Posts

Showing posts with the label శివుడు

శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు

శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు! వారంతా అతీంద్రియ శక్తులు.. శివారాధన మతపరమైనది కాదు హిందుత్వం మతం కాదు!.. హిందువులకు దైవపూజ తప్పనిసరి కాదు పన్ను మినహాయింపుపై ఐటీ ట్రిబ్యునల్ ఆదేశం ముంబై, మార్చి 16: శివుడు.. గణపతి.. హనుమంతుడు.. దుర్గాదేవి! వీళ్లంతా ఎవరు!? వీళ్లంతా హిందూ దేవుళ్లు, దేవతలు అని చెప్పేరు కనక!! ఈ మాటంటే ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ ఒప్పుకోదు! వాళ్లు ఏ మతానికీ సంబంధించిన వారు కాదని.. ఈ విశ్వంలోని అతీంద్రియ శక్తులని ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది! వారి ఆలయాలకు విరాళం ఇచ్చినా అది 'మతపరమైన' కార్యక్రమాల కిందకు రాదని స్పష్టం చేసింది. హిందూ దేవుళ్ల ఆరాధన, ఆలయాల నిర్వహణ కోసం పెట్టే ఖర్చును మతపరమైనదిగా భావించలేమని తేల్చి చెప్పింది. అందువల్ల... ఈ ఖర్చుకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని నాగపూర్ ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అంతేకాదు... "హిందూయిజం అంటే ఒక మతమూ కాదు. వర్గమూ కాదు. అందులో వేర్వేరు వర్గాలున్నాయి. వివిధ రూపాల్లో వేర్వేరు దేవుళ్లను పూజిస్తారు. అసలు.. హిందూ జీవన శైలిని ఆచ...