AAVARANAMU LEKA AGNANAMU_TELUGU

ఆవరణ లేక అజ్ఞానము

ఆవరణను లేక అజ్ఞానమును చీకటితో పోల్చుతారు. ఒక గదిలో వస్తువులు ఉన్నాయి. కండ్లు పనిచేస్తున్నాయి.  కాని చీకటిగా ఉన్నది.  చీకటి  వస్తువులను  ఆవరించి  ఉండుట  వలన  మనము  వస్తువును  చూడలేక  పోతున్నాము . ఆలాగుననే ఆత్మానందమును   అజ్ఞానమనే  చీకటి ఆవరించి ఉండుట వలన మనము గుర్తించ లేక పోవుచున్నాము. జ్ఞానముచే అడ్డుగా ఉన్న అజ్ఞానమును తొలగించిన ఆత్మానందము అనుభవమునకు వచ్చును.
పాలయందు వెన్న దాగి ఉన్న విధముగా  ఉపనిషత్తుల యందు అజ్ఞానమును తొలగించగల   జ్ఞానము ఉన్నది.  ఉపనిషత్తులను మనంతట మనము చదువ వచ్చును. కాని మనకు స్థూలార్ధము బోధ పడుతుందే  కాని అంతరార్ధము బోధపడదు. పాలనుండి వెన్న తీయుటకు ఒక పద్దతి ఉన్న విధముగానే ఉపనిషత్తుల యందలి జ్ఞానమును తెలిసికొనుటకు ఒక పద్దతి ఉన్నది. ఆ పద్దతి తెలిసిన వాడే గురువు. 
మొదట గురువు వద్ద ఉపనిషత్తుల యందలి జ్ఞానమును శ్రవణము చేయవలెను. 
మననము ద్వారా గురువు ద్వారా సంశయములు ఉన్న  తొలగించుకొని , నిశ్చయ జ్ఞానమును పొందవలెను.  
నిధి ధ్యాసము ద్వారా మనస్సు పరిపరి విధములుగా పోవుటను అరికట్టి మనస్సును ఆత్మ జ్ఞామునందు  నిలుపవలెను. 
అప్పుడు అడ్డుగా ఉన్న అజ్ఞానము లేక ఆవరణ తొలగి ఆత్మానుభూతి కలుగును. 

Comments

Popular posts from this blog

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి