కరోనా ఖర్మ కాదు! కర్మ!!

 కరోనా ఖర్మ కాదు! కర్మ!!


మనిషి తనకు కారణాలు తెలియని, ఊహకు, తర్కానికి  అందని విషయాలన్నిటికీ ఖర్మ అనుకుని దేవుడి మీద భారం వేస్తుంటాడు. కానీ మన జీవన్మరణాల భారం దేవుడిది కాదు. మనదే. అది మన కర్మ ఫలితం. ప్రకృతిని మనమే నాశనం చేసి మనకు మనమే ముప్పు తెచ్చుకుంటున్నాము. ప్రకృతిలో ఎదురయ్యే ఉపద్రవాలన్నిటికీ మనిషే కారణమని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఎప్పటినుంచో చెపుతున్నారు.


లండన్ కు చెందిన Steve Cutts అనే పర్యావరణ ప్రేమికుడు 2012 లో రూపొందించిన MAN  అనే యానిమేషన్ ఫిలిం ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కరోనా వర్సెస్ కర్మ పేరుతో దీన్ని కొందరు యూట్యూబ్ లో లోడ్ చేశారు, దానికి త్రి ఇడియట్స్ చిత్రంలోని పాటను కూడా జోడించారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

https://youtu.be/A8P4chOLbVo

https://youtu.be/WfGMYdalClU

స్వయంగా యానిమేటర్ అయిన Steve ఇల్లస్ట్రేషన్స్ ఆధారంగా ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని, మనిషి చేష్టలు, చర్యలు, కర్మల వల్ల ఏర్పడుతున్న ముప్పును చక్కగా వివరించారు. ఇది కరోనా కు కారణం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెపుతుంది. ఈ క్రింది వీడియో ఒరిజినల్ దీనికి Edvard Grieg సమకూర్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

సేకరణ Link: https://ghantapatham.blogspot.com/2020/03/blog-post_30.html

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి