SANATANA SAMPRADAYA SMARANA SLOKAMULU_ 1 to 10
SANATANA SAMPRADAYA SMARANA SLOKAMULU_ 1 to 10 సనాతన సాంప్రదాయ స్మరణములు 1.శ్లోకం : భక్తి శ్రద్ధా భావనాచ | పూజాం జీవ ఉచ్యతే || తాత్పర్యం : చేయబడు పూజా కార్యమునకు (1) భక్తి (2) శ్రద్ద (3) భావన అనునవి జీవములుగా పేర్కొనబడినవి. గాన వానిని పెంపొందించు కొనవలెను. 2.శ్లోకం : భగవతో బలేన - భగవతో వీర్యేణ | భగవతస్తే జసా - భగవతః కర్మ కరిష్యామి || తాత్పర్యం : నేను భగవంతుని యొక్క బల, వీర్య, తేజస్సుల సహాయంతో భగవంతుని కర్మ చేయుచున్నాను. 3.శ్లోకం : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం | అస్మదాచార్య పర్యంతాం - వందే గురు పరంపరామ్ || తాత్పర్యం : (మనది శాశ్వతమైన సనాతన ధర్మం. దీనికి భగవానుడైన నారాయణుడు ఆదిగురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి వశిష్ఠుడు, వశిష్టుని నుండి శక్తి, శక్తి నుండి పరాశరుడు, పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి శుకుడు, శుకుని నుండి గౌడపాదుడు, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులు, అతని నుండి ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని స్వీకరించి కొనసాగించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు) నారాయణుని మొదలుకొని మధ్యను శంకరాచార్...