జీవిత గమ్యం మోక్షం

జీవిత గమ్యం మోక్షం
Updated : 2/3/2015 1:09:08 AM
Views : 29
ఆశయం గొప్పదైతే సాధన కూడా గొప్పగానే ఉంటుంది. ఫలితం మరింత గొప్పగా లభిస్తుంది. అయితే ఆశయం నిర్దేశించుకునే ముందు చిన్న చిన్న కోరికలే జీవిత చరమాంకాలని భావించి వాటికై జీవితమంతా ధారపోస్తే మిగిలేది శూన్యం. త్యాగనిరతితో, సత్సంబంధవాత్సల్యంతో జీవిత సాధన చూసి సంతృప్తి అనే మోక్షమునూ, పురుషార్థసారమైన మోక్షమునూ పొందగలము.

దేహాది సంసక్తిమతోన ముక్తిః
ముక్తస్య దేహాద్యభిమత్య భావః
సుప్తస్య నో జాగరణం నజాగ్రతః
స్వప్నస్త మోర్చిన్న గుణాశ్రయత్వాత్‌॥

నిద్రపోయిన వారు మేలుకొని ఉండరు. మేలుకొని ఉన్నవారికి స్వప్నం రాదు. నిద్ర ఉండదు. పరస్పరం భిన్నమైన గుణములు కల విషయాల మధ్య ఎలాగైతే సాపేక్ష్యముండదో శరీరం బంధం కలవారికి ముక్తిలేదు. ముక్తి కలిగిన వారికి శరీరంపై మమకారం ఉండదు. దేశమంటే మట్టికాదు, మనుషులన్నట్లు - దేహం అంటే వస్తువు కాదు మనిషి. కలల్లో కాక వాస్తవంలో బతకాలనే సందేశం చెబుతు న్న సనాతన ధర్మం మనిషిని ఉత్తమ మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నబద్ధమై భాసిల్లుతుంది.

మనం మన దివ్యతత్తాన్ని తెలుసుకొని జీవితం అందించిన ప్రతి మలుపునూ దాటుకుంటూ నిజగమ్యమైన మోక్షపదం పొందాలని ఆకాంక్షిస్తాం. ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందానుభూతి ని పొందాలనుకుంటాం. కానీ అజ్ఞానం అనే శత్రువు మనలోనే ఉంటూ అంతులేని కోరికలతో మనసును అల్లకల్లోలం చేస్తుంది. శరీరానికి దాసోహం చూపే కోరికలు స్వార్థాన్ని పెంచి పోషిస్తాయి. నేను బ్రతకాలనుకోవడంలో తప్పులేదు. నేనే బ్రతకాలనే స్వార్థం కోరికల వలయంలో మనిషిని కట్టిపడేస్తుంది.

నిజతత్తాన్ని తెలుసుకోలేకపోవడమే నిద్ర. సత్యాన్వేషణతో దివ్యతత్తాన్ని గ్రహించడమే మెలు కువ. రోజూవారి జీవితంలో పొద్దున భోజనం చేస్తే కడుపునిండుతుంది. మళ్ళీ రాత్రికి ఆకలి వేస్తుం ది. ఇది ఎంత సహజమో జీవిత తత్తాన్ని తెలుసుకోవడం అంతే సులభం. భగవంతుడు ఇ చ్చిన జీవితాన్ని కర్తవ్యంతో, తృప్తితో గడుపుతూ అన్నింటికీ దేవుడిదే భారమనే విశ్వాసాన్ని పెం పొందించుకోవాలి. వాస్తవాన్ని గ్రహించి ఆనందానుభూతిని ఆత్మ సాక్షాత్కారంగా పొందడమే మోక్షం.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి