గానలోల! కరుణాల వాల! గాచి బ్రోవు నిరుపమ గుణశీల!#swami_sundara_chaitanyananda


https://youtube.com/shorts/WGScGy6qH0Y?si=_3iF9Fjg0nUYeUvL


గానలోల! కరుణాల వాల!

గాచి బ్రోవు నిరుపమ గుణశీల!

*అగుపించ వేమి శ్రితజన పాల?

వరుల దృష్టి నిన్నేమి చేయు

దర్శనము దృశ్యము ద్రష్టవు కావా!

కాలము దూరము కల్పన కావా!

*ఉపచారములు నేర్వని వారము

అపచారములే ఎరిగిన వారము

అర్హత లేవియు పాపొందని వారము

సారము లేని మేము నీ వారము

*కన్నులలో వెలుగువు నీవే

వెన్నెలలో వెలుతురు నీవే

జలమున ప్రాణము జగతిలో జీవము

అంతా నీవే! అనంతము నీవే!

*వినుమా గోల - శ్రీరమణీ లోల

మాయాజాలము నే తాళ జాల

నీలి నయనాల త్రిభువన పాల!

ఆశ్రిత మందార! చైతన్య శీల!



Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs