Posts

Showing posts with the label వివేకానందుడు

వివేకానందుడు

Image
Swami Vivekananda Quotes Telugu  added 4 new photos. January 9 at 3:33am  ·  వివేకానందుడు ★☞_/||\_☜★ భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న యుగమది. మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా, సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ అవుతున్న శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన వైతాళికుడు వివేకానందుడు. భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద! 1863 జనవరి 12, సోమవారం! ఉదయం 6 గంటల 49 నిమిషాలు. కలకత్తాలో భువనేశ్వరీదేవి పండంటి మగబిడ్డను కన్నది. తండ్రి విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి నరేంద్రనాథ్ అనే పేరు పెట్టారు. నరేన్ అల్లరి గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు, రాళ్లు – అన్నీ ఆ చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే! పిల్లల్లోని అంతర్గత ...