Posts

Showing posts with the label దృష్టి - నివారణ మార్గాలు

దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు

Image
దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు 'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగి పోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ,...