Sunday, January 11, 2015

గయ మహత్యం


గయ మహత్యం
★★_/|\_★★
ఆధ్యాత్మిక వైభవాన్ని కాకుండా ప్రాచీన
చరిత్రనూ స్వంతం చెసుకున్న గయా క్షేత్రప్రస్తావన
మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ,
పద్మ, నారదీయ పురాణాల్లో ఉంది. గయాసురుడి పేరు మీద ఈ
క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు,
స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా
కీర్తించబడింది. ప్రయాగ, కాశీ, గయ అనే
మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అని అంటారు. వీటిని
జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి
కలుగుతుందని ప్రతీతి.
కాగా,అ గయ పవిత్రమైన నాలుగు క్షేత్రాలలో ఒకటిగా కూడా
చెప్పబడింది. ప్రయాగ, కురుక్షేత్రం, గయ, వారణాసి, ఈ
నాలుగు క్షేత్రాలు కలిపి పవిత్రమైన నాలుగు స్థలాలుగా
పేర్కొంటారు. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని,
కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రదానం చేసి,
కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల
జన్మరాహిత్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది.
ఈ విధంగా అత్యంత పవిత్రక్షేటంగా కీర్తించబడిన
గాయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ
ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ
మహర్షిముందుగా పిండ
ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.
వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ
ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది. భౌద్ధమత స్థాపకుడైన
గౌతమ బుద్ధుడు గయను చేరి ఇక్కడి
అశ్వత్థవృక్షం క్రింద నలభైరోజులు పాటూ ధ్యానంలో
నిమగ్నుడై, చివరకు జ్ఞానోదయాన్ని పొందాడు. షోడశ
మహాజానపదాల కాలంలో మగధ పరిపాలన క్రింద వుండి
ప్రధానమైన పట్టణంగా గయ పేరుపొందింది. ఇదేవిధంగా
మౌర్య సామ్రాజ్యకాలంలో కూడా అభివృద్ధి చెందినా
గయకు దగ్గరలోనే గుప్తసామ్రాజ్య పాలకుడైన మొదటి
కుమారగుప్తుడు (క్రీ.శ. 414-435) నలందాలో భౌద్ధ
విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. దీనితో వివిధ దేశాల నుంచి
భారతదేశానికి భౌద్ధ అధ్యయనం కోసం వచ్చేవారి సంఖ్య
అధికం కాగా, వారు నలందాతో పాటూ ఆధ్యాత్మికంగా,
బుద్ధుడి జ్ఞానభూమిగా పేరు పొందిన ‘గయ’ను
దర్సించడంతో పాటూ దాని అభివృద్ధికి కూడా కృషి
చేయడం విశేషం.
పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే
రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని
వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప
దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి
విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి
మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన
గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు,
వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి
శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి
వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి,
యమధర్మరాజుకు పనీపాటలేకుండా పోయింది. దీనితో
వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి
మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా
జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి
త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక
నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని
ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప
యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన
ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి
అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే
ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని
యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని
బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు.
అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి
ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు.
బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు.
సకల దేవతలు, మహర్షులు అందారూ ఈ ప్రాంతానికి చేరుకోగా
బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు.
యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది.
దీనితో బ్రహ్మదేవుడు -
“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి
గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు.
దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల
కడులూతునే వుంది. ఫలితంగా
బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని
వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు.
ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది.
బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని,
తనను భరిస్తున్న గయాసురుడిని చూసి
విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని
అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన
యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ
ధన్యమైపోయింది. నా తలపై వుంచిన సిల బరువుకు ఎలా
అయినా నేను భూమిలో కూరుకుపోతాను.
ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను చూడలేరు. అయినా
ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా
వుంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ
పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా
నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల
పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని
ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.
గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు.
ఈ విధంగా గయ పితృదేవతల
ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా బ్రహ్మ దేవుడు యజ్ఞ సమయంలో శివుడితో
పాటు ఈ ప్రాంతానికి చేరిన పార్వతీదేవి శ్రీమాంగల్య గౌరీదేవిగా
కొలువు దీరినట్లు, మహర్షుల
పూజలందుకున్నట్లు కథనం.
గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో
ఫల్గుణీ, మధుర, శ్వేత అనే
మూడు నదులు సంగామిస్తూ వుండడం వాళ్ళ ఈ
క్షేతం ప్రయాగాతో సమానమైన క్షేత్రంగా
చెప్పబడుతూవుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది
ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది
అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు.
పిన్దప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే
చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని
బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా
ప్రవహిస్తూ వుందని చెప్పవచ్చు. ఫల్గుణీ నదీతీరంలో
“విష్ణుపడమందిరం" కనిపిస్తుంది. ముఖమండపం,
అంతరాలయం, గర్భాలయాలను కలిగి వున్నా ఈ ఆలయంలో
కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే
‘గదాధరుడు’ అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి
శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు.
గదను ఆయుధంగా ధరించి గడాధరస్వామిగా పూజ
లందుకుంటున్నాడు. ఈ ఆలయ ముఖమండపంలో
మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర
అడుగు పొడవు, అర్థ అడగు వెడల్పున్న ఈ
పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన
విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు.
ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని
“అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ
చెట్టుకు ‘చిరకాలం అక్షయవటం’గా వర్థిల్లమణి వరాన్ని
ప్రసాదించిందట. ఈ విష్ణుపద మందిరానికి ప్రక్కనే అష్టాదశ
శక్తిపీఠ దేవతల్లో పదహారవ దేవత అయిన శ్రీమాంగల్య గౌరీదేవి
ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయం లోని గర్భాలయంలో
అమ్మవారు దివ్యమైన అలంకరణలతో దర్శనమిస్తుంది.
ఈమెకే శ్రీ సర్వమంగళాదేవి అని కూడా పేరు. ఈమెను శ్రీ
మహావిష్ణువు సోదరిగా పేర్కొనడం విశేషం.
Like ·  · 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular