సామాన్యుడికి జనరిక్ అభయం
సామాన్యుడికి జనరిక్ అభయం Posted On:2/26/2015 2:38:05 AM -రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం -ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పేదలకు ఏటా రూ.కోట్లలో ఆదా వైద్యుల సహకారమే కీలకమంటున్న నిపుణులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణ జ్వరం వచ్చినా ఓ మోస్తరు వైద్యుడు కూడా యాంటీ బయోటిక్స్ మందులు రాయడం సహజం. కనీసం వారంపాటు ఆ మందులు వాడాలంటే రూ.వందల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పది రూపాయల విలువైన మందులు రెండు రూపాయలకే వస్తే?! సామాన్య జనానికి ఏటా రూ.కోట్లల్లో డబ్బు ఆదా అవుతుంది. ఇందుకు మార్గం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన దవాఖానలన్నింటిలోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని బోధన, ప్రధాన దవాఖానలతోపాటు ఏరియా దవాఖానాల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే చర్చ మొదలైంది...