Tuesday, March 15, 2016

27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక

27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక

27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో    అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో e-తెలుగు ప్రతి సంవత్సరం లాగానే  ఒక స్టాలు తీసికొని నిర్వహించింది. ఈ సారి కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగరులు  ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.e తెలుగు స్టాలు
  • గత పుస్తక ప్రదర్శనలో కన్నా ఈ  సారి ఎక్కువమంది సందర్శకులు వచ్చారు , స్టాలుల సంఖ్య పెరిగినది
  • ఈ ఏడు చాలామంది సందర్శకులకు అంతర్జాలం లో తెలుగు వాడకం గురించి తెలుసు , యూనీకోడు వాడకం వలన అవగాహన పెరిగినది.
  • కంప్యూటర్ లో తెలుగు వాడకం,తెలుగు వికీపీడియా, మరీ ముఖ్యంగా అంతర్జాలం లోని సాంఘికజాలనెలవులలో(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్)  తెలుగు ఉపయోగం వంటివి గురించి అనేకమందికి సందర్శకులకు వివరించాం. 
  • తెలుగు టైపు చెయ్యడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొంతమంది తగు పరిష్కార సూచనలను పొందారు.
  • వివిధ రకాల కీబోర్డులను వాడుతూండే వారు అవే కీబోర్డులతో యూనికోడులో కూడా తెలుగు టైపు చెయ్యవచ్చని తెలుసుకొన్నారు.
  • అనేకమందికి వచ్చిన సందేహం.. "ఈ తెలుగు సాఫ్టువేర్లను కొనుక్కోవాల్సి ఉంటుందా" అనేది. ఈ సాఫ్టువేర్లన్నీ ఉచితమే అని చెప్పినపుడు ఆశ్చర్యానందాన్ని తెలియజేసారు.
  • మైక్రోసాఫ్టు , తెలుగువిజయం, సురవర వారి ఖతులు  ,బరహా ,గూగుల్ లేఖనా ఉపకరణాలను సందర్శకులు ఉచితంగా అందించాం.
  • ఎప్పటివలే e-తెలుగు కరపత్రాలు సందర్శకులకు ఇచ్చాం , చాలామందిupport@etelugu.org కు వారి సాంకేతిక ప్రశ్నలు మెయిల్ చేశారు
  • e తెలుగు కరపత్రాలు  
  •  

 తెలుగు లో బ్లాగులు , ఫేస్ బుక్ ,

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular