కర్మ యోగము
కర్మ - మనము మనస్సు, వాక్కు , శరీరముల ద్వారా చేసే ప్రతి పనిని కర్మ అంటాము. కర్మ ఫలమును సూచించుటకు కూడా కర్మ అనే పదమును ఉపయోగిస్తారు.
యోగము - జీవ, బ్రహ్మములు వేరుకాదు, రెండు ఒక్కటే అన్న అనుభూతియే యోగము. అదే మోక్షము.
మోక్షము జ్ఞానము వలననే సాధ్యము. కాని ఆత్మజ్ఞానమునకు అంతఃశుద్ధి అవసరము. ఆ అంతఃకరణ శుద్ధి, కర్మను యోగముగా ఆచరించుట కలుగుతుంది.
మోక్షము అనే లక్ష్యము దృష్ట్యా కర్మను ఆచరించిన ఆ కర్మ, యోగము అవుతుంది.
కర్మను యోగ మార్గములో ఆచరించ వలెననిన మొదటి నియమము, మనము చేయు ప్రతి పని ధర్మబద్దమై ఉండాలి.
మన ఇష్ట ,అయిష్టములను బట్టి కర్మను ఆచరించక, శాస్త్రము నిర్దేశించిన విధముగా మంచి చెడుల విచక్షణను ఉపయోగించి కర్మను ఆచరించ వలెను. పరులు నీపట్ల ఏ విధముగా ప్రవర్తించ వలెనని కోరుకుంటావో అదే విధముగా నీవును వారి పట్ల ప్రవర్తించు. అదే ధర్మము.
సృష్టి అంతయు ఏ నియమముపై ఆధారపడి పని చేస్తున్నదో అదే ధర్మము. కనుక ధర్మ బద్దమైన జీవితమును జీవించుట అంటే సృష్టి నియమములకు లోబడి జీవించుటయే. సృష్టి నియమము ఈశ్వర నియమము. కనుక సృష్టి నియమానుసార జీవితమును జీవించు వాడు ఈశ్వర కృపకు పాత్రుడవుతాడు.
ధర్మ బద్దమైన జీవితమును జీవించుట వలన మన ద్వారా చేయబడు ప్రతి కర్మను సూక్ష్మముగా పరిశీలించుట అలవాటు అవుతుంది. బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఇది ఆత్మజ్ఞానమునకు ఎంతో అవసరము.
కర్మను ధర్మ బద్దముగా ఆచరించుట వలన, కర్మ ఆచరణకు ధర్మమే ఆధార మవుతుంది కాని అరిషడ్వర్గములు ప్రేరణగా నిలచే అవకాశము లేదు. కర్మ ఫలములోను అరిషడ్వర్గముల ప్రభావము ఉండదు. కనుక ధర్మ బద్దముగా కర్మను ఆచరించుట వలన అంతఃకరణము శుద్ధి అవుతుంది. ధర్మ బద్దమైన జీవితమును జీవించుట మోక్ష సాధన దిశగా చేయు ప్రయాణములో మొదటి మెట్టు మరియు కర్మ యోగములో ఆచరించుటకు మొదటి నియమము.
|
Friday, November 29, 2013
KARMA YOGAMU_TELUGU
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
======================================================================== pl click on this link u may download some albums http://www.me...
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) అమ్మ నీకు...
No comments:
Post a Comment