Posted On:12/27/2014 1:46:17 AM
|
ఆశ్రమమును చేరుకున్న అర్జునుడు ద్రోణాచార్యునితో ఇట్లనెను. గురువర్యా ! ఏకలవ్య నామధేయుడైన మీ శిష్యుడు నా కన్నా మేటి ధనుర్ధరుడు అని విషయమంతా పూసగ్రుచ్చినట్లు వివరించెను. కొద్దిసేపు మౌనంగా ఉన్న ద్రోణాచార్యుడు ఆ పిదప అర్జునున్ని తీసుకొని ఏకలవ్యుని దగ్గరకు చేరుకొనెను.
ఆ సమయములో ఏకలవ్యుడు ఎడతెరపి లేకుండా బాణములు సంధిస్తూ అభ్యాసము చేయుచుండెను. ఆచార్యున్ని చూడగానే ఏకలవ్యుడు దగ్గరగా వచ్చి సాష్టాంగ దండ ప్రణామమాచరించి, విధి పూర్వకముగా పూజచేసి, రెండు చేతులు జోడించి ఎదురుగా నిల్చుండెను. వాస్తవముగా నా శిష్యడవైనచో నాకు గురుదక్షిణ ఇమ్మని ద్రోణాచార్యుడు కోరెను. ఏది కోరినా ఇస్తానని ఏకలవ్యుడు అనెను. నీ కుడిచేతి బొటనవ్రేలునిమ్మని కోరినదే తడవుగా దానిని తెగనరికి ఆచార్యునికిచ్చెను. అప్పటి నుండి ఏకలవ్యుని బాణవిద్య అంతరించెను.
- యం.వి.నర్సింహారెడ్డి
No comments:
Post a Comment