ఓ మైగాడ్ అన్నీ ఆన్‌లైన్ సేవలే!
NEWS YOU ARE HERE: HOME >> ZINDAGI >>NEWS 1/12/2015 1:35:26 AM ఓ మైగాడ్ అన్నీ ఆన్‌లైన్ సేవలే! కలగంటి.. కలగంటి. ఇప్పుడిటు కలగంటి అని వెంకన్న కోసం వేచి చూడక్కర్లేదు. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా అని శ్రీరామచంద్రునికోసం ఆవేదన చెందక్కర్లేదు. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ.. నను బ్రోవమని చెప్పవే! అని భద్రాద్రి కోసం సీతమ్మను రికమండ్ చేయాల్సిన పని లేదు. ఒక్క మౌస్ క్లిక్‌తో అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. దర్శనం ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రసాదాలూ తెప్పించుకోవచ్చు. చేసిన మనుషులు సృష్టించిన టెక్నాలజీ గుడిమెట్ల మీద కొత్త పోకడలు సృష్టిస్తున్నాయి. -దేవుడిని నమ్మని గోపాల్‌రావు.. దేవుడి ప్రతిమలు అమ్మే షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటాడు. షాపు దగ్ధమవ్వడంతో దేవుడిపైనే కేసు వేసి కోర్టుకెక్కుతాడు. గోపాల గోపాల సినిమాలో నాస్తికుడిగా హీరో వెంకటేశ్ పాత్ర ఇది. -భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసి తన రిమోట్‌కంట్రోల్ పోగొట్టుకుంటాడు. తన రిమోట్‌ని కొట్టేసిన వారిని నిలదీస్తాడు. దేవుడిమీద ఉన్న భక్త...