Mano Nigraham
మనో నిగ్రహము Posted On:12/4/2014 1:56:13 AM మానవులకు ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి. అవికాక పదకొండవ ఇంద్రియం అయిన మనసు అటు జ్ఞానేంద్రియంగా, ఇటు కర్మేంద్రియంగా పనిచేస్తూ ఉభయేంద్రియంగా వ్యవహరింపబడుతుంది. ఈ మనసు లోకంలోని అనేక విషయాలతో మనిషికి బంధాన్ని కలిగిస్తుంది. మళ్ళీ బంధ విముక్తికి కూడా మనసే కారణంగా నిలుస్తుంది. -మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అని భగవద్గీతలో గీతాచార్యుడు పేర్కొన్నాడు. ఈ మన సు చంచల స్వభావం కలది. నిలకడ లేనిది. ఒకచోట నిలుపుటకు శక్యము కానిది. బలిష్ఠమైనది. మనుషులను వ్యాకుల పరచునట్టిది. పరిపరి విధాలుగా దృఢంగా సంచరించునట్టిది. ఎదురుగాలిని విసనకర్రతో అడ్డుకొనుట ఎట్లా అసంభవమో, ఈమనస్సును అడ్డుకొనుట కూడా దుష్కరము - చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢమ్ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ॥ అని భావించుచున్నానని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో మనస్సు చలించు స్వభావం కలిగినదే. నిగ్రహింప శక్యము కానిదే. ఇందు ఎట్టి సంశయం లేదు.కాని ఈ మనస్సును అభ్యాసం చేతను, వైరాగ్యము చేతను వశముచేసుకొన వచ్చును అసంశయం మహాబాహో మనో దుర్...