Posts

Showing posts with the label పాలమూరు విదుషీమణి

పాలమూరు విదుషీమణి

Image
పాలమూరు విదుషీమణి Updated : 1/26/2015 12:51:13 AM Views : 15 పాలమూరు కవయిత్రుల్లో వయోధికురాలు గానే కాక కవితా శేముషిలో కూడా ప్రథమ గణ్యురాలు జొన్నవాడ రాఘవమ్మ. కేశవరాయుని పల్లెలో శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జినకుంట శ్రీనివాసాచార్యులు, రాగమ్మల పుణ్యఫలంగా జన్మించిన ఆమె చిన్నప్పట్నుంచీ భాగవతాది పురాణాలు జీర్ణించుకొని శ్రీకృష్ణునే ఆరాధ్యదైవంగా భావిస్తూ మధురభక్తిపూరితమైన పాటలు రచించింది. భర్త జొన్నవాడ వేదాంతాచార్యులు ఆమె సాహిత్యాభిరుచికి దోహదం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన ఆమె గేయాలు శ్రోతలను అలరించాయి. మన జిల్లా ప్రముఖ గాయకుడు ఎం.వెంకటగోపాలం మధురమైన బాణీలతో వాటికి ప్రచారంతో పాటు గ్రంథరూపంలో ప్రకాశానికి కూడా పాటుపడ్డారు. సంగీతకళలో ప్రవేశం గల ఆమె కుమార్తెలు కూడా వాటిని వ్యాప్తికి తెచ్చారు. 48 రాధికా గీతాల తొలిగ్రంథం ఆవిష్కరణ జ్యోతిర్మయి సాహిత్య సమితి సప్తమ వార్షికోత్సవం (12-11-1972) సందర్భంగా జరిగింది. భవానీ భక్తవత్సలం అధ్యక్షతలో జరిగిన ఈ సభలో జె.బాపురెడ్డి కావ్యావిష్కరణ చేశారు. ఆకాశవాణి సంగీత విధ్వాంసులు పాలగుమ్మి విశ్వనాథం, కేశవపంతుల నరసింహశాస్త్రి, శశాంక, ఇరివెంటి...