Posted On:12/5/2014 1:28:53 AM
|
తెలంగాణ రాష్ట్రం సిద్ధించటమంటే తనకు ఆకలి కడుపులో అమృతం కురిసినట్లుందని పరమానంద భరితుడైనాడు. పసిపాపగా కేరింతలు పెట్టినారు. డొంకెనది అహరహం స్త్రీల పట్ల ఆవ్యాజమైన గౌరవ దృక్పథం. ఆమె ఎత్తు ఆకాశమంతటిదన్నడు. ఈలోకంలో అద్భుతమైన అమ్మ నడక ఆగలేదు అని నినదిస్తూ నిలిచాడు. రైతన్న గుండెదడను, నేతన్న పోగుల పేగులు తెగిన సవ్వడిని తన కవిత్వంతో వినిపిస్తూ కష్టాలు, కన్నీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై కవితలల్లాడు. ఆయన పలుకుల్లో మాండలిక పదాలు, పలుకుబడులకు లోటుండక అవి తొణిసలాడుతూ వస్తాయి. అందుకే ఆతని తొలి కవితా సంపుటి అమ్మను భవనగిరిలోనే ఆవిష్కరించిన ప్రజాకవి కాళోజీ- అతనివి విద్యాలయాల్లో చదివిన చదువులు గాక (బడిపలుకులు గాకుండా) పలుకుబడులను (పామర జనరంజకాలని) శ్లాఘించాడు. గుడిసె మన తొలి నీడ అని పొయ్యి మనకు పూర్వీకులిచ్చిన ఆగ్నిహోత్రమని, అడవే అంతిమంగా అందివచ్చే దేశసంపదని, ఎరుకజేస్తూ అనేక కవిత లల్లాడు. అమర శిల్పం ముందు ఎవరెస్టు శిఖరమైనా తలవంచుతుందని సగర్వంగా ప్రకటించిన కవి శ్రేష్టుడు డొంకెన.
నిన్న(డిసెంబర్ 4)ఉదయమే ఈ ప్రపంచానికి వినమ్రంగా వీడ్కోలు పలికి, తన ఆత్మీయ కవితా ప్రపంచావరణాన్ని మిత్రుల కు, అనుచరులకు అప్పగించిన అమర కవి.అమ్మనే సర్వవ్యాప్తం అన్న డొంకెన శ్రీశైలంగారికి అశ్రునయనాలతో... వీడ్కోలు!
-వేణు సంకోజు
జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధానకార్యదర్శి
జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధానకార్యదర్శి
No comments:
Post a Comment