Saturday, July 6, 2024

ఆధ్యాత్మిక విషయాలు

 


"వివేకం ద్వారా స్వేచ్ఛ లభిస్తుంది"

నిజమైన స్వేచ్ఛ 'సంపాదించడం' ద్వారా కలిగేదికాదు. వివేకం ఉండటం ద్వారా కలిగే ఫలితం అది 

బయటకు వెళ్ళి మార్కెట్టులో స్వేచ్ఛను మీరు 

కొనుక్కొని రాలేరు. ఒక పుస్తకం చదవటం ద్వారా కాని, 

ఒక ప్రసంగం వినడం వల్లకాని కలిగేది కాదు. స్వేచ్ఛ

వివేకం ద్వారా వస్తుంది. సృజనాత్మకత - అంటే అర్థం

నిజమైన అంతఃస్ఫూర్తి కలిగివుండడం. అది 

వుండాలంటే స్వేచ్ఛ వుండాలి. ఈ స్వేచ్ఛ కావాలంటే

వివేకం వుండాలి. కాబట్టి వివేకాన్ని నిరోధిస్తున్నది

ఏది అనే సంగతి మీరు విచారణ చేసి తెలుసుకోవాలి. 

మీరు జీవితాన్ని తరచి తరచి చూసి తెలుసుకోవాలి. సామాజిక విలువలను, ఇంకా అన్నింటినీ

ప్రశ్నించాలి. భయపడి పోయివున్నారనే కారణంగా

ఏ ఒక్క దానికే అంగీకారం తెలుపకూడదు.

అసలు ప్రధానమైనది ఏమిటంటే స్వచ్ఛగా ఆలోచించడం, ఆవిధంగా మీ అంతట మీరే స్వయంగా

తెలుసుకొనడం ఆరంభించడం ఎంతో ముఖ్యం.

పశ్నించడానికి స్వేచ్ఛవున్నపుడే ఆలోచించి తెలుసు కొనడానికి అన్వేషించి కనుగొనడానికి స్వేఛ్చవున్నపుడు మాత్రమే వివేకం ఉదయిస్తుందని నిశ్చయంగా 

చెప్పవచ్చు. అప్పుడే మీ మనసు అతి చురుకుగా, 

అతి జాగరూకంగా అత్యంత నిర్దుష్టంగా తయారవుతుంది . అప్పుడు మీరు సంపూర్ణంగా సమన్వయత్వం చెందిన వ్యక్తిత్వం సాధిస్తారు. లోపల ఒక విధంగా భావిస్తూ

బయట మరో రకమైన కట్టుబాట్లకు లొంగిపోయి,

ఏం చేయాలో పాలు పోక భయంతో వణికి పోతున్న

ఒకప్రాణివలె ఉండరు.

భయభీతి నుండి విముక్తి

మనలో చాలా మందిలో భయం ఎన్నో విపరీతాలను సృష్టిస్తూ వుంటుంది.. రకరకాలైన

భ్రాంతులలో పడవేస్తుంది. సమస్యలను

తయారు చేస్తుంది . భయ భీతిని గురించి

బాగా లోతుకు వెళ్ళి చూసి పూర్తిగా అవగాహన 

చేసుకోనంతవరకు అదిమనం చేసే పనులను

వక్రంగా మార్చివేస్తుంటుంది . మన ఉద్దేశ్యాలకు

పెడర్థాలును కల్పిస్తుంది. మన జీవిత విధానాన్ని

వంకర టింకర చేసివేయగలదు భయం . 

మనిషికీమనిషికీ మధ్యన అడ్డుగోడలు లేపుతుంది.

అన్నిటి కంటే ప్రేమానురాగాలను హతమారుస్తుంది,

అన్నది మాత్రం పూర్తిగా నిజం. భయాన్ని 

గురించి యోచించిన కొద్దీ, బాగా ఆకళింపు చేసుకొని,

దానినుండి నిజంగా విముక్తి పొందిన కొద్దీ 

మనచుట్టూరావున్న వాటితో మనకు పరిచయం 

ఎక్కువవుతూ వుంటుంది. ప్రస్తుతం జీవితంలో మనకు

వున్న అర్థవంతమైన సంబంధాలు చాలా కొద్ది 

అవునుకదూ ? భయ భీతి నుండి మనల్ని విముక్తి 

చేసుకోగలిగితే మన సంబంధాలను విస్తుృత 

పరచుకోవచ్చును, గాఢమైన అవగాహన, నిజమైన

సానుభూతి, ప్రేమపూర్వకమైన జౌదార్యం పెంచుకోవచ్చు

ను? మన దృక్మండలాన్ని అపారంగా 

విస్తృతపరచగలుగుతాం కూడా.

మనలో ఒక నిశ్చింత కల్గించేదాన్ని మనం కోరుకుంటాం

అందుకు రకరకాలయిన రక్షణలను ఏర్పరచుకుంటాం. మానసికమైన, బాహిరకమైన కవచాలను 

ఏర్పరచుకుంటాం . ఇంటికిటికీలు, తలుపులు. 

అన్నీమూసివేసి లోపల కూర్చునప్పుడు చాలా భద్రంగా వున్నట్లు భావిస్తాం ; సురక్షితంగా ఉన్నామని ఎవరూ మనల్ని వేధించలేరు అని అనుకుంటాం. కాని జీవితమంటే

అది కాదు కదా మనకు బయటి దృశ్యాలు కనిపించాలి.

మనం అన్నింటినీ చూడాలి అని జీవితం ఎడతెరపి

లేకుండా మనతలుపులు తడుతూనే వుంటుంది.

మన కిటికీలు తెరవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే

వుంటుంది. భయం వలన తలుపులకు తాళాలు

వేసుకొని, కిటికీల గడియలు వేసుకొని

మనం కూర్చుంటే తలుపులు మరింత గట్టిగా

కొట్టడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో

ఏర్పరచుకున్న భద్రతను అంటిపెట్టుకొని మనం

కూర్చున్న కొద్దీ జీవితం మనల్ని మరింతగా త్రోసి

పడవేద్దామని చూస్తుంది. మనం భయపడి, 

మనచుట్టూ మనమే గోడలు కట్టి మూసివేసుకున్నకొద్దీ

మన బాధలు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. 

ఎందుకంటే జీవితం మనల్ని వదలిపెట్టదు కాబట్టి.

భద్రంగా వుండాలని మనం కోరుకుంటాం.

జీవితం వల్లకాదు పొమ్మంటుంది. దానితో పోరాటం

మొదలవుతుంది. అందువలన మిమ్మల్ని ఇరతరుల

నుండి పూర్తిగా దూరం చేసి ఏకాకులను చేసే

భయ భీతి భావాలను మీరు పసివయసునుండే

పశ్నించడం, ఆరంభించడం, ఛేదించి వేయడం

అత్యంత ప్రధాన మైన విషయాలని నేను 

అంటున్నాను. అంతే కాకుండా ఊహాలు, 

అభిప్రాయాలు, సంప్రదాయాలు అలవాట్లు అనే

గోడలను చుట్టూ నిర్మించుకొని మిమ్మల్ని

మూసి వేసుకోకుండా సృజనాత్మకమైన

జీవ చైతన్యం కలిగివున్న విముక్త మానవునిగా 

మీరు రూపుచెందడం చాలా ముఖ్యం. భయభీతి వున్నంతకాలం .అనుకరణ వుంటూనే వుంటుంది.

కేవలం అనుకరణ మాత్రమే చేసే మనసు 

యాంత్రికంగా తయారవుతుంది అవును కదూ? ఒక

యంత్రంలాగా తను చేయవలసిన పనులు 

నిర్వహిస్తూపోతుంది. సృజనాత్మకత వుండదు 

సమస్యలను పరిష్కరించలేదు. అటువంటి మనసు.

ఏవో కొన్ని కార్యకలాపాలను నిర్వహించవచ్చును.*****


* చిన్ముద్ర రహస్వార్థం *

ఋషులు మునీశ్వరులు లోక కళ్యాణార్ధము అరణ్యమునకు

వెళ్లి పద్మాసనము వేసుకొని, రెండు చేతులను మోకాలిపై

పెట్టిచిటికెన ఉంగరపు, మరియు మధ్య వేళ్ళను నిటారుగా

పెట్టడము, మరియు చూపుడు వేలిని బొటన వేలికి

దగ్గరగా పెట్టి ఏకాగ్రతగా ధ్యానము చేయడం మన

మందరము చూచిన విషయమే కాని మూడు వేళ్ళను అలా

నిటారుగా పెట్టడం - చూపుడు బొటన వ్రేళ్ళను అలా

ఎందులకు దగ్గరగా చేర్చడము లోని రహస్యం :-

1) కండ్లకు కనపడు స్థూల శరీరమును చిటికెన వ్రేలనియు

2) కండ్లకు కనపడని మనస్సు, బుద్ధి, చిత్తము, 

అహంకారములనెడి అంతఃకరణములె ఉంగరపు వ్రేలనియు

3) అనేక జన్మ - జన్మములుగా చేయుచు వచ్ఛుచున్న

పుణ్యపాపములనెడి రెండు కర్మలును తెలియజేయునది నడిమి వ్రేలనియు తెలియజేయుచున్నది. ఈ మూడు

వ్రేళ్ళను అలా నిటారుగా చాపడమంటే స్థూల శరీరమును,

శరీశ సంబంధీకులను, సూక్ష్మ అంతః కరణములైన

మనస్సు, బుద్ధి, చిత్త మహంకారములనెడి కర్మలను మర్చి

జీవాత్మ పరమాత్మలో ఐక్యమగుటయని చూపుడు

వ్రేలుని, బొటన వ్రేలికి కలపడము యొక్క రహస్యమ

ఇట్లు స్వామివారి భక్తులు.

***************

***స్వధర్మాలను ఆచరించని మానవుల జీవితాలకు ఏవిధంగానూ శాంతి సౌఖ్యాలు లభించవు.

కనుక తన శాంతి సౌఖ్యాల కోసమైనా ప్రతీ వాడూ తన ధర్మాలను ఆసక్తితో ఆచరించ వలసి ఉంది. సామాన్యుల దృష్టిలో,  పుణ్యాత్మునికి తరచుగా కష్ట నష్టాలు ఎదురౌతున్నట్లును, పాపాత్మునికి సుఖాలే కలుగు తూన్నట్లును పైకి కనిపిస్తుంది. అటువంటప్పుడు పుణ్యాత్ముడు తాను కష్టాలు అనుభవిస్తూన్నట్లు భ్రాంతి చెంది తన ధర్మం యెకల విరక్తి చెందడం అనేది, 

నిజంగానే  వారి కష్టానుభవానికే కారణమవుతుంది. పరమార్థంలో పాపాత్ముల పాపపరిణామం వారికి 

మర్మచ్ఛేదంగా మారడం మనం చూస్తున్నాం కదా! తన ధర్మం ఎడల వారికి చెందిన వారి గతే ఇట్టిది. కనుక వివేకం కలవాడు యెట్టి పరిస్థితిలోనూ స్మధర్మాచరణ విషయంలో పరిస్థితివిముఖత చూపరాదని ఫలితాంశం.****

*********


దివ్య సూక్తులు

1.సత్ సంస్కారములు, సద్గుణములు అలవరచుకొనుటయే నిజమైన విద్య.

2.మానవుడు భౌతికముగనే పారమార్ధికముగ

కూడ ఎత్తుగా పెరగవలసి యున్నది.

3. కాకి ఆకాశమునకు ఎగిరినా దాని దృష్టి మలిన వస్తువుల

పైననే ఉండును. కుక్క గంగ యొద్ద కేగినా గతుకు

నీళ్ళనే ఆశించును.

4) ఉత్తమ జ్ఞానికి లేనిపోని విమర్శలు చేయుటకు

వ్యవధి ఉండదు. ప్రేుతి ఉండదు.

5. ధర్మాచరణ లేని వానికి దుర్గతి కలుగును.

6.చదరంగము ఆడేవారి కంటె చూచువారికి సరియైన

ఎత్తులు గోచరించును.

7.చదువుట కంటె వినుట మేలు. వినుటకంటె ఆచరించు.

మేలు.

*********


* భారతధర్మం *

* అధర్మంగా సంపాదించిన ధనంతో ఏలోపాన్నితే

కప్పుకోవడానికి ప్రయత్నిస్తామో, ఆ లోపం సాగదు.

దానివల్ల వేరొక దోషం ప్రకటించ బడుతుంది.

* ధర్మం పై అను రాగం వున్నవాడు పరుష వాక్కులు

పలుకరాదు. పరుషవచనాలు హృదయాలను కాల్చుతాయి

సభ కాదు .

సభ కాదు

* ఏ సభలో పెద్దవాళ్ళుందరో అది

పెద్ద వాళ్ళున్నంత మా తోన కూడా

ఏ పెద్దలు ధర్మాన్ని పలుకరు వారో వారు పెద్దలే

కారు. నేనిలో సత్యం వుండదో అది ధర్మం కాజాలదు.

పది మోసంతో నిండివుందో, అది సత్యమూ కాదు

* మంచి బుద్ధి, నిగ్రహం, విద్య, పరాక్రమం,

మిష భాషిత్వం, శక్తి నను సరించుడిచి దానం

చేయుట. చేసిన మేలు మరవకుండుట.

ఈ ఏడు గుణాలు మనిషికి శోభనిచ్చేవి.

బుద్దమందుడి బాహువులు దీర్ఘమైనవి.

దేనినైనా అందుకోగలడు. (విదురనీతి)

మహాభారతం.



No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular