తులసీదళాలతో @LORD KRISHNA SONG
https://youtu.be/wc3gdpGvVSM?si=mvyW3C6QyCV1mY9H
తులసి దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
యమునా తీరాన రాజ క్రీడలాడ0గ
రాధమ్మను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు
త్యాగయ్యను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు
మీరాబాయి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2) (తులసి)
సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
నీ ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
Comments