Posts

Showing posts with the label ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!

ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!

Image
ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట! Posted On:1/21/2015 4:03:31 AM యూసుఫ్‌గూడ, జనవరి 20: ఆటపాటల్లోనే కాదు, ముగ్గులు, చదువు సంధ్యల్లోనూ మేటిగా నిలిచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచింది ఈ చిన్నారి. బతుకమ్మ పాటను మొట్టమొదటిగా ఇంగ్లీషులో పాడి అందరిచేతా శెభాష్! అనిపించుకుంది ఈ చిట్టితల్లి. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ ఈస్ట్ రహమత్‌నగర్ వీడియోగల్లీకి చెందిన ఇప్పపూల శ్రీనివాస్ పెద్ద కూతురు సాయిశ్రేయకు తెలంగాణ పాటలన్నా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలన్నా ప్రాణం. మధురానగర్‌లోని విజ్ఞానజ్యోతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న శ్రేయకు సంగీతమంటే మక్కువ. కూతురు ప్రతిభను, ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు రేఖ, శ్రీనివాస్ శ్రేయను ప్రోత్సహించి డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం క్లాసులో చేర్పించారు. ఈ క్రమంలోనే బోరబండ రామారావునగర్‌లో ఉండే తన అమ్మమ్మ జి.అరుణాబాయి రాసిన బతుకమ్మ పాటను సాయిశ్రేయ ఇంగ్లీషులో మొట్టమొదటిగా పాడి అబ్బురపరిచింది. విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు సైతం పాడుకునేందుకు వీలుగా ఉన్న ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇంగ్లీషులో సాయిశ్రేయ అలవోకగా పాడే ఈ పాట గంగమ్మ తల్లి భూ...