ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్ చెర్వుగట్టు క్షేత్రం
ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్ చెర్వుగట్టు క్షేత్రం Updated : 1/29/2015 12:24:41 PM Views : 599 మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగానే మైకుల నుంచి శివ-పార్వతుల స్తోత్రాలు చెవులను చేరుతున్నాయి. నార్కట్‌పల్లికి సమీపంలో యల్లారెడ్డిగూడెం వద్ద అద్దంకి హైవేను దాటి ముందుకు సాగుతోంది మా ప్రయాణం. పార్వతీ సమేత జడల రామలింగేశ్వరుడు కొలువైన చెర్వుగట్టు క్షేత్రమే మా గమ్యం. శివాలయమే కావచ్చు.. కానీ ఆధ్యాత్మికతను మించిన ఆహ్లాదాన్నీ, అడ్వెంచర్‌నూ అక్కడ రుచి చూడవచ్చు. బ్రహ్మోత్సవాల వేళ కిక్కిరిసిన జన సందోహం నడుమ గుట్ట పైకి మెట్ల మార్గంలో వెళ్లినా.. ఫీట్లు పడుతూ ఘాట్ రోడ్డులో పయనించినా.. ఆ థ్రిల్ అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఇక పైనున్నంత సేపూ కలిగే ప్రత్యేక అనుభూతి.. మూడు గుండ్ల ముచ్చట.. కోనేటి స్నానం.. కొత్తగా కట్టిన కల్యాణ మండపం.. వాటిని మించి రామలింగేశ్వరుడి దర్శనం ఇలా ప్రతిదీ వర్ణనకు కొత్తగా మాటల మూటలను చేర్చే అంశమే. నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు.. ఇక్కడ నిత్యం జన సందోహమే.. ఇక జాతర సమయంలో అయితే.. ఇసుకేస్తే అన్న చందంగా గుట్ట నిండా జన జాతరే. స్వాగత తోరణం నుంచే జాతర సంబురం కళ్లల్లో నింప...