Saturday, December 20, 2014

తెలంగాణా విశిష్టతను తెలియచేసే దర్శన దస్త్రం (వీడియో ఫైల్)


తెలంగాణా విశిష్టతను తెలియచేసే దర్శన దస్త్రం (వీడియో ఫైల్)

Post by Tadepalli Patanjali.

Friday, December 19, 2014

Akkineni Alochanalu Audio Book


 

అక్కినేని పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్రను చెప్పుకోవడం అసాధ్యమే అవుతుంది. ఉదాత్తమైన నటననే కాదు ... ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన మహా మనిషి ఆయన. అక్కినేని పెద్దగా చదువుకోకపోయినా ఆయన ఆలోచనలు ... అనుభవాలు నేటికీ గౌరవమైన స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. అందుకు కారణం, ఆయన అనుసరించిన మార్గాలు ... ఆచరించిన సూత్రాలు ... సాధించిన విజయాలు అని చెప్పుకోవచ్చు.గతంలో ఆయన తన ఆలోచనా స్రవంతిని ఓ పుస్తకంగా మలిచారు. భావితరాలకి అది అవసరమని భావించిన సన్నిహితులు, 1980 లలో ఆ పుస్తకాన్ని'అక్కినేని ఆలోచనలు' పేరుతో ఆయనతోనే ఆవిష్కరింపజేశారు. ఇటీవల ఈ పుస్తకం మార్కెట్లో దొరకకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారట. దాంతో వచ్చే నెలలో జరగనున్న అక్కినేని పుట్టిన రోజు వేడుకలో మరోసారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని సన్నిహితులు కోరుతున్నారట. మరి ఈ విషయంలో అక్కినేని ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

http://andhravilas.net/news/Image/telugu1/newsdetails/b_aa_book_ni_akkineni_alochanalu_release_chestada_190812.jpg

https://www.youtube.com/watch?v=Ujy6n3QlsSM

hyderabadbookfair 2014

http://hyderabadbookfair.com/
hyderabadbookfair 2014


Wednesday, December 10, 2014

Ruthu Shobha Sageetha Rupakam

AMMA book_Kv Ramakrishna

"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం"......చాలా వరకు మన అమ్మా నాన్నలు ఇదే పొజిషన్ లో ఉన్నారు....ఇతర దేశాల్లో ఉన్న వాల్లే కాకుండా ఇండియాలో ఉన్నా కూడా వెరే ప్రదేశాల్లో పని చెయ్యడము వల్ల ఇలాంటి పరిస్తితి తల్లిదండ్రులకు తప్పడము లేదు పాపం....కానీ ఏది ఎలా ఉన్నా , ఎంత బిజీ ఉనా కూడా కనీసము మన సాంప్రదాయకమైన పండుగలు ... పోచమ్మ,వన భోజనాలు,దస్సెరా,బతుకమ్మ,ఉగాది లాంటి పండగలకన్న తల్లిదండ్రులతో ఉంటే బాగుంటుంది....పాపం వాళ్ళ రక్త మాంసాలు పణంగా పెట్టి మనలను పేంచారు....అప్పట్లో 80% కన్న ఎక్కువ పేరెంట్స్ కు సరయినా సదుపాయాలు లేక ఎన్నో కష్టాలు పడ్డారు కదా...గుడ్ మార్నింగ్ ఇండియా/గుడ్ నైట్ అమెరికా....జ్యోతి రెడ్డి...
AMMA_BOOK
అమ్మ
ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన ....
అమృత భాండం అమ్మ .....
జీవ భాషలో కావ్యం నెరపిన ....
అమర కోశం అమ్మ ....
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది ....
ఋణం తీర్చలేని అమ్మకి .......  LINK:
https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing

అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు...
ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి....
ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా...
ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం...
Venkat Garikapati



" అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతుల పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... ..........................నీవు లేవురా...3

Tuesday, December 9, 2014

Yaksha Prashnalu

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

MAHATMULA SANDESHAMULU_COMPILED BY YSREDDY

MAHATMULA SANDESHAMULU_COMPILED BY YSREDDY
మహాత్ముల సందేశములు _COMPILED BY YSREDDY


Monday, December 8, 2014

MATHRU VANDANAM_CHAGANTI KOTESHWAR RAO_SVBC_07DEC2014

MATHRU VANDANAM_CHAGANTI KOTESHWAR RAO_SVBC_07DEC201

" అమ్మ పాట "
 నీవు లేవురా నేను లేనురా అవని లోన అమ్మ లేని మనిషి అసలు లేడురా.......
కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి
అదృష్టం అబ్బినతని  భాగ్యమే భాగ్యమురా
ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన
ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా జో జో ...జోజో అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....1 ఏనాడో ఒకనాడు తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతిలో పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... నీవు లేవురా2







Sunday, December 7, 2014

Viraagya Bhavana

వైరాగ్య భావన
Posted On:11/25/2014 1:56:54 AM
తినడానికి ఎంత ఉన్నా కడుపునిండేవరకే తినగలమని, లోకంలో సంపదలు ఎన్ని ఉన్నా మన అనుభవానికి తగినంత ఉంటే చాలును అనే వాస్తవాన్ని గుర్తిస్తే ఇతరుల పట్ల అసూయ కలుగదు. అన్నీ తనకు దక్కలేదు అనే అసంతృప్తి తొలుగుతుంది. తన దగ్గరున్న వనరులను చూసి సంతృప్తి పొందే గుణం అలవడుతుంది. నివృత్త రాగస్య గృహం తపోవనం అన్నట్లు విరాగులకు గృహమే తపోవనంగా భాసిస్తుంది.
మనిషి బతికినంతకాలం సుఖంగా బతికే అవకాశం లేకుండా మనోవ్యాధులు, అనేక రోగాలు పట్టిపీడిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి.సంపదలు ఎక్కువ అవుతున్న కొద్దీ అనూహ్యంగా అడ్డు అదుపులేని ఆపదలు కుప్పలు తెప్పలుగా వచ్చి మీద పడుతుంటాయి. పుట్టిన ప్రతిప్రాణిని మాయదారి మృత్యువు తన పొట్టన పెట్టుకుంటూనే ఉన్నది. దైవాధీనమైన ఈ జగత్తులో ఏ ఒక్కటి కూడా సుస్థిరమని పేర్కొనుటకు అవకాశమే లేదు.
కాబట్టి మనిషి తన జీవితంలో ఆడంబరాలకు, అట్టహాసాలకు తావివ్వకుండా మితిమీరిన కోరికలకు అడ్డుకట్ట వేస్తూ వైరాగ్య భావ సంపున్నుడై జీవితాన్ని కొనసాగించినప్పుడే సుఖశాంతులు చేరువవుతాయి అనే భావాన్ని భర్తృహరి మహాకవి ఓ శ్లోకం ద్వారా వెల్లడించాడు.

ఆదివ్యాధి శతైర్జనస్య వివిధైరారోగ్యమున్మూల్యతే
లక్ష్మీర్యత్ర పతంతి తత్ర వివృతద్వారా ఇవ వ్యాపదః
జాతం జాతమవశ్యమాశు వివశం మృత్యుః కరోత్యాత్మసాత్
తత్కిం నామ నిరంకుశేన విధినా యన్నిర్మితం సుస్థిరమ్‌॥
భర్తృహరి ప్రబోధాన్ని, మహనీయుల మహితోక్తులను, గురూపదేశాలను శిరసావహిస్తూ భౌతిక సుఖాలకన్న ఆముష్మికమైన శాశ్వతానందాన్ని పొందాలనే తపనను అలవరచుకుందాం. క్షణికసుఖాల పట్ల భోగైశ్వర్యాల పట్ల ఉదాసీన వైఖరిని వైరాగ్యాన్ని కలిగి ఉందాం. వైరాగ్యభావ సంపన్నులమయ్యేందుకు ప్రయత్నిద్దాం.


Manava Dharmam

మానవధర్మం
Posted On:11/28/2014 12:38:26 AM
ధర్మో రక్షితి రక్షితః ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మరక్షణ కోసమే భగవంతుడు యుగయుగాల్లో అవరిస్తున్నాడు. ధర్మం మనం చేసే విధుల్లో ఉంటుంది. బతికే విధానంలో ఉంటుంది. భారతంలో యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మనిబద్ధుడైన ధర్మారాజు చెప్పిన సమాధానాలు జీవనధర్మాన్ని ఉటంకిస్తాయి. మానవసంబంధాలను దృఢం చేస్తాయి. సంతృప్తిని కలిగించి విశ్వాసాన్నిస్తాయి.
మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చ తరస్తథా I
మనఃశీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీతృణాత్ II
లోకంలో తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని అందించిన గొప్పవారు వారు. తల్లి భూమి కన్నా గొప్పది. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు. మనసు గాలికంటే వేగమైనది. చింత గడ్డిపరక కన్నా వృస్తృతమై అడుగడుగునా తానే ఉంటుంది. కుటుంబానికి రూపమిచ్చిన తల్లిదండ్రులను ఆదరిస్తూ, మానసిక పరిపక్వత గలిగి అనవసర ఆందోళనలకు తావివ్వకూడదు.

