Showing posts with label జన్మ సార్ధకత - Life Turning Point. Show all posts
Showing posts with label జన్మ సార్ధకత - Life Turning Point. Show all posts

Saturday, March 8, 2014

జన్మ సార్ధకత - Life Turning Point

 జన్మ సార్ధకత - Life Turning Point
    జన్మలు 3 రకములు. దేవ జన్మ, పశు జన్మ, మానవ జన్మ.
    దేవ - పశు జన్మలు మోక్ష సాధనకు అవకాశం లేని జన్మలు. మానవ జన్మ మాత్రమే మోక్ష సాధనకు
    అనుకూలమైన జన్మ. 84 లక్షల రకాల జీవ రాసులలో ఎన్నో రకాల యోనులలో పుట్టి - గిట్టి అపురూపముగా
    తెచ్చుకున్న ఈ మానవ జన్మను, జన్మ సార్ధక్యతకు ఉపయోగించుకోకపోతే మరో కోటి జన్మల తరువాతనైనా సరే ఈ
    ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించి సాధనలు చేసి మోక్షాన్ని అందుకోవలసిందే. అప్పటిదాకా ఈ సంసార బంధములో
    (జనన మరణ రూప సంసారం) లో కష్టాలు, సుఖాలు అనుభవించక తప్పదు. పుట్టాము అంటే కష్టాలు
    తప్పవు (జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఎన్నెన్నో; సుఖాలు ఎన్ని ఉన్నా దుఃఖాలను తప్పించికోవడం కుదరదు)

    మోక్ష సాధకులకు సద్గురువు ఉపదేశాలు తప్పనిసరి. శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా మహర్షులు,
    మహాత్ములు మనకు అందించిన వేదాంత శాస్త్రాలను అర్ధం చేసుకొని ఈ జన్మలోనే మోక్ష సాధన చేసి ఈ మానవ జన్మ
    లక్ష్యమైన మోక్ష సాధన గావించాలి.
    క్రింద తెలియజేయబడిన వెబ్సైటు (http://www.srichalapathirao.com) లోని ప్రవచనములు కేవలం
    3 సంవత్సరములుగా క్రమముగా వింటున్న నాలో వచ్చిన మార్పులతో మీకు సలహాగా తెలియజేస్తున్నాను. ప్రారబ్ధం
    ఉంటేనే ఇటువంటి ప్రవచనాలు వినాలనిపిస్తుంది, సద్గురువును ఎంచుకోగలము, తద్వారా పురుషార్ధం చేసి
    మెట్టుపై మెట్టు ఎక్కి ఈ జన్మను సార్ధకం చేసుకోగలము.

    *గురుదేవుల గురించి నాకు తెలిసిన 2 మాటలు :* మహాభారత, ఆధ్యాత్మిక, ప్రకరణ, భక్తి, భగవద్గీత,
    ఉపనిషత్తు, బ్రహ్మసూత్రములను అత్యంత తేలిక భాషలో నా వంటి అజ్ఞాని కూడా వేదాలకు
    శిరస్సులనబడే ఉపనిషత్తు వంటి గ్రంధాలను తేలికగా అర్ధం చేసుకొనేలా ప్రవచిస్తున్న గురుదేవులు శ్రీ
    చలపతిరావు గారికి శిరస్సు వంచి నమస్సులు. గత 25 సంవత్సరములుగా ప్రతిరోజూ సత్సంగం నా ఊహకు
    అందనిది. ఎన్నో సంస్ధలు, ఎన్నో ఆర్భాటాలు, ఎంతో-ఎందరో-ఎన్నో రూపాల సహాయ సహకారాలు ఉన్నా వారానికో,
    నెలకో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడానికి చాలా కష్టపడతారు. అటువంటిది ప్రవచనం చేయడానికి ఈ 25
    సంవత్సరాలలో ఒక స్ధలము కూడా లేకుండా, పెద్ద పెద్ద వాళ్ళ సహాయం లేకుండా, ధనం - ధన సహాయం
    లేకుండా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్నో ఇబ్బందులను
    అధిగమిస్తూ నిర్వహించడం అనన్య సామాన్యం. కేవలం పరమాత్మ - మోక్షం లక్ష్యంగా గల మీ గురించి తెలియడం
    మా ఎన్నో జన్మల సుకృతం.

    మిమ్ములను మీరు ఇస్తున్న ప్రవచనాలను మేము ఎక్కడున్నా ఎటువంటి ఫలాపేక్షా లేకుండా మా అందుబాటులోనికి
    తేవడానికి సహకరిస్తున్న http://www.srichalapathirao.com వెబ్సైటు బృందానికి నా ప్రత్యేక
    కృతజ్ఞతలు.

    Om

     

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular