బాపూతత్త్వం
Swami Vivekananda Quotes Telugu added 2 new photos. January 9 at 4:26am · బాపూతత్త్వం ☞_/||\_☜ చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం. ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. అహింసనే ఆయుధంగా స్వీకరించాడు. సత్యవ్రతాన్ని జీర్ణించుకున్నాడు. పరుషవాక్కుకు దూరంగా ఉన్నాడు. సాత్వికాహారం తీసుకున్నాడు. ప్రకృతితో మమైకమై జీవనాన్ని సాగించాడు. ప్రజలతో సహజీవనం చేసి ‘నాయకుడు అంటే ఇలా ఉండాలి’ అని ఆచరణపూర్వకంగా చూపాడు. కోట్లాది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మహత్ముని ఆశయం... ‘గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాల్లో కుటీరపరిశ్రమలను, ఇతర చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహించాలి’… ఇది మహాత్ముని ఆశయం. భారీ పరిశ్రమల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూ, రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణే గ్రామీణాభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఏ ఒక్కరిదీ కాదు… ‘భారతీయ సంస్కృతి అందరి భావాల మిశ్రమం. ఇంట్లో అన్ని భాగాలలోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారు గాంధీజీ. ఆ...