంట్లో నుంచే పుణ్యక్షేత్రంలో ఉన్న దేవుడిని పూజించొచ్చు.. తీర్థ ప్రసాదాలూ పొందవచ్చు!

అలసితినీ..


భారతదేశం ఆధ్యాత్మిక పునాదుల మీద నిర్మించబడింది. ఇక్కడ దేవుళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాంతాలు ఏవైనా.. దేవుడు దేవుడే అని నమ్ముతూ భక్తులు పారవశ్యంలో మునిగిపోతారు. కోరికలు తీర్చుకోవడానికి కొండలెన్నయినా ఎక్కుతారు. గుట్టలెన్నయినా దాటుతారు. కాలినడకన యాత్రలు సైతం చేసి తీర్థయాత్రలు తిరిగిరావడం భక్తుల పరిపాటి. ప్రస్తుత పరిస్థితులు కాస్త మారాయి. బిజీలైఫ్‌తో తలమునకలవుతున్నారు. దైవ దర్శనం కోసం పడాల్సి వస్తోంది.
తొమ్మిదేళ్ల తర్వాత వైకుంఠ ఏకాదశి.. కొత్త సంవత్సరం ఒకే రోజున వచ్చాయి. 1.63 లక్షల మంది భక్తులకు తిరుమతిలో స్వామివారి దర్శనభాగ్యం కల్గింది. తిరుమల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు. కానీ భక్తుల రద్దీని క్రమబద్దీకరించడంలో యంత్రాంగం విఫలమైంది. షెడ్లు, క్యూ కాంప్లెక్స్‌లు సరిపోలేదు. కంపార్ట్‌మెంట్లలో అసౌకర్యానికి భక్తజనం నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఇదే రోజు కిలోమీటర్లమేర భక్తులు లైన్లు కట్టారు. మునుపెన్నడూ లేనంత విధంగా భక్తులు హోరెత్తడంతో ఆలయ ప్రత్యేకత అయిన 11 ప్రదక్షిణలు.. 108 ప్రదక్షిణలు నిలిపేశారు.
పోటెత్తిన భక్తులతో గోదావరి తీరం పులకించింది. భద్రాచలం రామనామస్మరణలతో మార్మోగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రూ. 41.42 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు. భక్తి ప్రవాహంతో వచ్చినవాళ్లెంతో మంది. కానీ వీరిలో అందరికీ దర్శనభాగ్యం జరిగిందా? పూజలు-పునస్కారాలు చేసుకున్నారా? అంటే కచ్చితంగా జరగలేదనే చెప్పాలి. చాలా కంపార్ట్‌మెంట్లలో వేలమంది మిగిలే ఉన్నారు. స్వామీ..! ఇంతదూరమొచ్చినా దర్శనభాగ్యం కలగకపాయె.. అలసితిమీ.. సొలసితిమీ అంటూ భక్తులు నైరాశ్యంలో పడుతున్నారు.

కనరో భాగ్యం..


దేవుడు ప్రకృతి శక్తి. ఏ రూపంలో ధ్యానించినా భక్తులకు వరాలిస్తాడు.. ఆదుకుంటాడు. ఎక్కడో కొండకోనల్లో కొలువైన తన దర్శనం కోసం వస్తున్న భక్తులకు అలసితినీ అనే భావన కల్గించకుండా ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చే రోజులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే పూజలు.. పురస్కరాలు చేసుకునేందుకు అవకాశం కూడా అందుబాటులోకి జ్యోతిర్లింగాలు, అష్టాదశ భక్తి పీఠాలు, ఏడు కొండల వెంకన్న, భద్రాద్రి రాముడు, షిరిడీ సాయిబాబల దర్శనానికి అన్‌లైన్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. వయోభారం కలవారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో కొలువైన దేవుడిని దర్శించుకునేందుకు టెక్నాలజీ గుడిమెట్లు ఎక్కుతున్నారు. ఇప్పటివరకు పుణ్యక్షేత్రాలకు సంబంధించి టికెట్ ఆన్‌లైన్ బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. విరాళాలు, అన్నదానం, గోసేవ వంటి కార్యక్రమాలు చేసేవారు. ఇన్ని చేసినవాళ్లం దేవుడిని కూడా ఆన్‌లైన్‌లో పూజించుకునేలా చేయలేమా అని ఆలోచించిన దేవస్థాన పాలకులు ఇంటర్నెట్ ద్వారా స్వామివారిని దర్శించేభాగ్యం కల్పిస్తున్నారు. శుభ్రంగా స్నానం చేసి.. ఆన్‌లైన్‌లో తమకు ఇష్టమైన దేవుడిని లైవ్‌లో దర్శించుకోవచ్చు. వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా తమ పేరు, గోత్రం, ఇతర విషయాలు తెలియజేసి.. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే చాలు. అక్కడ మీ పేరుమీద పూజ జరిగిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా పూజలు చేసుకుని భక్తులు కనరో అంటూ పరవశించిపోవచ్చు. గురవయూర్ శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి వంటి దేవాలయాల్లో మొదటగా ఆన్‌లైన్ పూజలు ప్రారంభమయ్యాయి.

కాశీకి పోలేము..


ఒకప్పుడు కాశీకి వెళ్లినవాడు కాటికెళ్లినట్టే అనే భావన ప్రజల్లో ఉండేది. అంత వ్యయ, ప్రయాసతో కూడుకున్నది కాశీయాత్ర. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాశీ కాదు కదా.. ఇంకెంతదూరంలోనైనా కొలువైన దేవుడికి పూజలు చేసుకుని.. మొక్కులు తీర్చుకునే భాగ్యం భక్తులకు కల్గింది. shrikashivishwanath.org అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా రిజిష్టర్ చేసుకుని.. డబ్బులు చెల్లించాలి. తర్వాత కాశీ విశ్వనాథుడికి ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా పూజలు చేయొచ్చు. తిరుమలేశుడి కోసం tirumala-tirupati. com/online-seva-portal, భద్రాచల రాముడి కోసం www.sitaramaswamy.com, శ్రీశైల మల్లిఖార్జునుడి కోసం www.srisailamonline.com, యాదగిరి నరసింహుడి కోసం www.yadagirigutta srilaksh minarasimhaswamy.org పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. శక్తిపీఠాలను khaleeghat. net, షిరిడీ.. త్రయంబకేశ్వరం, ముంబై సిద్ధి వినాయక స్వామిలకు rudraksharathna. com సైట్లో దర్శించుకోవచ్చు. ఈసైట్లో కాశీ విశ్వనాథుడి భాగ్యం కూడా పొందవచ్చు.

ప్రసాదం..


నేరుగా పుణ్యక్షేత్రాలకు వెళ్తే.. దర్శనం, పూజతో పాటు తీర్థ-ప్రసాదాలు కూడా లభ్యమవుతాయి కదా.. మరి ఈ-పూజ ద్వారా ప్రసాదాలు పొందే అవకాశం లేకపోవచ్చని ఆందోళన చెందకండి. అత్యంత పవిత్రంగా భావించే తీర్థ-ప్రసాదాలు కూడా కోరిన ప్రకారం వస్తాయి. ఆన్‌లైన్ ప్రసాదాలు కూడా మన ముంగిట్లోనే ఉన్నాయి. పూజలు జరిగిన తర్వాత కొరియర్ ద్వారా మన ఇంటికే ప్రసాదాలు అందుతాయి. వెబ్‌సైట్లోనే ప్రసాదాలకు ఆర్డర్ చేయాలి. దేవుడి దర్శనం కోసం తీరికలేదని ఆందోళనకు చెక్‌పెట్టి ఇంట్లోనే కట్టెదురా వైకుంఠం అంటూ భక్తిగీతాలు పాడుకుంటూ పరవశించి పోవచ్చు. ధర్మ సమ్మతం కోసం పూజలు చేస్తున్న భక్తులు ఆన్‌లైన్ దేవుడి సేవల్ని చూసి ఓ మై గాడ్ అనాల్సిందే!


సర్వం ఇ-మయం!


ఇందుగలదందులేదనే సందేహం వద్దు. దేవుడికి సంబంధించిన ఈ-సేవలు ఎందెందు వెతికినా ఉన్నాయి. ఇ-దర్శనం, ఇ-పూజ, ఇ-ప్రసాదం, ఇ-హుండి, ఇ-అకామిడేషన్ వంటి ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇ-ప్రసాదం కోసం..


eprasadam.com, onlineprasad.com సైట్లలో రిజిస్టర్ చేసుకుని కొరియర్ ద్వారా ప్రసాదాలను పొందొచ్చు.

ఇ-దర్శనం కోసం..


e-darshan.org,
www.eprarthana.com, www.onlinedarshan.com
వంటి సైట్‌లోకి వెళ్లి దేశంలోని
ప్రముఖ దేవాలయాల్లో కొలువుదీరిన దేవుళ్లను దర్శించుకోవచ్చు.

ఇ-పూజ కోసం..


www.saranam.com,
epuja.co.in, www.epooja.com, www.livepujayagya.com
వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ పూజలు ఇంట్లో ఉండే నిర్వహించుకోవచ్చు.

728

Advertisement
Related News










No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular