గయ మహత్యం
Swami Vivekananda Quotes Telugu January 8 at 8:47pm · గయ మహత్యం ★★_/|\_★★ ఆధ్యాత్మిక వైభవాన్ని కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయా క్షేత్రప్రస్తావన మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు, స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది. ప్రయాగ, కాశీ, గయ అనే మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అని అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి. కాగా,అ గయ పవిత్రమైన నాలుగు క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడింది. ప్రయాగ, కురుక్షేత్రం, గయ, వారణాసి, ఈ నాలుగు క్షేత్రాలు కలిపి పవిత్రమైన నాలుగు స్థలాలుగా పేర్కొంటారు. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని, కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రదానం చేసి, కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా అత్యంత పవిత్రక్షేటంగా కీర్తించబడిన గాయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందిం...