వంటిల్లే ఫార్మసీ…Swami Vivekananda Quotes Telugu
Swami Vivekananda Quotes Telugu January 9 at 4:36pm · వంటిల్లే ఫార్మసీ… ★★★★★★★ అత్యంత ప్రాచీనమైనది ఆయుర్వేదం. అలనాటి ఆయుర్వేద భిషగ్వరేణ్యుల అపార అనుభవసారాన్ని ఉపయోగించుకుంటే మీరు మాటిమాటికీ మందుల షాపు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ ఇంటి డ్రాయింగ్ రూమ్ నుంచి కిచెన్ వరకు నడిస్తే చాలు… ఎన్నెన్నో పెద్ద రోగాలూ మాయమవుతాయి. ఎందుకంటే మీ కిచెన్ను మించిన క్లినిక్ లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మనకు కిచెనంత దూరంలోనే అత్యంత చేరువగా ఉన్న ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకునేందుకే ఈ కథనం. ఎన్నో పరిశోధనల తర్వాత రుషిపుంగవుల సిద్ధాంత సూత్రాల్లో రుషులు చెప్పిన సిద్ధాంతాల్లో మచ్చుకు ఒకటి… ‘‘జగత్యేవమ్ న ఔషధమ్ నకించిత్ విద్యతే ద్రవ్యమ్…’’ అంటే… ‘ఈ విశ్వంలో ఔషధానికి పనికిరాని ద్రవ్యం అంటూ లేనే లేద’ని అర్థం. వంటింట్లోని వస్తువులూ ఇందుకు మినహాయింపు కాదు. చీటికీ మాటికీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నిత్యం వాడుకునే మసాలాద్రవ్యాలనే వ్యాధి నిరోధకాలుగా, ఔషధాలుగా ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. పసుపు (హరిద్రా): జలుబు, రొంప చేసినప్ప...