NITYA PATHANA SLOKAMULU
NITYA PATHANA SLOKAMULU ఓం నమో భగవతే వాసుదేవాయ నిత్య పఠన శ్లోకములు (ఉదయం నిద్ర లేచే వేళ తన అర చేతులు చూసుకుంటూ...) 1.శ్లో: కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సర స్వతీ కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం నిద్ర లేచి భూమిపై కాలు మోపునపుడు... భూదేవికి నమస్కరిస్తూ... 2.శ్లో: సముద్రవసనే దేవీ పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమేil సూర్యోదయ సమయమున పఠించవలసిన 3.శ్లోకం: బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్సదావిష్ణుం త్రిమూర్తిం చ దివాకరం, స్నానము చేయునపుడు : ( కేశవ నారాయణ మొదలగు నామములతో ఆచమనం చేసిన తరువాత) 4.శ్లో: ఓం గంగే చ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపి వా యస్మరేత్ పుండ్రీకాక్షం స బాహ్యాంభతర శ్శుచి: పుండరీకాక్ష... పుండరీకాక్ష... పుండరీకాక్ష... గాయత్రీ మంత్రము | 5.శ్లో: ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యమ్ | భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || భావార్థము : హేరక్షక! సచ్చిదానందస్వరూప! జగదుత్పాదకదేవ ప్రసిద్ధము, పల్వోత్కృష్టమునగు నీ విజ్ఞాన స్వరూపమున మేము నిత్యముపాసింత...