Posts

Showing posts with the label ధర్మ ప్రభోదం

ధర్మ ప్రభోదం

ధర్మ ప్రభోదం మార్పు మంచిదే! Updated : 1/29/2015 1:43:05 AMViews : 46 మనిషి సంఘజీవి. మనుషులే లేని సమాజాన్ని ఊహించలేము. మానవ నైతికత మీదే జాతి మనుగడ ఆధారపడివుంది. తప్పులెంచువారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఎదుటివారిని వేలెత్తి చూపేటప్పుడు మిగతా నాలుగు వేళ్ళు తనవైపే ఉన్నాయన్న విషయాన్ని మరచి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం? ఎంతసేపూ సమాజం మంచిగా లేదు. మనుషులు మారిపోయారు. మంచికి రోజులు కావని ఏమీ పట్టనట్టు వదిలివేస్తే సరిపోదు.  ఆత్మసాక్షిగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. యతోహస్తః తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః యతో మనస్తతో భావోయతో భావస్తతోరసః ॥ ఎక్కడ చేయి చూపిస్తుందో అక్కడే దృష్టి పడుతుంది. దృష్టి వెళ్లిన చోటికి మనసు మళ్లుతుంది. మనసులో భావం చిగురిస్తుంది. భావమే అనుభూతిని కలిగిస్తుంది. చూపిందీ, చూసిందీ మంచి వి షయమే అయితే రసస్వాదన అనుభవించటంలో తప్పులేదు. అదే చెడును భావిస్తే రసాభాసమే కదా! దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. వంకరదృష్టితో చూస్తే ప్రతీది వంకరగానే కనబడుతుంది. మనలోని భావన మంచిదైతే ప్ర పంచమంతా మంచిదనంతో నిండిపోతుంది. బ్రతికే విధానం లో తప్పొప్పులు సహజం. వీలైతే సందిద్దుకుంటూ తమదై...