Monday, February 16, 2015

MAHA SHIVARATRI_2015_TELUGUDEVOTIONALSWARANJALI

MAHA SHIVARATRI_2015
శివరాత్రికి ఏం చేయాలి? ఎలా
జరుపుకోవాలి?
Courtesy: Praveen Goud goudp68@yahoo.com
సనాతన సంస్కృతిలో పండుగలంటే
కేవలం విశ్రాంతి కోసమో,
ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి
కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత,
దైవికత ఉంటుంది. ప్రతి
పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య,
శాస్త్రీయ కారణాలుంటాయి.
అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్
కిరణాలను, విద్యుత్ అయస్కాంత్
తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ
రోజున ఏ పని చేయడం వలన మనిషి
జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న
స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి
ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి
ఆయా రోజులలో ప్రత్యేక
పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి
రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు,
అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్
కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి
తన పరిపూర్ణమైన రూపాన్ని
తెలుసుకోవడానికి, ఆత్మ
సాక్షాత్కారానికి తోడ్పడుతాయి.
అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక
నియమాలు విధించారు.
1.ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి,
జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది.
శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని
శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు,
ముసలివాళ్ళకు, అనారోగ్యంతో
బాధపడేవాళ్ళకు, గర్భవతులకు,
ఔషధసేవనం చేయాల్సిన
వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది
శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు,
ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం,
గుడ్డు మొదలైనవి తినకూడదు,
మద్యపానం చేయకూడదు.
ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా,
ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని,
ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా
చేయకూడదు.
ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి
ముందే నిద్రలేచి, తలపై నుంచి
స్నానం చేసి, ఈ
రోజు నేను శివునకు ప్రీతికరంగా
శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని
సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే
పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని.
భగవంతునికి మనసును,
ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.
ఆరోగ్యపరంగా
చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న
విషపదార్ధాలను తొలగించడంతో
పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ
నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ
నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని
ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా.
ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ,
భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత
బియ్యం, ఇతర
ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని
ఆకలితో ఉన్న పేదలకు పంచాలి.
అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో
జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు.
అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా
ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి
వివేకానంద 'జీవారాధానే శివారాధాన'
అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే
చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న
శివశక్తిని శరీరం గ్రహించాలంటే,
వెన్నును నిటారుగా పెట్టి
కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో
ముందుకు వంగి కూర్చోవడం లాంటివి
చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా
ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా
అద్భుత ఫలితాలను ఇస్తుంది.
మానసికప్రశాంతతను చేకూరుస్తుంది.
మౌనం అనగానే నోరు మూసుకుని
కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో
త్రికరణములు (మనోవాక్కాయములు)
ఏకం కావాలి.
మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది
. అందువల్ల అనవసరమైన ఆలోచనలను,
వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై
కేంద్రీకరించాలి. అవసరమైతే
శివాలయానికి వెళ్ళండి, అక్కడ
రుద్రాభిషేకం చేస్తారు.
రుద్రం ఒకసారి చదవటానికి అరగంట
పడుతుంది.
మీరు అభిషేకం చేయించుకోకపోయిన
ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా
కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే
చదవబడుతున్న రుద్ర -
నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే
ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా
ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి
ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు.
విదేశాల్లో చదువుతున్న
విద్యార్ధులకు అదే పరిస్థితి
ఎదురుకావచ్చు. మరి
అలాంటప్పుడు ఏం చేయాలి?
అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన
మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ
పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత
తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక,
కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని,
శివుడి ముందో, ఆలయంలోనో
కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా
కూర్చోండి.
4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి
కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో
పొంగిపోతాడు. శివరాత్రి
నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల
భేధం లేకుండా శివుడిని
అర్చించడం వలన, అభిషేకించడం వలన
సదాశివుని అనుగ్రహంతో జీవితానికి
పట్టిన పీడ తొలగిపోతుంది.
5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న
శివత్వాన్ని జాగృతం చేస్తుంది.
జాగరణం మనలో ఉన్న శివుడిని
జాగృతం చేస్తుంది,
తమస్సును తొలగిస్తుంది.
సినిమాలు చూస్తునో, పిచ్చి
కబుర్లు చెప్పుకుంటూనో,
కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది
జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే
అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా,
ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన
పాపం వస్తుంది.
6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో,
ఓం నమః శివాయ అనే పంచాక్షరీ
మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో
నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని
జాగృతం చేస్తుంది. శివోహం అనే
భావనను కలిగిస్తుంది.
శివరాత్రి
మరునాడు ఉదయం శివాలయాన్నిసందర
్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి
వచ్చి భోజనం చేసి ఉపవాస
వ్రతం ముంగించాలి.
అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య
విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ
చేసినవారు, తరువాతి రోజు రాత్రి
వరకు నిద్రించకూడదు. అప్పుడే
సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు 
 జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపుఒడ్డున రెండు (బంగాళాఖాతాతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారాము 8. పృథ్వి 9. జలము 10. తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

-----------------------------------------------------------------------------------------------------------------------
Lord shiva 500 songs link:
https://drive.google.com/folderview?id=0B-8fCMz3zodeNWUya1M2M3FGYnc&usp=sharing_eid&tid=0B-8fCMz3zodeMlJfV1BaWlFGb2s#list
SRI SHIVAPURANAM_BHAGAVATULA SUBRAHMANYAM by ysreddy94hyd

LORD SHIVA_MY COLLECTIONS
http://www.mediafire.com/?hhmdunwodkmsf
Maha Shivarathri Special Songs....we have uploaded lord shiva songs and collections links are kept here for downloading....
Link
http://www.4shared.com/folder/UEo5f5Xp/SHIVASTUTHI.html
http://www.4shared.com/folder/ocxzSfQz/SIVA_BHAKTHI_TELUGU_DEVOTIONAL.html
http://www.4shared.com/folder/-BJev6aK/Siva_Sahasranamam.html
http://www.4shared.com/folder/2hDT0e7l/Uma_Shankara_Stuti_Mala_-_M_Ba.html
http://www.4shared.com/folder/zbP8PPpz/Lord_Siva.html
http://www.4shared.com/folder/Evx9o1Fs/01_Siva_Stuti_-_SP_Balu.html
http://www.4shared.com/folder/esC0CM9L/02_Om_Namah_Shivaya.html
http://www.4shared.com/folder/AsW7oFFY/03_Namakam.html
http://www.4shared.com/folder/GLz7Gv_w/04_Bhakti_Maala_-_various_arti.html
http://www.4shared.com/folder/Drhg2asm/05_Srisaila_Mallikarjuna_Bhaja.html
http://www.4shared.com/folder/Sg4KJvRx/Sri_Saila_Mallikarjuna__Single.html
http://www.4shared.com/folder/ZdvonYfI/Siva_Stuthi_Sri_Bramarambika_S.html
http://www.4shared.com/folder/STcCAnzv/Siva_Stuthi_Sri_Srinivasa_Stut.html
http://www.4shared.com/folder/PBDURZT5/Sivanaama_Smaranam-chanting.html
http://www.mediafire.com/?rzion4nk88xmlk8
http://www.mediafire.com/?x98116wyv26twhttp://www.blogger.com/img/blank.gif
http://www.mediafire.com/?lhl2rplvzy48i
http://www.mediafire.com/?e1ytouwdwedt1
http://www.mediafire.com/?70mcld6g1u2so
http://www.mediafire.com/?6op7d72nl7nm2
http://www.mediafire.com/?twh56wmyrlvlv
shiva_Jagjith Singh(Dhuns and Bhajans)
http://www.mediafire.com/?whq48vj7bgy0d
Maha Shivarathri Special Songs,Lord Shiva
http://www.4shared.com/dir/zVKt9nNE/LORD_SHIVASONGS.html .::SONGS LIST::. GYANA SLOKAM : Download MAHA MIRUTYUNJAYA MANTRAM : Download SRI DWADASA JYOTHIRLINGA STHOTHRAM : Download **Shiva Stuthi** Rudrastakam : Download Arthi : Download Siva Maanasa Pooja : Download Siva thandava sthothram : Download Bilvashtakam : Download Lingashtakam : Download Sivashtakam : Download Viswanathashtakam : Download All songs in One File: Download

Lord Shiva Telugu devotional Songs

http://www.4shared.com/dir/D5FpQi2j/MahaShivaratri_Songs.html


Maha Shivarathri Special Songs,Lord Shiva


http://www.4shared.com/dir/zVKt9nNE/LORD_SHIVASONGS.html

.::SONGS LIST::.


GYANA SLOKAM : Download

MAHA MIRUTYUNJAYA MANTRAM : Download

SRI DWADASA JYOTHIRLINGA STHOTHRAM : Download


**Shiva Stuthi**
Rudrastakam : Download

Arthi : Download

Siva Maanasa Pooja : Download

Siva thandava sthothram : Download

Bilvashtakam : Download

Lingashtakam : Download

Sivashtakam : Download

Viswanathashtakam : Download

All songs in One File: Download

Lord Shiva Telugu devotional Songs


http://www.4shared.com/dir/D5FpQi2j/MahaShivaratri_Songs.html

.::SONGS LIST::.

Lingashtakam: Download

Sivashtakam: Download

Bilvashtakam: Download

Viswanathashtakam: Download

Rudrastakam : Download

Maha Mrutyunjaya Mantram: Download

Siva thandava sthothram: Download

Siva Maanasa Pooja : Download

Rudram Namakam Chamakam: Download

Sree Saila Mallikarjuna Suprabhatam: Download

Siva Naamaavalastakam : Download

Siva thandava sthothram : Download

Hara Om Namashivaya-1 : Download

Hara Om Namashivaya-2 : Download


"Shivoham Telugu Devotional Mp3 Songs"

Chidananda : Download
Chidananda 1 : Download
Jata kataha : Download
Namo Bhutanadam : Download
Prabhu Meesha : Download
Ratna Saanu : Download
Samba Sadashiva : Download
Vishveshwara : Download
All songs in a single file : Download

శివరాత్రి శుభాకాంక్షలతో కినిగె అందిస్తున్న ప్రత్యేకమైన కానుక. రామకృష్ణ మఠం వారి శ్రీ శివ మహాపురాణం!

వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” - అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏ�° �ు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.
పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరింà ��ాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.
“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్‌” - భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది. మఠం ద్వారా ప్రథమంగా వెలువడుతున్న ఈ శివ మహా పురాణాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ...
ప్రకాశకులు
Preview free download of this Telugu book is available at Sri Shiva Maha Puranamu


No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular