నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు
నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటా.రు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి. స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి. సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న...