NITYA PATHANA SLOKAMULU
ఓం నమో భగవతే వాసుదేవాయ
నిత్య పఠన శ్లోకములు
(ఉదయం నిద్ర లేచే వేళ తన అర చేతులు చూసుకుంటూ...)
1.శ్లో: కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సర స్వతీ
కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం
నిద్ర లేచి భూమిపై కాలు మోపునపుడు...
భూదేవికి నమస్కరిస్తూ...
2.శ్లో: సముద్రవసనే దేవీ పర్వత స్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమేil
సూర్యోదయ సమయమున పఠించవలసిన
3.శ్లోకం:
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం
సాయం ధ్యాయేత్సదావిష్ణుం త్రిమూర్తిం చ దివాకరం,
స్నానము చేయునపుడు :
( కేశవ నారాయణ మొదలగు నామములతో ఆచమనం చేసిన తరువాత)
4.శ్లో: ఓం గంగే చ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపి వా
యస్మరేత్ పుండ్రీకాక్షం స బాహ్యాంభతర శ్శుచి:
పుండరీకాక్ష... పుండరీకాక్ష... పుండరీకాక్ష...
గాయత్రీ మంత్రము |
5.శ్లో: ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ||
భావార్థము : హేరక్షక! సచ్చిదానందస్వరూప! జగదుత్పాదకదేవ ప్రసిద్ధము, పల్వోత్కృష్టమునగు నీ విజ్ఞాన స్వరూపమున మేము నిత్యముపాసింతుము. మాకు పదుృద్ధినిచ్చి పత్కర్మము లాచరించునట్లు అనుగ్రహింపుము.
6.శ్లో: ఓం నమో భగవతే వాసుదేవాయ
ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతవరణాన్ని శుద్దిచేస్తుంది. బుద్దిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్నితొలగి స్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది
7.శ్లో: మృత్యుంజయ మహామంత్రము
ఓ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ణనమ్,
ఉర్వారుకమివ బన్ధనా స్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
తా:- సుగంధ యుక్తులును, సమిస్త జీవులమ లెస్సగా పోషించువారును నగు త్రినేత్రుడైన పరమశివుని మేము ఆరాధించుచున్నాము. దోస తీగమండి దోసకాయను వేరుచేయునట్లు మోక్షప్రాప్తి కొఱకై ఆ పరమాత్మ మమ్ములమ మృత్యువునుండి విడుదల చేయుగాక !
8.శ్లో: కలి కల్మశ నాశన మహామంతమ్
ఓమ్ హరేరామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే .....
9.శ్లో: త్వమేవ మతాచ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వ మేవ!
త్వమేవ విద్యా ద్రవిణమ్ త్వ మేవ
త్వమేవ సర్వమ్ మమ దేవ దేవ!!
తులసీదేవి ప్రార్థన
10.శ్లో: నమ స్తులసి సర్వజ్ఞే పురుషో త్తమ వల్లభే
పాహి మాం సర్వపాపేభ్య స్సర్వసంపత్పదాయిని.
11.శ్లో: యన్మూలే సర్వతీర్థాని యన్మ ధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహం.
12.శ్లో: నమ స్తులసి కళ్యాణి నమోవిష్ణుప్రి యే శు భే
నమో మోక్ష ప్రదే దేవి నమః సంపతప్రదాయకే
సద్ధ్యాదీపప్రార్థన
13.శ్లో: శుభం భవతు క ల్యాణీ ఆరోగ్యం ధనసంపదం
మమ శతృ వినాశాయ సాయం జ్యోతి ర్న మోస్తు తే.
13.శ్లో: దీపం జ్యోతి పరబ్రహం దీపం సర్వతమోపహం
దీ పేన సాధ్యతే సర్వం సన్ష్యాదీపం నమోస్తు తే.
స్తోత్రములు
శ్రీ గురు ధ్యానము
15.శ్లో: గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
15.శ్లో: ధ్యానమూలం గురోర్మూర్తి! పూజామూలం గురోర్పదం! మంత్రమూలం గురోర్వాక్యం! మోక్షమూలం గురోరక్రుప!!
శ్రీ గణపతి ధ్యానము
16.శ్లో: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే!!
18.శ్లో: అగజానన పద్మార్కం గజాసన మహార్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే........
-2-
శివస్తుతి :
19.శ్లో: వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం.
20.శ్లో: రుద్రం పశుపతిం స్తాణుం నీలకంఠముమాపతిం!
నమామి శిరసా దేవం కిన్నోమృతుః కరిష్యతి!!
విష్ణుస్తుతి
21.శ్లో: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం.
శ్రీరామస్తుతి
22.శ్లో: శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘువరాన్వయ రత్న దీపం
ఆజానుబాహు మరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి.
శ్రీరామ. ధ్యానము
23.శ్లో: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేథ సే రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమ:
శ్రీకృష్ణ ధ్యాన ము
24.శ్లో: కస్తూరీ తిలకం లలాటఫలకే వక్ష స్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తి కం కరతలే వేణుం కరేకంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠెచ ముక్తావలీం
గోపస్త్రీ, పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.
25.శ్లో: అదౌ దేవకీదేవి గర్బజననం గోపీ గృహే వర్తనం! మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్దారణమ్!! కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతా పాలనం! హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీ కృష్ణ లీలామృతమ్!!
సరస్వతీస్తుతి
26.శ్లో:సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
27.:యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
28.శ్లో:యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
లక్ష్మీస్తుతి
29.వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యందాం |
హస్తాభ్యా మభయప్రదాం మణిగనైర్నానావిధై ర్భూషితామ్.
30.శ్లో:లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
31.శ్లో:శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
దేవీ శ్లోకం
32.శ్లో:సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||
శ్రీవేంకటేశ్వర శ్లోకం
33.శ్లో:శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేஉర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
దక్షిణామూర్తి శ్లోకం
34.శ్లో:గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
భుజించునపుడు చేయు ప్రార్థన
35.శ్లో:అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్.
తా:- నేను 'వైశ్వానరుడ'ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగువిధములగు అన్నమును పచనము చేయుచున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా.
36.శ్లో:.బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
తా:- యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది - అన్నియును బ్రహ్మస్వరూపములే యనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను జేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.
రాత్రి నిద్రించుటకు ముందు
37.శ్లో:రామంస్కందం హనూమంతం
వై న తేయం వృకోదరం
ళయ నే యః స్మ రేన్నిత్యం
దుస్స్వప్న స్తస్య నశ్యతి.
అపరాధ క్షమాపణ స్తోత్రం
38.శ్లో:అపరాధ సహస్రాణి, క్రియంతేஉహర్నిశం మయా |
దాసోஉయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా
మానసం వాపరాధమ్ |అపరాధ క్షమాపణ స్తోత్రం
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
39.శ్లో:కాయేన వాచా మనసేంద్రియైర్వాబుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
బౌద్ధ ప్రార్థన
40.శ్లో:బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
శాంతి మంత్రం
41.శ్లో:అసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
42.శ్లో: సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||
ఓం సహ నా’వవతు | స నౌ’ భునక్తు |
సహ వీర్యం’ కరవావహై |
తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
43.:(పారాయణ అనంతర క్షమార్పణ పూర్వక సమర్పణము)
*యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ !
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే !!
*పాపోహం పాపకర్మాహం పాపాత్ము పాప సంభవః !
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల !!
*అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ !
తస్మాత్కరుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !!
*మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన !
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే !!
*యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ !
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే !!
*ఆవాహనం న జానామి న జానామి విసర్తనం!
పూజా విధిం న జానామి క్షమస్వ హనుమత్రభో !!
*గోప్రూణా మపి గోప్తాశ్వం గృహాణా మత్తృతం జపం !
సిద్ధిం కురుష్వ మే దేవ త్వమహం శరణం గతః !!
*కాయేన వాచా మనసేంద్రి యైర్వా దధ్యాత్మనా వా
ప్రకృతే స్వభావాత్ ! కరోమిడుద్యత్ సకలం
పరస్మై నారాయణాయేతి సవురదూమి !
సదాశివాయేతి సమర్పయామి !!
44.దేవాలయములో ప్రదక్షిణ చేయునపుడు
యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదేపదే !
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః !
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల !!
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ !
తస్మాత్కరుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !!
రక్ష రక్ష జనార్ధన!!
***********************************************************
విశేష మంత్రాః
పంచాక్షరి – ఓం నమశ్శివాయ
అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
No comments:
Post a Comment