ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం...      సాయి రామ్ సేవక బృందం కర్మ,భక్తి,జ్ఞాన యోగ  సంబంద రహస్యాలను చిత్ర రూపంలో  సేకరణ చేసి ఉడతా భక్తిగా  అందిస్తున్నాము!   ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము  కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. భగవంతుని యందు శ్రద్ధ ఎలా ఉండాలి ?  బావిలో ఉన్న కప్ప అదే ప్రపంచం అనుకొంటుంది, అలాగే అజ్ఞానంతో జీవుడు కూడా తాను పరిమితుడు అని తలచుతున్నాడు!  బావిలో ఉన్న కప్ప ఎలా అయితే తన భౌతిక పరిది(బావి) ని దాటి ఏదయినా సముద్రం వుందని చెప్పితే ఎలా వినిపించుకోదో, శాస్త్రవేత్త తన బౌతికపరిది ని దాటి అనంత శక్తి వంతమైనది ఒకటి వుందంటే వినిపించుకోడు!  కర్మ నుంచి ఎట్టి పరిస్థితులోనూ తప్పించుకోలేవు, ఒక్క భగవంతునిపై పరమ ప్రేమ(భక్తి), (ఆత్మ) జ్ఞానం వల్ల తప్ప!  భగవంతుని జగన్నాటకంలో సత్,రజో,తమో అనే గుణాలచేత జీవుడు అడబడుతున్నాడు! శరీరం రథం. రథం నడిపే రథికుడు బుద్ధి. మనస్సు రథానికున్న గుర్రాలన...