Friday, July 19, 2024

అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా- లిరిక్స్ @గద్దర్ పాట

అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమా నీదమ్మో (అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమా నీదమ్మో) ఎటోళ్ళ మట్టి చిప్పవో ఎటోళ్ళ మట్టి చిప్పవు గాయిదోళ్ళ గాండ్ర గొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) 2.ఖమ్మం మెట్టు అడువులతోనే కట్టుకుంది పచ్చని సీర (కట్టుకుంది పచ్చని సీర) ఆదిలాబాదు ఆకు నులిమి పెట్టుకుంది నొసట బొట్టు (పెట్టుకుంది నొసట బొట్టు) నాగారం అడివితుమ్మతో దిద్దుకుంది కనుల కాటిక (దిద్దుకుంది కనుల కాటిక) కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో (కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో) నిండు ముత్తైదా తెలంగాణము ముండమోసినట్లున్నాదమ్మో (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) (అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా) 3.పసుపు పచ్చ ఆకుపచ్చ నాపరాయి సూపు సూడు (నాపరాయి సూపు సూడు) ముదుమాణిక్యం అమృతపాళి ముద్దు ముద్దు మొఖము సూడు (ముద్దు ముద్దు మొఖము సూడు) దేవుళ్ళకు మారు రూపము నల్ల సరుకు నునుపు సూడు (నల్ల సరుకు నునుపు సూడు) కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందమర్రమ్మో (కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందమర్రమ్మో)

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular