Posts

Showing posts with the label అంతర్యామి_దత్తావతారం _భ్రమర నాదాలు

అంతర్యామి_దత్తావతారం _భ్రమర నాదాలు 

Image
 అంతర్యామి   దత్తావతారం  బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమైక్య రూపమే దత్తావతారం. అది త్రిమూర్తుల సమన్వితం. వారి వరప్రభావం వల్ల అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇవ్వడం. అత్రి కుమారుడు కాబట్టి ఆయనను ‘ఆత్రేయుడు’ అనీ పిలుస్తారు. దత్తాత్రేయుడు మార్గశిర పౌర్ణమినాడు అవతరించాడు. ఉపనయనం తరవాత దత్తుడు తపస్సు ఆచరించాడు. పరిపూర్ణమైన జ్ఞానార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి అనేకమందికి ఆయన ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు అనే గ్రంథాలు రచించాడు. దత్తుడు మహాత్ముడు. ఆయనే ఆదిగురువైన పరబ్రహ్మం. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్య రూప విలక్షణ మూర్తి. ఆయన చుట్టూ ఉన్న నాలుగు ప్రాణులే నాలుగు వేదాలు. అహంకారాన్ని దండించడానికే దండం ధరించానని, జోలె పట్టింది భక్తుల సంచిత కర్మలకోసమేనని ప్రవచించాడాయన. దత్తాత్రేయ బోధలు లోక కల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం స్వీకరించాలని ఉద్బోధించాడు. అగ్ని ను...