Tuesday, May 26, 2026

పాడెద నీ నామమే గోపాలా.... హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా # special video #must watch

 TO DOWNLOAD VIDEO : CLICK HERE 

పాడెద నీ నామమే గోపాలా TELUGU WIKI LINK:


పాడెద నీ నామమే గోపాలా....
పాడెద నీ నామమే గోపాలా....
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 1
మమతలలోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 2
నీ ముర ళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ ముర ళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై (2)
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా ॥


చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : దాశరథి
గానం : పి.సుశీల

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...