మనిషికి ధన్యత చేకూర్చే సద్గుణాలలో నేర్పు ఉత్తమమైనది. అన్ని ధనాలలో కన్నా విద్యాధనం ఎన్నటికీ తరగని నిధి. లాభాలలో గొప్పలాభం ఆరోగ్యం. సుఖాలలో ఉత్తమమైనది సంతృప్తి. జీవితం అందించే పరిస్థితులను నేర్పుతో చక్కదిద్దుకుంటూ, చదువు నేర్పిన విజ్ఞతతో మెలుగుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని తలచి సంతృప్తితో బతకాలి.
మనిషి తనను తాను పోషించుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతూ ఎవ్వరికీ రుణపడక ఉన్న ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఆనందంగా బతకగలిగితే నిత్యసంతోషం సంతృప్తిగా తలుపుతడుతుంది. జీవితాంతం తోడుంటుంది.
ధర్మం యొక్క యధార్థ స్వరూపం అతిరహస్య మైనది. ధర్మనిరతితో బతికిన మహనీయుల మార్గాన్ని అనుసరించి వెళ్లడమే మానవ ధర్మం. ఎందుకంటే కాలపురుషుడు ప్రాణికోటిని అజ్ఞానమనే పెద్దబాణలిలో వేసి, సూర్యుడనే అగ్నిని రగిల్చి,రాత్రి పగళ్లు అనే కట్టెలను ఇంధనంగా చేసి మాసాలూ, సంవత్సరాలూ అనే గరిటెలతో వండుతున్నాడు.. అనే వార్తను ధర్మజుడు చెబుతూ కాలగతిలో యుగాలు గడిచిపోతూనే ఉంటాయి. లభించిన జీవితాన్ని ధర్మపోషణతో సార్థక్యం చేసుకోవాలని చెప్పకనే చెబుతున్నాడు. ఈ చరాచర ప్రపంచంలో అన్ని బతుకుతాయి. కానీ వివేకం, ధర్మం తెలిసిన మావన జీవితం ఆదర్శం కావాలి. ధర్మ సంస్థాపన కొనసాగాలి. 

Tyaga Nirati

త్యాగ నిరతి
Posted On:11/29/2014 12:05:58 AM
నైతికత, విచక్షణ కలిగిన మనీషి మనిషి. ప్రపంచంలోని అన్ని జీవరాసుల్లోనూ ముఖ్యడైన మనిషి తత్తం మానవత్వం. నూరు సంవత్సరాల జీవిత గ్రంథానికి కర్త, భోక్త మనిషే. కనుక సంప్రదాయం, సంస్కృతి చూపించిన ధర్మమార్గంలో జీవితాన్ని గడపాలి. సంతృప్తినిండిన ఆత్మగౌరవంతో జీవితానికి సార్థకత చేకూర్చాలి.
యజ్ఞదానతపఃకర్మన త్యాజ్యం కారమేవతత్!
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్!
మానవ ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సంస్కృతి యజ్ఞం-దానం- తపస్సు-త్యాగం అనే విలువలకు ప్రతీకగా నిలిచింది. యజ్ఞదాన తపస్సులలో అంతర్గతంగా త్యాగం ఉంది. త్యాగనిరతితో, కృతజ్ఞతాభావంతో, కర్తవ్యతా జ్ఞానం తో మనిషి బతకాలి.
ఆధ్యాత్మిక చింతనతో పూజా పురస్కారాదులు చేయడం దేవయజ్ఞం. వంశంలోని పూర్వికుల జ్ఞాపకంలో నిర్వహించే శ్రాద్ధాది కర్తవ్యవిధి పితృయజ్ఞం. పరస్పర సహకార తత్తం కలిగి సాటివారికి సహా యం, దానం చేయడం మనుష్యయజ్ఞం. సకల ప్రాణికోటిలోనూ ఆత్మ తత్తం చూస్తూ దయకలిగి ఉండటం భూతయజ్ఞం. అనాదిగా ఎందరో మహానుభావులు అందజేసిన విద్య నూ, విజ్ఞానాన్ని నశించిపోకుండా కాపాడటం రుషియజ్ఞం. ఈ ఐదు విధాలైన విశేష యజ్ఞాలను కర్తవ్యంగా భావించి ఆచరించడమే అసలైన జీవిత యజ్ఞం.
ప్రతిఫలాపేక్ష లేకుండా, సంపూర్ణ నిశ్చలతతో యథాశక్తి అన్న, ధన, వస్త్ర, విద్యాదులు ఇవ్వడం దానం. ఒకవంతు దానం కోటిరెట్ల సంతృప్తిని అందిస్తుంది. సంతృప్తిని మించినదీ, విలువైనదీ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి లేదు.
మనసా వాచా కర్మణా ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మానసిక పరిణతిని పెంపొందించుకొని, ఇంద్రియాలను జయించి సంకల్పబలంతో బతకడమే తపస్సు. సన్యాసాశ్రమంలోనే తపస్సు భాగం కాదు. సానబట్టిన సంసారయోగి నిర్వహించే గృహస్థాశ్రమంలోని తపస్సు మహోన్నతమైంది. సంస్కృతి పంచిన యజ్ఞ, దాన, తపస్సులనే సంస్కారాలలో అపారమైన, అత్యున్నతమైన త్యాగం ఇమిడి ఉంది. త్యాగనిరతి కలిగిన మనిషి కుటుంబానికి ఆకాశమే హద్దు. లోకంలోని ప్రతీబంధం తాననుభవించే ఆనందానుభూతుల హస్తాక్షరమై విరాజిల్లుతుంది.

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular