Tuesday, October 31, 2023

ఎవరడిగారు! .....- Kallem Naveen Reddy

 
ఎవరడిగారు! .....- Kallem Naveen Reddy - Kamareddy
రైతులు 24 గంటల ఉచితవిద్యుత్ అడిగారా? 
రైతులు రైతు బంధు అడిగారా? దళితులు దళిత బంధు అడిగారా? 
గురుకులాలను కట్టమని అడిగామా? వికలాంగులు పెన్షన్ వెయ్యి పెంచమని అడిగారా? 
కాళేశ్వరం కట్టుమని అడిగామా? మిషన్ భగీరథ నీళ్ళివ్వమని అడిగామా? 
జిల్లాకో మెడికల్ కాలేజ్ అడిగామా? జిల్లాకో కలెక్టరేట్ భవనం అడిగామా? 
అమరవీరుల స్థూపం కట్టమని అడిగామా? సచివాలయం కట్టమని అడిగామా? 
అంబేద్కర్ విగ్రహం కట్టమని అడిగామా? ఐటీ హబ్ లు కట్టమని అడిగామా? 
పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం కట్టమని అడిగామా? 
వివిధ దేశాల నుండి పెట్టుబడులను తీసుకురమ్మని అడిగామా? 
తెలంగాణను దేశంలో గొప్ప రాష్ట్రంగా నిలపమని అడిగామా? 
దేశంలోని రైతుల కోసం ఆలోచించమని అడిగామా? 
ఇలా చెప్పుకుంటే పోతే వందలున్నాయి మనం వీటిలో ఏమి అడగలేదు 
ఇట్లా మనం అడగకముందే అన్ని చేసిన కేసిఆర్ గారు ఇంకెన్ని 
చేస్తాడో చూసే ఓపిక ఉండాలి కదా! ఆయన జీవితమే ఒక పోరాటం రాష్ట్రం కోసం 
పరితపిస్తూ ఆయనెప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు అతను 
నిరంతర ప్రవాహం నిత్యం అనేక ఆలోచనలతో ప్రయాణం చేస్తూనే ఉంటాడు 
ఇంకెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తాడు! ఆయన్ని దూరం నుండి 
చాలా దగ్గరిగా గమనించాను ఆయన ఆలోచనల్లో భాగమై చాలా 
 సందర్భాల్లో చెప్పాను ఒకటి మాత్రం నిజం ఆయన తరంలో 
మనం ఉండటం నిజంగా అదృష్టమే ఎవరు అవునన్నా 
ఎవరు కాదన్నా చరిత్ర ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది 
చరిత్రను ఎవరు మార్చలేరు ఆయనొక నూతన ప్రపంచం 
ఆయనొక ప్రపంచ పుస్తకం! - Kallem Naveen Reddy - Kamareddy

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular