కోరి వండేద్దాం..కొర్రలు!
కోరి వండేద్దాం..కొర్రలు! కోరి వండేద్దాం..కొర్రలు! కొర్రలు.. చిరుధాన్యాల్లో ఒక రకం.. చాలామందికి దీంతో అన్నం వండుకోవడమే తెలుసు..అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని మరెన్నో రకాలుగా కూడా వండవచ్చు. పీచుతోపాటూ, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందించి.. రక్తంలో చక్కెరస్థాయుల్ని సమతూకంలో ఉంచే కొర్రలతో.. ఇంకేమేం చేసుకోవచ్చో చూద్దాం. పులిహోర కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు. తయారీ: పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర ...