SAKALA DEVATA DHYANAMU
SAKALA DEVATA DHYANAMU https://www.youtube.com/watch?v=itQ_JfO5Yuc సకల దేవతా ధ్యానము ఓం శ్రీ గణేశాయ నమః శ్లోకం : తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి! పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవో, విశ్వదాభిరామ వినుర వేమ|| తాత్పర్యం : మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రేమించాలి. లేకుంటే మనము ఉన్నా లేనట్టుగానే చెప్పుకోవాలి. అటువంటివారు పుట్టలో చెదలతో సమానము. శ్లోకం : గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః - గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీ గురవేనమః || తాత్పర్యం : గురువే బ్రహ్మ, గురువే విష్ణుమూర్తి, గురువే స్వయం ప్రకాశుడగు మహేశ్వరుడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మము. కాబట్టి అట్టి సద్గురువుకు నమస్కారము. శ్లోకం : శుక్లాంబరధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ - సర్వవిఘ్నోపశాంతయే || తాత్పర్యం : తెల్లని వస్త్రములు ధరించినవాడు, సర్వ వ్యాపకుడు, తెల్లని చంద్రునివంటి వన్నె కలవాడు, నాలుగు భుజములు కలవాడు, ఎప్పుడూ నవ్వుచుండెడి మోముగలవాడు అగు వినాయకుని నా కార్యములకు విఘ్నము కలుగకుండుటకై ధ్యానింతును. శ్లోకం : జయతు జయతు దేవీ - సర్వదేవాత్మ భూతా | జ...