Tuesday, December 5, 2017

TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_1 to 6 SONGS WITH LYRICS



TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_1 to 6 SONGS from Yedavalli Sudarshanreddy on Vimeo.
https://vimeo.com/246045404 TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_1 to 6 SONGS....Telugu Gazals_1. Aatmalanu Palikinchede Asalaina Basha Movie: Telugu Ghazals Song: Aatmalanu Palikinchede Asalaina Basha lyricist: CNarayana Reddy Singers: CNarayana Reddy Music Director: SRajeswara Rao
 1.ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠశోష వేదం ఖురాన్ బైబుల్ వీధిలోన పడతాయా మతమేదైన ఒకటేలే ప్రతీమనిషి శ్వాస అవినీతికి పీఠం వేసి అభ్యుదయం కూర్చిన జాతి యికనైన కళ్ళు నులుముకో యిది రక్తఫెూష నానాటికి ఏమీపతనం నాలో తీరని మథనం ప్రభుత్వాలు ఏమైతేమీ పైసాపై ధ్యాస తలనెరిసి పోతే దిగులు తనువూరి పోతే దిగులు అది దిగులు కాదు సినారె తుది జీవితాశ...
vimeo.com/229256990 https://www.dropbox.com/sh/s2xsrnsz6yzh81r/AADqDcLNesGxskkyuDzAc8FBa?dl=0
2.మరణం నను వరించి వస్తే యేమంటాను నేనేమంటాను పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను లంచం నను భజించి వస్తే యేమంటాను నేనేమంటాను తిరుమలగిరి హుండిలో చొరపడమంటాను కామం నను కలవర పెడితే యేమంటాను నేనేమంటాను అలిగిఉన్న పడుచు జంటతో కలపడమంటాను క్రోధం నను కవ్విస్తుంటే యేమంటాను నేనేమంటాను పసచచ్చిన పేడిజాతిలో బుసలిడమంటాను లోభం నను ఉలిపిస్తుంటే యేమంటాను నేనేమంటాను తెగవొలికే కవిపలుకుల్లో దిగబడమంటాను అహంకారమెదురై వస్తే యేమంటాను నేనేమంటాను నరునివదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను కాలం పులిలా గాండ్రిస్తే యేమంటాను నేనేమంటాను దిగులెందుకు ఓయిసినారే తెగపడమంటాను...
3.నా హృదయం చలించి పోగానే నడకలు నేర్చుకుంది ఆకాశం నా నయనం భ్రమించి పోగానే నవ్వులు రాల్చుకుంది మధుమాసం తనలో తాను నీడ చూసుకొని తననే తడిపి ఆరవేసుకోని ఎదలో తనకు చోటు చాలదని పెదవిని చేరుకుంది దరహాసం (నా హృదయం) వీచే గాలి పిలుపు గమనించి ... పూచే నేలేరుపు పరికించి పెదవుల బాసలింక చాలునని పిడికిలి కోరుకుంది ఆవేశం (నా హృదయం ) బ్రతుకే ఆటలగ భావించి. పగలే కాగడాలు వెలిగించి ఆఖరి జాములోన చితిలోన అత్రువులేరుతోది పరిహాసం (నా హృదయం ) ఎదురుగ ఎండమావి రమ్మన్నా ఇదిగో చేదబావి అంటున్నా కదలని ఓ సినారే నిను చూసి కాలం మార్చుకుంది తనవేశం (నా హృదయం )
4. Parulakosam Paatupadaniపరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని / 2/ మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని 1: తాతలు తాగిన నేతుల సంగతి - 4....... నీతులుగా తాతలు / పలికెను మన సంస్కృతి జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని - /పరుల/ ఆ ..ఆ...ఆ...ఆ 2: ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు పద పద మంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని - /పరుల/ 3: జలవిద్యుత్తుకు కరువేలేదు , జనసంపత్తికి కొరవే లేదు అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేవికిని /పరుల/ 4: శిశు హృదయానికి కల్లలు లేపు, రసరజ్యానికి ఎల్లలు లేవు లోపలి నలుపు సినారె కు తెలుసు, పైపై తొడుగు దేనికని / పరుల/
5. Yenta_Cheekati_Kaalcheno_Intha_Challani_Taaraka_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక కాలమేమెూ బరువు బరువు కంటికేమో నిదుర కరువు ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక సూది పోట్లకు గుండె సాచి బాధలను భాష్యాలు వ్రాసి ఎంత కీర్తిని మోసేనే ఇంత మొత్తని మాలిక కాంక్షలేమో కదలిపోగా ఆంక్షలెన్నో ఎదురు రాగా ఎంత ఓర్పు వహించెనో ఇంత తీరని వేడుక మంచు దాడులు జరుగుతున్నా మండుటెండలు రగులుతున్నా ఎంత మట్టిని పీల్చెనో ఇంత పచ్చని వాటిక యేరు దాటితే యెవరు వారే ఏమి లోకం ఓ సినారే యెంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక....
6.Yevo Yevo Baadalu Barinche Mooga Jeevitam_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY యేవో యేవో బాధలు భరించె మూగ జీవితం ఎన్నో ఎన్నో గీతలు ధరించె తెల్లకాగితం 1.సుతకోటి హితకోటి వున్నా గత వైభవం చాటుతున్నా ఎంతో ఎంతో వేదనా సహించే మాతృ భారతం 2. చిరునవ్వు జలతారు లున్నా సరదాల రహదారులున్నా అవునా అవునా లోకమే అనంత శోక పూరితం 3. పొరలేని తత్వార్థమున్నా దివిలోని వృత్తాంతమైనా అయినా అయినా కావ్యమే అనూన్న కల్పనామృతమ్ 4. తన గొంతు తడి ఆరుతున్నా మునుముందు యే కొండలున్నా ఏరై పారే జాతికే సినారె గీతి అంకితం

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular