- ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనము [1 Update]
- ఏమిటి? ఎందుకు? [1 Update]
- సాధువు లక్షణం [1 Update]
- గేమ్ అఫ్ గుడ్ క్వాలిటీస్. [1 Update]
- మీకోసం ............. [1 Update]
- శ్రీ గురు గీత [1 Update]
- TWELVE-FOLD DISCIPLINE - Swami Paramatmananda [1 Update]
- Duty, like and dislikes [1 Update]
- Quote of the Day [1 Update]
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
Please find attachment.
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
బుద్ధ భగవానుడు ఒక వనంలో కూర్చొని శిష్యులకు బోధ కావిస్తున్న తరుణంలో,
'ఆమ్రపాలి' అనే వేశ్య అక్కడకు వచ్చినది, కాని ఆమెను బుద్ధుని శిష్యుడు స్వామి
దర్శనానికి అనుమతించేందుకు వెనుకాడాడు. అప్పుడు తథాగతుడు ఇట్లు వచించెను.
'వృత్తి యొక్క ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనములో ఉంటాయి, అంతఃకరణ ప్రవృత్తి మనిషిని
వృత్తికి అతీతుణ్ణి చేస్తుంది'అని ఆ పిదప ఆమెకు బుద్ధని దర్శనం సిద్ధించటం
తోపాటు, భిక్ష నొసగే భాగ్యం లభించింది.
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 22 12:33PM +0530
*బోధ - ప్రబోధ *
*'బోధ' అంటే చెప్పడం. 'ప్రబోధ' అంటే తాను దర్శించి, అనుభూతి పొందిన అంశాన్ని
ఇతరులతో పంచుకోవడం. సబ్బులకు ప్రచారం చేసుకుంటారు. కానీ, గీతా ప్రచారం
ఏమిటి? భగవద్గీత ప్రబోధించే ధర్మం, జ్ఞానం ఇవేవీ అంగడి సరుకులు కావు.
అందుచేత వీటికి ప్రచారం అనే మాట తగదు. వీటిని బోధిస్తారు. అవగాహన చేయించడం
అని దాని అర్థం. ఒక అంశం పట్ల ఇతరులలో అవగాహన కలిగించాలంటే, ముందుగా ఆ
బొధకుడికి దాని పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. అట్లాంటి వారి బోధలని ప్రభోధ
అంటారు. *
*మతం - ధర్మం *
*మనిషికి మతం కొన్ని వాక్యాలను చెబుతుంది. ఆ వాక్యాలు మనిషిని విశ్వాసం వరకే
పరిమితం చేస్తాయి. ధర్మం అలా కాదు. విశ్వాసంతో ప్రారంభించి, వాస్తవం వద్దకు
నడిపిస్తుంది. అందుకే ధర్మాన్ని ధర్మమనే అనాలి. మతాన్ని మతమనే అనాలి. *
*ధర్మం వ్యక్తికి ఏం నేర్పుతుంది?*
*సంపదలు, సదుపాయాల పరిధిని, పరమావధిని తెలియజెప్పడం ధర్మ ప్రబోధం లో ఒక భాగం.
ధర్మానికి మూడు కోణాలున్నాయి. మొదట నేర్చుకోవలసినది కుటుంబ ధర్మం. కుటుంబ
సభ్యుడుగా తన బాధ్యతలేమిటి? కుటుంబ గౌరవాన్ని పరిరక్షించడంలో తన పాత్రను ప్రతి
వ్యక్తీ తెలుసుకోవాలి. తరువాతది సామాజిక ధర్మం. మనిషి మనుగడ సమాజంతో
ముడిపడి ఉంది. కాబట్టి సమాజం పట్ల తన కర్తవ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
తెల్లబట్టలు ధరించిన ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. సీటులో కూర్చునే ముందు ఓ
కాగితం ముక్కతో తుడిచాడు. ఎందుకో తెలుసా! బస్సును శుభ్రపరచడానికి కాదు.
సీటుకున్న మురికి తనకు అంటకూడదని. అలాగే, సమాజం పట్ల మన కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తున్నామంటే 'అది మన మేలుకే' అనే గ్రహింపు ఉండాలి. ఇక మూడో అంశం
ఆత్మధర్మం. పుట్టిన ప్రతి వ్యక్తికీ ఓ అంతిమ ఘడియ ఉంటుంది. అది సమీపించే లోపే
నేనెందుకు పుట్టాను? నేను ఏం చేయాలి? ఏం చేయకూడదు? *
*నేను ఎం చేస్తే ఈ జన్మ సార్థకమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలిస్తుంది
ధర్మం. ఈ విధంగా ధర్మం మీద ఎంతో స్పెషలైజేషన్ చేసిన సంస్కృతి మనది. దీనిని
మరచి ఒక్క డబ్బుకే ప్రాధాన్యమివ్వడం వల్ల దిశానిర్దేశం కొరవడి సమాజం వెర్రి
తలలు వేస్తోంది. కారుకి పెట్రోలును ట్యాంకులోనే నింపాలి. డిక్కీలో, ముందు
సీటులో, వెనుక సీటులో అంతా పెట్రోలు పోసుకుని ప్రయాణం సాగించలేం. అలాగే,
డబ్బుకి కూడా జీవితంలో ఒక కీలక స్థానముంది. *
*(అయ్యా .. పై వాక్యాలు వ్రాయడం వల్ల నేను ఏమి communicate చేయదలచుకున్నాను
అని ఆలోచిస్తే నాకే అర్థం అవడం లేదు. కాని, ఒక Magazine చదువుతుంటే బాగా
అనిపించి పంచుకుంటున్నాను. క్షమించ గలరు) *
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 22 11:50AM +0530
*డేగ చాలా పైకి వెళుతుంది. కానీ, దాని చూపు మాత్రం నేల మీద చచ్చిన వాటి కోసం
గాలిస్తూ ఉంటుంది. అదే ఒక విత్తనాన్ని లోతుగా కప్పిపెడితే భూమిని చీల్చుకుంటూ
ఊర్ధ్వదిశగా పెరిగి, పది మందికి నీడనివ్వడానికీ, ఫలాల నివ్వడానికి
తపిస్తుంది. అథోముఖ దృష్టిని, నీచ దృష్టినీ మార్చుకుని ఊర్థ్వ దృష్టిని
పెంపొందించుకునే వారెవరైనా సాదువులే (సన్యాసులే). ఇది లేకుండా కేవలం బట్ట
మాత్రం కడితే, అది కపటత్వమే అవుతుంది. *
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 22 11:39AM +0530
అనగనగా ఒక సాధువు ఉండేవాడు. ఒక ఊరి ప్రజల జీవితాలలో సుఖ శాంతులు ఎలా
హరించిపోయాయో ఆ సాధువుకు తేలిగ్గానే అర్థమయింది. విరుగుడుగా తానో పూజ
చేస్తాననీ, దాని కోసం ఇంటికొక గ్లాసుడు పాలు తెమ్మనమనీ చెప్పాడు. ఓ గంగాళం
పెట్టి దానిలో అవి పోయండని కోరాడు. ఆ ఊరిపెద్ద అనుకున్నాడు, తను గ్లాసుతో
నీళ్ళు తెచ్చి పోసినా ఎవరూ తెలుసుకోలేరు కాబట్టి, పాలకు బదులుగా నీళ్ళు
తెచ్చ్చి పోసేద్దామని. అదే చేశాడు. అందరూ తమ తమ వంతు పోయడం పూర్తీ చేశాక,
సాధువు ఊరిపెద్దతో "మూత తీసి చూడు! అన్నీ నీళ్ళే ఉన్నాయా? లేక పాలేమైనా
కలిశాయా" అని కోరాడు. మూత తీసి చూస్తె గంగాళంలో అన్నీ నీళ్ళే ఉన్నాయి.
వాటిలో చుక్క పాలు కలవలేదు. ఉరిపెద్దకు అప్పుడు తెలిసింది, ఊళ్ళో అందరూ
తనలాగే వ్యవహరించారని. ఊరిపెద్దతో సహా అందరూ రెడ్ హ్యాండెడ్ గా
దొరికిపోయినట్లైంది. ఆయన వంక చూస్తూ సాధువు అన్నాడు, "ఏముందీ! యథా రాజా తథా
ప్రజా' అని సుక్ష్మంగా ఇదీ కథ.
సాధువుకు కోపం రాలేదు. పైగా ఊరివాళ్ళ మీద మనసులో చాలా జాలి కలిగింది.
యుక్తిగా వాళ్ళను బాగు చేయాలని తలపోశాడు. ఆయన వాళ్ళకి ఎలాంటి ఉపన్యాసము
ఇవ్వలేదు. తిట్టలేదు. శపించలేదు. 'రండి ఒక ఆట ఆడదాం' అని నవ్వుతూ
ఆహ్వానించాడు.
అందరూ ముందుకి వచ్ఛారు. అందులో ఇద్దరు విద్యార్థులను, ఒక మహిళను, ఒక
వృద్ధుడిని ఎంపిక చేసి వారిలో మొదట ఒకరిని కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ ఉన్న
ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిలో తమకు తెలిసిన సుగుణాలను మాత్రం చెప్పాలన్నాడు.
ఒకరు చెప్పినవి మరొకరు చెప్పకూడదు. అలా దాదాపుగా అందరూ చెప్పిన మీదట ఎంపిక
చేసిన అయిదుగురిలో రెందవ వ్యక్తిని కుర్చీలో కుర్చోపెట్టారు.
తిరిగి ఆ వ్యక్తిలో తాము గమనించిన సుగుణాలను చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ
చెప్పాలన్నారు. తరువాత మూడో వ్యక్తిని ..... అలా అయిదుగురి గురించి
చెప్పించడంతో ఆ రోజుకు ఆట సమాప్తం అయ్యింది. అదీ ఆట. తిరిగి మరోసారి
సమావేశమైనప్పుడు, లాటరీ పద్ధతిమీద మరి కొందరి వంతు వస్తుందని ప్రకటించారు.
ఎంతమందిని అనేది మన సమయాన్ని బట్టి, సదుపాయాన్ని బట్టి నిర్ణయించు కోవడమే.
కాలనీ వాసుల మానవ సంబంధాలలో ఈ ఆట మార్పు తెచ్చిన తీరు చాలా సంతోషం
కలిగించింది. అది ఏ విధంగా జరుగుతుందనే విశ్లేషణ అవసరం లేదనుకుంటాను.
ఈ ఆటను ఆడేవారి అభిరుచికి అనుగుణంగా మలచుకోవచ్చు. ఉదాహరణకు పాల్గొనే వారు ఎంత
మందో అన్ని చీటీలు రాసి, మడత పెట్టి, పాత్రలో వేయాలి. రెండు లేక మూడు చీటీ ల
మీద సన్మానం అని రాసి ఉంటుంది. తక్కిన చీటీల మీద రాసి ఉండేవి మచ్చుకు గీతా
శ్లోక పఠనం, తెలుగు పద్య పఠనం, దేశభక్తి గీతం పాడడం, సంస్కృత శ్లోకం చెప్పడం,
ధర్మానికి-మతానికి తేడా ఏమిటో చెప్పడం, మిమిక్రీ చేయడం, పిట్టకథ చెప్పడం,
భక్తి పాట పాడడం, ఎవరు తీసిన చీటీలో ఏది వస్తే వారు ఆ ప్రకారం చేయాలి. ఒకరు
చెప్పినదే మరొకరు చెప్పరాదు. సంస్కృత శ్లోకం మాత్రం చూసి చదవవచ్చు. సన్మానం
అనే చీటీ వచ్చిన వారిని పెద్ద కుర్చీలో కూచోబెట్టి, వారిలో తాము గమనించిన మంచి
లక్షణాలను తక్కిన ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఇదీ ఆట. ఈ చివరిదే ఆటలో కీలకం.
ఈ ఆటే జీవిత బాట అవాలి. పరిచయస్తులందరి లోనూ సుగుణాలను చూసే అలవాటు
చేసుకోవడమే మార్గం.
ఇతరులలో దోషాన్ని వెదికే ప్రమాదకరమైన స్వభావాన్ని విడిచి పెట్టు. ఇతరులలో
మంచితనాన్ని గాంచే శక్తిని అభివృద్ధి చేసుకో. ఇతరులను కీర్తించు. అప్పుడే
నువ్వు కూడా అందరి ప్రేమను అందుకుని, గౌరవాన్ని పొందగలవు.
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 22 11:10AM +0530
*వాస్తుశాస్త్రం అంటే ఏమిటి?*
గృహాలలో వాస్తు పురుషుడు వసిస్తాడు. వాస్తు పురుషుని పూజించనిదే నిర్మాణం
జరుపరాదు. *'వాస్తవికత్వాత్ వాస్తు'*. కట్టడాలు, నిర్మాణాలు చేసేటప్పుడు ఏ
దిశలో ఏ నిర్మాణం జరగాలో, ఏ గది ఎలా ఉండాలో, ద్వారాలు, కిటికీలను ఏ దిశలలో
నిర్మిస్తే ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో జీవిస్తామనే విషయాలను వివరిస్తుంది ఈ
వాస్తు శాస్త్రం. ఆలయ నిర్మాణాలకు శాస్త్రాన్ని ఆగమ వాస్తు శాస్త్రంగాను,
గృహ నిర్మాణాలకైతే గృహవాస్తు శాస్త్రంగాను విభజింపబడినవి.
*హిందువుల ఆలయాలపై దేవతల శిల్పాలతో పాటు కొన్ని అశ్లీలమైన బొమ్మలు కూడా
చెక్కబడి వుంటాయి. పవిత్రమైన దైవ క్షేత్రంలో ఈ అశ్లీలత ఎందుకు? *
హిందూ ఆలయాలు ఒక పూర్ణత్వానికి సంకేతం. ఈ సృష్టిలో జీవుల ఉత్పత్తికి
ప్రధానమైన సృష్టి కార్యాన్ని యజ్ఞభావనతోనే గ్రహించాలి. అలా కాక భోగబుద్ధితో
చూస్తే తప్పక అశ్లీలమైన భావాలే తలెత్తుతాయి. మన దేహంలోని శిరోభాగమే దేవాలయం
యొక్క గోపురానికి సంకేతం. మానవ బుద్ధిలో కలిగే అన్ని రకాల భావాలు ఆ గోపురంపై
ప్రతిబింబిస్తుంటాయి. ఎలాగైతే కోవెలలోని గర్భాలయంలో పరమాత్మ కొలువై యుంటాడో
అలానే *"దేహో దేవాలయః ప్రోక్తః"* దేహమే దేవాలయమని మానవుని హృదయ క్షేత్రంలోనే
భగవంతుడుంటాడని శాస్త్రం. కనుక ఆలయ గోపురంపై అశ్లీలాలకు తావులేదు. అశ్లీలమని
భావించడం కూడా సభ్యత కాదు.
*పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు మనస్సులో అపవిత్ర భావాలు
కలుగకూడదు కదా! కానీ గోపురంపై చెక్కబడిన ఆ శిల్పాలను చూస్తే మనస్సు చలించదా?*
ఆలయానికి పవిత్ర భావనతోనే వెళ్ళాలి. అయితే ఇక్కడ మనిషి యొక్క సంస్కారం
బయటపడుతుంది. కామ, క్రోధాలతో నిండియున్న మనసులో పరమాత్మ దర్శనం కలగకపోగా
వికారాలే నిండి వుంటాయి. పరమాత్మయందే మనసు లగ్నమైన వానికి ప్రకృతిలోని ఏ
ఆకర్షణలు అడ్డురావు. ఆకర్షణలకు బందీ అయితే పరమాత్మకు దూరంగానే ఉంటాడు. ఈ
పరీక్షలో భక్తులు విఫలం చెందకుండా బుద్ధిలో కలిగే వికారాలను వివేకంతోనే
జయించగలగాలి. అలా వివేకంతో చూడ గలిగినవాడికి ప్రతిదీ భగవత్స్వరూపంగానే
గోచరిస్తుంది. ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తికి లోకం కన్నా లోకేశుని పట్ల మనసు
లగ్నమై వుంటుంది.
*తీర్థక్షేత్రాలు అంటే ఏమిటి? వాటిని సందర్శించుకొనుట వల్ల ఉపయోగమేమి?*
కొన్ని క్షేత్రాలలో దైవం స్వయంభువుగా వెలసి ఉండడం చేత, అక్కడ పుణ్యనదులు
ప్రవహించడం వలన ఆ ప్రదేశాలకు విశిష్టత చేకురుతుంది. దీనినే పుణ్యక్షేత్రాలని
అంటారు. వాటిని సందర్శించడాన్నే తీర్థయాత్ర అంటారు. అందుకే మన భారతదేశంలో
ప్రతి నదిని ఒక తీర్థంగాను, ప్రతి ఆలయాన్ని క్షేత్రంగాను, భావిస్తూ
సందర్శించుకుంటుంటాము. అట్టి పవిత్ర క్షేత్రాలలో చేసే దాన ధర్మాలకు కూడా
విశిష్టమైన ఫలం లభిస్తుంది. మన ప్రారబ్దానుసారం పుణ్యతీర్థాలలో సత్పురుషుల
సాంగత్యం లభించవచ్చు. తద్వారా ఆథ్యాత్మికంగా పరిణతి పొందే అవకాశం గురువు
అనుగ్రహం తో తప్పక సిద్ధిస్తుంది.
*గురువు యొక్క ఆవశ్యకత ఉందా?*
మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే 'గురువు'. *'గురువు
లేని వారి గుర్తెట్లు తెలియునో అజునికైన వాని యబ్బకైనా' *అని వేమన శతకం.
అమూల్యమైన మన ఈ మానవజన్మకు తల్లిదండ్రులు కారకులైతే, జన్మరాహిత్యానికి కారణమైన
జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు గురువు. కనుక *"గురువు లేని విద్య గుడ్డి విద్య"*.
*సరియైన గురువును గుర్తించడం ఎలా?*
* మళ్ళీ చెప్పుకుందాం ..........*
2013/11/21 Kb Narayana Sarma <kbnsarma@gmail.com>
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
శ్లోకం:
అనేక జన్మ సంప్రాప్త కర్మకోటి విదాహినే |
జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః ||
...
తాత్పర్యం:
'జ్ఞాన' మనే అగ్ని ప్రభావంచేత శిష్యులకు అనేక జన్మల నుంచి వచ్చిన కోట్లాది
కర్మలను దహించి వేసే శ్రీగురువుకు నమస్కారము.
- ***************************************************************
- మీకోసం ............. [3 Updates]
- సన్మార్గం : చేద్దాంలే అనుకుంటే ఎప్పటికీ చేయలెం [1 Update]
- శ్రీ గురు గీత [1 Update]
- Divine Discources - Bhagavan Satya Sai [1 Update]
- శ్రీ విద్యాసాగర్ గారి ప్రవచనములు [1 Update]
- Quote of the Day [1 Update]
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 21 12:42PM +0530
*శివుడిని ఎందుకు లింగాకృతిలో ఆరాధిస్తారు?*
సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి రూపమంటూ లేదు . ఆ తత్వాన్ని
లింగాకృతిలో భావించి ఆరాధిస్తున్నాం. 'లింగము' అంటే 'గుర్తు' అని అర్థము.
అమేయం, అచింత్యం, అనాది, అద్వితీయమైన ఆత్మతత్త్వాన్ని లింగాకృతిలో ఆరాధించే
విధానాన్ని మహర్షులు సూచించారు.
అట్టి పరమేశ్వర తత్వము నిత్య శుద్ధ, బుద్ధ మైనదని గ్రహించాలి. అందుకే
స్ఫటికలింగమే ఈశ్వరారాధనకు శ్రేష్ఠమని శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఈ స్ఫటికం
పారదర్శకంగా వుంటుంది. దానిగుండా చూస్తే ఆవతలి వస్తువు కనిపిస్తుంది. అలాగే
స్ఫటిక రూపంలోని పరమాత్మను ఆరాధించడం వలన భక్తుడికి తన మనసులోని మాలిన్యం
తొలగి స్ఫటికరూపమైన తన యదార్థ స్వరూపమును తెలుసుకొనేందుకు అర్హత, పరిపక్వత
కలుగుతుంది.
*వేదమంత్రాలను వేదాధ్యయనం చేయని వారు, చేయడానికి అర్హత లేనివారు ఈశ్వరారాధన
ఎలా చేయాలి? *
నమక చమకాలను నేర్చుకోలేకపోతే విచారించవలసిన అవసరం లేదు. ఆ వంకతో ఈశ్వరారాధనను
విడవకూడదు. శివపంచాక్షరి *'ఓం నమశ్శివాయ' *మంత్రాన్ని జపిస్తూ అభిషేకం
చేయవచ్చు. ఈ శివపంచాక్షరి కృష్ణయజుర్వేదాంతర్గతమైన శ్రీరుద్రం లో మధ్యస్థమై
యుంది. శ్రీరుద్రానికే తలమానికమైన మంత్రం *'ఓం నమశ్శివాయ'* అని మహర్షుల
అభిప్రాయం.
*రుద్రాక్ష మాల విశిష్టతను వివరించగలరు? *
రుద్రాక్ష ఈశ్వరునికి ప్రతీక. ఇది ధరిస్తే భక్తీ, జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి
చెందుతాయి. మనస్సు స్వాంతన పొందుతుంది. తద్వారా ఆలోచనలు సవ్యదిశలో
ప్రయాణించి జీవనవిధానం, ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుద్రాక్షలలో ఏకముఖి,
ద్విముఖి ...... ఇలా 18 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు లభిస్తాయి.
*రుద్రాక్షలను ధరించేందుకు నియమాలున్నాయా? *
ఋతుసమయంలో ఉన్న స్త్రీలు తప్ప, ఎవరైనా సరే ఈ రుద్రాక్ష మాలను మేడలోనే
ధరించాలి. వస్త్రం మీద పైకి కనిపించేలా ఆడంబరంగా యితరుల కోసం వేసుకునే ఆభరణం
కాదు. ఇది శరీరానికి తగులుతూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మకుటంలోని
రుద్రాక్ష గుండెభాగానికి తగిలి వుంటే మంచిది. వీటిని నిదురించే సమయం లోను,
కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోను ధరించరాదు. అయితే ఏకముఖి రుద్రాక్షకు ఈ
నియమములు వర్తించవు.
*శివాభిషేకం ఏ యే ద్రవ్యాలతో చేయాలి? *
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పంచామృతములతో చేయాలి. అనగా పాలు, పెరుగు, నెయ్యి,
తేనె, పటికబెల్లం తో చేస్తే శుభప్రదం. అలా కుదరని పక్షంలో శుద్ధజలంతో
శివలింగానికి పంచాక్షరీ మంత్రం జపిస్తూ చేయవచ్చు. అభిషేకం చేసిన గంగను
పూజానంతరం తీర్థంగా స్వీకరించాలి.
*మనకు ఆలయాల సంస్కృతి ఎప్పటినుండి ఆరంభమైనది?*
ఆలయాల సంస్కృతి అనాదిగా వచ్చినది కాదు. పూర్వం మన ఆర్ష సంస్కృతిలో యజ్ఞ
యాగాదుల ద్వారానే భగవంతుని ఆరాధించేవారు. కలియుగంలో నేటి మానవుల యొక్క
ఆలోచనలు, భావాలు, వాటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, విలాసవంతమైన
జీవితానికి దాసులయ్యే ఈ మానవ సమాజానికి యజ్ఞయాగాదులు, ధ్యానము, తపస్సుల వంటి
ప్రక్రియలను ఆచరించడం సాధ్యం కావనే భావనతో మన పూర్వీకులే ఈ భగవదారాధనను దేవాలయ
సంస్కృతి ద్వారా వ్యక్త పరిచారు. ఈ ఆలయాలు ఆగమ వాస్తుశాస్త్రాలకు అనుగుణంగానే
నిర్మించబడినవి.
*వాస్తుశాస్త్రం అంటే ఏమిటి?*
* మళ్ళీ చెప్పుకుందాం ..........*
2013/11/20 Kb Narayana Sarma <kbnsarma@gmail.com>
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- "శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్" <nagendra.ayyagari@gmail.com> Nov 20 11:29PM -0800
చిన్న సవరణ శర్మగారు పంచాక్షరి/షడాక్షరి ఉపదేశం ఉన్నవారు చేసేది, వేదాధ్యయనం
చేయనివారు, ఉపదేశం లేని వారు
*ఓం శివాయ నమః అని పఠించాలి.*
On Thursday, November 21, 2013 12:42:35 PM UTC+5:30, kbnsarma wrote:
- Kb Narayana Sarma <kbnsarma@gmail.com> Nov 21 01:43PM +0530
ధన్యవాదాలండి
2013/11/21 శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ <nagendra.ayyagari@gmail.com>
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
[image: సన్మార్గం : చేద్దాంలే అనుకుంటే ఎప్పటికీ చేయలేం...]
కాలం విలువను గుర్తించలేని కొందరు సోమరులు, బద్దకస్తులు ప్రతిపనినీ ఆలస్యంగానే
చేస్తుంటారు. చేయవలసిన పనిని తరువాత చేద్దాం, లేకపోతే రేపో ఎల్లుండో చేద్దాంలే
అని వాయిదా వేస్తుంటారు. కాని ఆలస్యం చేయడం వల్ల తమకు జరిగే అనర్థాలను
గుర్తించలేరు. అమృతం కూడా విషంగా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోలేరు.
మనిషి జీవితంలో పెద్ద శత్రువు ఆలస్యమే అనే విషయాన్ని ఆలస్యం హి మనుష్యాణాం
జీవనే చ మహాన్ రిపుః అనే సూక్తి ధ్రువపరుస్తోంది. అందుకే అభివృద్ధిని కోరుకునే
ప్రతి మనిషి ముందుగా ఈ ఆలస్యమనే శత్రువును సమూలంగా నాశనం చేయవలసిందే. ఆలస్యం
వల్లనే ప్రాణాలు పోగొట్టుకున్న ఒక తుమ్మెద వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ
గుర్తుంచుకోవాలి.
ఒకనాటి సాయంకాలం ఒక తుమ్మెద సరస్సులోని పద్మంపై వాలింది. ఆ పుష్పంలోని
మకరందాన్ని ఆస్వాదిస్తూ అలానే కూర్చుండి పోయింది. ఆ తుమ్మెద మకరందాన్ని పానం
చేస్తుండగానే సూర్యాస్తమయమయింది. పద్మం ముకుళించే సమయం వచ్చింది. అయినా
తుమ్మెద ఆ పుష్పాన్ని వదిలి రాలేదు. ఆలస్యం చేసింది. పైగా ఈ రాత్రంతా ఆ
పద్యంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూనే ఉండవచ్చు అనుకుంది. కొంచెం ఓపిక పడితే
రాత్రి గడుస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, పద్మం మళ్లీ వికసిస్తుంది, అప్పుడే
స్వేచ్ఛగా ఇక్కడినుంచి మరొక పుష్పం దగ్గరికి వెళ్లవచ్చు అని ఆ తుమ్మెద
మురిసిపోతుండగానే ఒక ఏనుగు వచ్చింది. సరస్సులోకి దిగింది. తొండంతో సరస్సులోని
పద్మాలను విసిరికొట్టింది. పద్మాలు చిందర వందరగా నేలపై పడి వాడిపోయినాయి. లోపల
ఉన్న తుమ్మెద ఆకస్మికంగా మరణించింది. పద్మం నుండి వెళ్లిపోవడంలో బద్దకించి
ఆలస్యం చేసిన తుమ్మెద స్థితిని
‘రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుధేతి హసిష్యతి పంకజశ్రీః
ఇత్థం విచిన్తయతి పద్మగతే ద్విరేఫే
హాః హంత! హంత! నళినీం గజ ఉజ్జహార’
అనే శ్లోకం వివరిస్తోంది.
ఏ విధంగానైతే దూరప్రాంతంలో ఉన్న నగరానికి మరునాడు చేరుకోవలసిన వ్యక్తి
ముందురోజే ప్రయాణమయినట్లే, పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని భావించేవారు ఆ
కోర్సులో ప్రవేశించిన నాటినుంచే చదువును ప్రారంభించాలని, ఆలస్యం
చేయవద్దని‘అధ్వైవాధ్యయనం కార్యం పరీక్షాముత్తితీర్షుణా ప్రస్థాతవ్యం హి
నిశ్యేవ స్థాఋనం తత్ ప్రేప్సునోషసి అనే శ్లోకం సూచిస్తోంది.
మరణసమయంలో కఫ, వాత, పిత్త దోషాలకు నేను లోనైతే నీ నామస్మరణకు గొంతు,
భగవద్ధ్యానానికి మనస్సు అనుకూలంగా ఉంటాయో, ఉండవో చెప్పలేను, అప్పుడే
స్మరిస్తానులే అని ఇప్పుడు మానలేను. ఎందుకైనా మంచిది. ఈ రోజే నీ పాదపద్మాలనే
పంజరంలో నా మనస్సు అనే రాజహంసను ప్రవేశపెడతాను, ఆలస్యం చేయను అనే భావాన్ని
కులశేఖరులు తమ ముకుందమాలలో-
‘కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానస రాజహంస
ప్రాణప్రయాణ సమయే కఫ వాత పిత్తై
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే’ అనే శ్లోకంలో వివరించారు.
అందుకే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే,
ఇంద్రియాలు బలంగా, పరిపుష్టంగా ఉన్నప్పుడే, ముసలితనం రాకముందు తనకు, ఇతరులకు
శ్రేయస్సును కలిగించే పనులను చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. తరువాత చేద్దాం,
తొందరేముంది అని వాయిదా వేయవద్దు, సత్కార్య నిర్వహణకై తొందరపడాలి.
సత్కార్యసాధనకై ఎక్కువగా ప్రయత్నించాలి.
ఒకపక్క ఇల్లు తగలబడిపోతుంటే ఇంటిని చల్లార్చడానికి కావలసిన నీటికోసం బావిని
తవ్వాలనుకోవడం ఎంతటి దోషమో, యుద్ధం ప్రారంభమయ్యాక యుద్ధంలో గెలవాలనుకునే వాడు
శస్త్రాస్త్రాలు ప్రయోగించే విధానాన్ని యుద్ధసమయంలో నేర్చుకోవాలనుకోవడం ఎంత
తప్పో, వెంటనే చేయాల్సిన పనులను ఆలస్యం చేయడం కూడా అంతే తప్పని మనకు మహాభారత
శ్లోకం ఉద్బోధిస్తోంది.
పనులను వాయిదావేసే పద్ధతిని మానుకుని, వీలున్నంత త్వరగా సక్రమమైన రీతిలో విశేష
ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, న్యాయస్థానాలు విశేష
గౌరవాన్ని పొందుతాయి. వ్యక్తులు కూడా తమ పనిని వెంటనే చేపట్టి సక్రమంగా
సత్వరంగా పూర్తి చేస్తే అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఆలస్యాన్ని
నిర్మూలిస్తేనే వ్యక్తి శ్రేయస్సు సాధ్యపడుతుంది. సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి
ఆలస్యాన్ని నివారించడంపై కూడా ఆధారపడి ఉంటాయి.
- సముద్రాల శఠగోపాచార్య
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
శ్లోకం:
జ్ఞాన శక్తి స్వరూపాయ కామితార్థ ప్రదాయినే |
భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః ||...
తాత్పర్యం:
జ్ఞానస్వరూపి, శక్తిస్వరూపి (అందుకనే) కోరిన కోర్కెలన్నీ తీర్చేవాడు, భుక్తి
ముక్తి దాత అయిన శ్రీ గురువుకు నమస్కారము.
వివరణ:
ఇక్కడ భుక్తి అంటే కర్మ అని సమన్వయం చేసుకోవాలి. ఆయనకు కార్యము, కారణము, జడము,
చైతన్యము, కర్మ, ముక్తి అన్నీ ఒకటే. అలాంటి ఎకరూపుడయిన గురువుకి నమస్కారము.
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
Have you ever visualised Viswa Virata Swarupa (the Cosmic Form)? Earth,
water, sky, etc., can be seen in it. The universe is made of five elements,
and the same five elements are present in you too. So, you are Viswa Virata
Swarupa. God is in you and in everybody. So hurting others amounts to
hurting God. Do not criticize and find fault with others. Love all, Serve
all. First of all respect, adore, and worship your parents. They constitute
the real wealth of your life. The blessings of your parents will confer
health and wealth on you. God comes to you on His own when you love and
serve your parents. We need not go to God but should make God come to us.
One can select one’s wife, but not one’s parents. Only God (when He comes
in human form) selects His parents. I wish that you obtain the blessing of
your parents and set an ideal for the rest of the world.
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
మెలకువలో పనిచేస్తున్నప్పుడు శరీర, మనో బుద్ధులే నీవు అని భావిస్తున్నావు. కల
నీవు పని చేయుటకు ఆధారమైన ప్రేరణలు, వాసనలతో నడుపబడుతుంది. నిద్రలో ఇంద్రియ,
మనో, బుద్ధులు ఉండి లేకుండా ఉన్నవి, వ్యాపార రహితముగా ఉన్నవి.
మెలకువలో ఇంద్రియములు పనిచేస్తే ఆ పనియే నీవుగా ఉన్నావు
కలలో ఆ పనులకు ప్రేరణ అయిన వాసనలే నీవుగా ఉన్నావు
నిద్రలో వ్యాపార రహితముగా నీవు ఉన్నావు
ఈ మూడు స్థితులలో నీవు వాటితో కలిసిపోతే జీవుడవు, కలవక పోతే సాక్షివి.
మెలకువలో పనులకు , ఫలితములకు, విషయములకు , ఇంద్రియములకు సాక్షివి
కలలో ఇంద్రియ ప్రేరణలకు, మనో బుద్ధులకు సాక్షివి
నిద్రలో చిత్తము, అహంకారములకు మధ్యలో ఉన్నావు.
ఆ చిత్తము, అహంకారములకు సాక్షివి అయిన నీవు చిద్రూపమై తురీయము యందు
ప్రవేశిస్తావు
చిత్తము యొక్క ప్రభావము లేకపోవుటయే చిద్రూపమగుట
మరియొక విధముగా చెప్పవలెనన్న మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశప్రభావము
లేనివాడిగా ఉండుటయే చిద్రూపమగుట
- radha krishna kantamneni <kantamneni.radhakrishna@
నవవిధ భక్తి మార్గములను ఆచరించుట వలన చిత్తశుద్ది కలుగుతుంది.
విషయముల యెడల అనురాగము తగ్గుతుంది.
విషయముల యెడల అనురాగము వలననే నేను శరీరమును అను భావన బలపడు చున్నది.
No comments:
Post a Comment