sri krishnashtakam#భావార్ధ#swami_sundara_chaitanyananda

 sri krishnashtakam#భావార్ధ

#swami_sundara_chaitanyananda   
VIDEO DOWNLOAD LINK: CLICK HERE

శ్రీ కృష్ణాష్టకమ్ 

వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం.

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం! ||1||

వసుదేవుని కుమారుడు, దేవదేవుడు, కంసచాణూరులను

వధించినవాడు, దేవకీదేవికి పరమానందమును గూర్చిన

వాడును అగు జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్క

రించుచున్నాను.

అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితం

రత్నకంకణ కేయూరం, కృష్ణం వందే జగద్గురుం ||2||

అవిసిపువ్వువంటి ఆకారము కలిగినవాడును, కంఠ హారముల

తోను , అందెలతోను, హస్తాభరణములలోతోను శోభించే

ఆకారము గల జగద్గురువగు శ్రీ కృష్ణపరమాత్మకు

నమస్కారము.

కుటిలాలక సంయుక్తం, పూర్ణచంద్రనిభాననం

విలసత్కుండల ధరం, కృష్ణం వందే జగద్గురుం ||3||

వంపులు తిరిగిన ముంగురులతోను, రత్న కుండలముల

తోను, పూర్ణచంద్రునివంటి మోముతో ముద్దులొలికెడి

జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్కృతులు.

మందార గంద సంయుక్తం, చారుహాసం చతుర్భుజం

బర్హి పిజ్జ్చావ చూడాంగం, కృష్ణం వందే జగద్గురుం ||4||

మందారపుష్ప పరిమళముతో నిండినదియు, చతుర్భుజములు

కలిగినదియు, నెమలిపింఛముతో విలసిల్లు దివ్యదేహము గల జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మకు వందనములు.



ఉత్పుల్ల పద్మ పత్రాక్షం, నీలజీమూత సన్నిభమ్,

యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుం ||5||

పద్మపు రేకులవంటి విశాలనేత్రములతోను, నల్లని

మేఘమువంటి శరీరకాంతితోను కూడినవాడై, యాదవు

లందరికి శిరోభూషణమువలె ప్రకాశించు శ్రీ కృష్ణ పరమాత్మకు 

నమోవాక్కములు.

రుక్మిణీకేళి సంయుక్తం, పీతాంబర సుశోభితం

అవాప్త తులసీగంధం, కృష్ణం వందే జగద్గురుం ||6||

పీతాంబరధారియు, తులసిమాలను ధరించి దాని 

పరిమళముతో, నిండిన దేహమును కలిగి, రుక్మిణీ దేవితో 

క్రీడ సలుపు జగద్గురువగు శ్రీ కృష్ణ పరమాత్మకు వందనములు,

గోపికానాం కుచద్వన్ద, కుంకుమాంకిత వక్షసం

శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం||7||

గోపికలను ఆలింగనము చేసికొను సమయంలో వారి

స్తనద్వయమునందున్న కుంకుమతో చిహ్నితమైన విశాల

వక్షస్థలం కలవాడును, సంపదలకు నిలయమైనవాడును 

అగు జగద్గురువైన శ్రీ కృష్ణపరమాత్మకు నమస్కారము.

శ్రీవత్సాంకం మహోరస్కం, వనమాలావిరాజితం

శంఖచక్ర ధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం||8||

"శ్రీ వత్సము" అనెడి పుట్టుమచ్చ కల తన విశాల

వక్షస్థలముపై వనమాలను ధరించినవాడును, శంఖచక్రములు

ధరించిన కరములు కలవాడును అగు జగద్గురువైన శ్రీ కృష్ణ

పరమాత్మకు నమస్కరించుచున్నాను.

కృష్ణాష్టక మిదం పుణ్యం, ప్రాతురుత్థాయః పఠేత్కోటిజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి ||9||

ఫలశ్రుతి:- పుణ్యప్రదమైన ఈ కృష్ణాష్టకమును ప్రాతః

కాలమున లేచి శుచిగా పఠించువానికి కోటిజన్మలలోని

పాపము నశించును.



Comments

Popular posts from this blog

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS