Thursday, October 12, 2023

ॐ గీతాసారము శాంతికి మార్గము పూజ్యులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య సందేశము

ॐ గీతాసారము శాంతికి మార్గము పూజ్యులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య సందేశము మిత్రమా! ఎందుకు బాధపడుతున్నావు! అయిందేదో అయింది - పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు - వట్టిచేతులతో వచ్చావు! పోయేటప్పుడు- లగేజితో పోవాలనుకుంటున్నావు! అందుకే నీకీ ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తునావు! నీవేమి తెచ్చావని - నీవు పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావని - నీకు నష్టం వచ్చింది? నీవు ఏదైతే ఇచ్చావో - ఇక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరుగక మానదు - అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కారు లేదని చింతించవద్దు - కాలు వున్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు - కూటికి వుందిగా! సంతోషించు. కాలిలో ముల్లుగుచ్చుకున్నదని చింతించవద్దు - కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కాలం విలువైనది - రేపు అను దానికి రూపులేదు. మంచిపనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు అహంకారాన్ని అణగద్రొక్కు, హింసను విడనాడు - అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు - ఆవేశంతో ఆలోచించకు. ఉపకారం చేయలేకపోయినా - అపకారం తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం మానవత్వం లేని మతం మతంకాదు. దేవుని పూజించు ప్రాణికోట్లకు సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత వుండగలదు. ఓం శాంతిః శాంతిః శాంతిః ఫోన్: 8919710757

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular