Posts

Showing posts with the label భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా? Courtesy:  Praveen Goud goudp68@yahoo.com గీతాజయంతి నాడు దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా భగవద్గీతను గురించి మారుమ్రోగి పోతూంటుంది. ఇన్ని పత్రికలు, 24గంటలూ పనిచేసే శతాధిక T.V.చానెళ్ళూ వచ్చాక, విషయబాహుళ్యం బాగా పెరిగింది. ఏది ఎంతవరకు గ్రహించాలో, ఎట్లా ఉపయోగించుకోవాలో (ఆచరణలో పెట్టుకోవాలో) దిక్కుతోచనంత విశాల విషయ ప్రసారమే ఈనాటి అసలు సమస్య ! ఉదాహరణకు: గణితశాస్త్రమనేది, 1వ తరగతి విద్యార్థినుండి Ph.D.స్థాయి, ఆపైన Original Scientist (Mathematician)స్థాయి వరకు అందరికీ ఉపయోగపడేదే. అలాగని, 3వ తరగతి చదివే మన పిల్లలకు పేపర్లు, T.V.లలో చూపించే విచిత్ర, కాలక్షేప, ఆసక్తికర Maths Prograammes అన్నీ పనికి రావు గదా ! అదేవిధంగా భగవద్గీతా శాస్త్రం కూడా. మన పిల్లలకు ( ఆధ్యాత్మికంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న పెద్దలు కూడా పిల్లలతో సమానమే – వారుకూడ అధ్యాత్మికతా ప్రారంభ బాలశిక్ష నేర్చుకోవాల్సిందే కాబట్టి ) మొదటిమెట్టుగా ఉపయోగపడే గీతాంశాలను గూర్చి స్థూలంగా చర్చించుకుందాం ! ౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకు...