SANATANA SAMPRADAYA SMRANALU
సనాతన సాంప్రదాయ స్మరణములు
1.శ్లోకం : భక్తి శ్రద్ధా భావనాచ |
పూజాం జీవ ఉచ్యతే ||
తాత్పర్యం : చేయబడు పూజా కార్యమునకు (1) భక్తి (2) శ్రద్ద (3) భావన అనునవి జీవములుగా పేర్కొనబడినవి.
గాన వానిని పెంపొందించు కొనవలెను.
2.శ్లోకం : భగవతో బలేన - భగవతో వీర్యేణ |
భగవతస్తే జసా - భగవతః కర్మ కరిష్యామి ||
తాత్పర్యం : నేను భగవంతుని యొక్క బల, వీర్య, తేజస్సుల సహాయంతో భగవంతుని కర్మ చేయుచున్నాను.
3.శ్లోకం : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం - వందే గురు పరంపరామ్ ||
తాత్పర్యం : (మనది శాశ్వతమైన సనాతన ధర్మం. దీనికి భగవానుడైన
నారాయణుడు ఆదిగురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి వశిష్ఠుడు, వశిష్టుని నుండి శక్తి, శక్తి నుండి పరాశరుడు, పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి శుకుడు, శుకుని నుండి గౌడపాదుడు, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులు, అతని నుండి ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని స్వీకరించి కొనసాగించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు)
నారాయణుని మొదలుకొని మధ్యను శంకరాచార్యులవారు, పిమ్మట మళ్ళీ మన గురువు వరకూ ఉన్న గురు పరంపరకు నమస్కారము అని గురువందనము.
4.శ్లోకం :
మాతా పితృభ్యో నమః, శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః,
ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతాభ్యో నమః
తాత్పర్యం : తల్లిదండ్రులకు నమస్కారము, లక్ష్మీనారాయణులకు నమస్కారము,ఉమామహేశ్వరులకు నమస్కారము,
వాణీ చతుర్ముఖులకు నమస్కారము, శచీదేవీ ఇంద్రులకు నమస్కారము, అరుంధతీ వశిష్టులకు నమస్కారము, సీతారాములకు నమస్కారము, మహానుభావులందరికీ నమస్కారము, ఇంద్ర, అగ్ని, యమ, నిఋతీ, వరుణ, వాయు, కుబేర, ఈశాన అను 8 దిక్కుల అధిపతులకు నమస్కారము.
5.శ్లోకం : పూర్వ జన్మాను శమ నాజన్మ మృత్యు నివారణాత్ |
సంపూర్ణ ఫల దానాశ్చ - పూజేతి కథితాప్రియే ||
తాత్పర్యం : కులార్ణవ తంత్రంలో 'పూజ' పూర్వజన్మల కర్మవాసనలను
నశింపజేసి, జనన మరణ చక్రాన్ని ఆపివేసే, సంపూర్ణ ఫలాన్నిచ్చే
చర్యగా నిర్వచిస్తారు.
6.శ్లోకం : కరాగ్రే వసతే లక్ష్మీః - కరమధ్యే సరస్వతీ |
కరమూలేతు గౌరీచ - ప్రభాతే కరదర్శనమ్ ||
తాత్పర్యం : మన కుడిచేయి వేళ్ళయందు లక్ష్మియు, మధ్య భాగమునందు సరస్వతియు, మూలమందు గౌరీదేవియు
వసించియుందురు. గాన నిద్ర నుండి మేల్కొనిన వెంటనే అరచేతిని చూచుకొనవలెను. :
7.శ్లోకం :సముద్రవసనే దేవి! - పర్వత స్తనమండలే |
విష్ణుపత్ని! నమస్తుభ్యం! - పాదస్పర్శం క్షమస్వమే ||
తాత్పర్యం : నిద్రలేచిన వెంటనే పాన్పు నుండి కాలు నేలపై పెట్టేముందు, సముద్రాలు వస్త్రముగా గల, పర్వతములు పాలిండ్లుగా గల విష్ణుపత్నియైన ఓ భూదేవీ ! నీపై కాలుమోపుతున్నాను. నీకు
నమస్కారము. నా పాదస్పర్శను క్షమింపుము.
8.శ్లోకం : గంగేచ యమునే చైవ - గోదావరి సరస్వతి!
నర్మదే సింధు కావేరి - జలేస్మిన్ సన్నిధింకురు ||
తాత్పర్యం : ఓ గంగా యమునా గోదావరీ సరస్వతీ నర్మదా సింధూ కావేరీ మహానదులారా! నేను స్వీకరిస్తున్న ఈ పవిత్రమైన జలాలలో
మీరందరూ సన్నిహితులు కండి. (దేవతార్చన సమయాల్లో, స్నాన వేళల్లో హిందువులంతా జల పవిత్రీకరణానికి భక్తిశ్రద్దలతో పఠించే పుణ్యశ్లోకం ఇది. )
9.శ్లోకం : ఉదయేచ స్వయం బ్రహ్మా - మధ్యాహ్నే తు మహేశ్వరః |
సాయంకాలే మహావిష్ణుః - త్రయీమూర్తిః దివాకరః ||
తాత్పర్యం : సూర్య భగవానుని ఉదయ కాలమునందు బ్రహ్మస్వరూపముగను,మధ్యాహ్నమున మహేశ్వరుడుగను,
సాయంకాలమునందు విష్ణురూపునిగను ఇట్లు త్రిమూర్తుల రూపముగ భావించినమస్కరించవలెను.
10. శ్లోకం : అవిద్యాది తమః పుంజ విచ్చేదన పటీయసీ |
పరబ్రహ్మ స్వరూపా త్వం దీపలక్ష్మి నమోస్తుతే ||
తాత్పర్యం : అవిద్యవంటి చీకట్లను నాశనం చేయగలిగే శక్తివి నీవు. ఓ దీపలక్ష్మీ!నీవు పరబ్రహ్మ స్వరూపురాలవు. నీకు నమస్సులు.
11.శ్లోకం : బ్రహ్మా మురారీ స్త్రీపురాంతకారీ,
భానుః శశీ భూమిసుతో బుధశ్చ!
గురుశ్చ శుక్రః శని రాహు కేతువః,
కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్||
తాత్పర్యం : బ్రహ్మ, విష్ణు, శివ, సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని,రాహు కేతువులందరూ నాకు సుదినమును కల్పింతురు గాక!
12.శ్లోకం : పృథ్వీ సగంధా సరసాస్తథాపః,
స్పర్శీచ వాయుర్జ్వలితం చ తేజ:
నభః స శబ్దః మహతా సహైవ,
కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్||
తాత్పర్యం : గంధవతి అయిన భూమి, రసవంతులైన జలములు, స్పర్శ గుణము కలిగిన వాయువు, జ్వలించెడి అగ్ని, శబ్దమయమైన ఆకాశము మహతత్త్వము - ఇవన్నియు నాకు శుభోదయమును కల్పించుగాక!
13.శ్లోకం: లాభస్తేషాం జయస్తేషాం - కుతస్తేషాం పరాభవః
ఏషామిందీవరశ్యామో ! హృదయస్థో జనార్ధనః ||
తాత్పర్యం : నల్ల కలువరంగు గల జనార్ధనుని ఎవరు హృదయముల యందుధ్యానించుచున్నారో వారికి నిరంతరమూ లాభము,
జయము కలుగును. ఎప్పుడూ అవమానింపబడరు.
14శ్లోకం : యత్ఫలం నాస్తి తపసా - న యోగేన సమాధినా |
తత్ఫలం లభతే సమ్యక్ - కలె కేశవ కీర్తనాత్ ||
తాత్పర్యం : తపస్సుచేతను, యోగము చేతను, సమాధిచేతను లభించని ఫలము కలియుగమున కేవలము కేశవ కీర్తన చేతనే లభించును.
-----------------------------------------------------
15.శ్లోకం : ధ్యాయన్ కృతే యజన్,
యజ్ఞః త్రేతాయాం, ద్వాపరేర్చనాత్|
యదాప్నోతి దతాప్నోతి |
కలెకేశవ కీర్తనాత్ ||
తాత్పర్యం : కృతయుగంలో ధ్యానాదుల చేతను, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేతను, ద్వాపరయుగంలో అర్చనాదులచేతను
ఏ పరమపదవి లభిస్తుందో అది కలియుగాన కేశవుని కీర్తించడం
చేతనే లభిస్తుంది.
16.శ్లోకం : మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః |
రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కిరైవచ ||
తాత్పర్యం : మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము,
నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, బలరామావతారము, బుద్దావతారము, కల్కి అవతారము. ఇవీ నారాయణుని దశావతారములు. ఈ అవతార
స్మరణతో నారాయణుని ధ్యానిస్తే కార్యసిద్ధి, ఇష్టసిద్ధి లభిస్తాయి. శ్లోకం : శివాయ విష్ణురూపాయ ! శివ రూపాయ విష్ణవే !
శివస్య హృదయం విష్ణు | ర్విష్ణోశ్చ హృదయం శివః || తాత్పర్యం : విష్ణు స్వరూపుడయిన శివునకు, శివ స్వరూపుడైన విష్ణువునకు
నమస్కారము. శివుని హృదయమే విష్ణువు. విష్ణుని హృదయమే శివుడు. అనగా ఉభయులకును భేదము లేదని భావము. : చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కుడు దానముల శౌచ శీల తపములన్ ! జిక్కడు యుక్తిని - భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్దము సుండీ | తాత్పర్యం : భగవంతుడు వ్రతములకూ, దానములకూ, శౌచ శీలములకూ,
జప తపాదులకూ, యుక్తులకూ చిక్కడు. భగవంతుడు గాఢమైన
భక్తికి వశ్యుడవుతాడు. శ్లోకం : చరితం రఘునాధస్య - శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైక మక్షరం ప్రోక్తం - మహాపాతక నాశనమ్ || తాత్పర్యం : నూరుకోట్ల శ్లోకములతో విస్తరించియున్న శ్రీరామచంద్రుని పవిత్ర
చరిత్రము నుండి ఒక్కొక్క అక్షరము నోట ఉచ్ఛరించినను మహాపాపములు నశించును.
శ్లోకం : పై క్షణమెట్టులుండునో, విపత్తులె వచ్చునో, చావే మూడునో
యేక్షణమందునేమొ భవదిచ్ఛ యేటుండునో గాన నిప్పు యక్షయమౌ త్వదీయ భజనామృతమున్ ననుగ్రోలనిచ్చి పా
ప క్షయమౌ విధంబుగ గృపన్ నను జూడుము జానకీపతీ ! తాత్పర్యం : సీతాపతీ! రామా! ముందు వచ్చేది ఎలా ఉంటుందో ఏమి
చెప్పగలము! పెద్ద ఆపద రావచ్చు! లేక చావె మూడవచ్చు! నీ సంకల్పము ఏమిటో చెప్పలేము. కాబట్టి అక్షయమగు నీ యొక్క భజనామృతమును నన్ను గ్రోలనిచ్చి నా పాపాలు బాపి నన్ను కరుణతో కాపాడవయ్యా! రామచంద్రా! : నమామి - నారాయణ పాద పంకజం కరోమి - నారాయణ పూజనం సదా | వదామి - నారాయణ నామ నిర్మలం
స్మరామి - నారాయణ తత్త్వమవ్యయం | తాత్పర్యం : శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును.
నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణుని తత్త్వాన్ని
స్మరింతును. శ్లోకం : ఆహార నిద్ర భయ మైథునం చ, సమాన మేతత్ పశుభిః నరాణాం
ధర్మోహి తేషా మధికో విశేషో, ధర్మేణ హీనః పశుభిః సమానః || తాత్పర్యం : ఆహారం, నిద్ర, భయం, మైధునం మానవులకు పశువులకు
సమానమే! కానీ, ధర్మ వర్తనమే మానవునికి విశేషగుణము. ధర్మం
లేనివాడు పశు సమానుడు. శ్లోకం : మితనిద్రా మితాహారో మితవస్త్ర పరిశ్రః!
మితభాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణమ్ || తాత్పర్యం : బ్రహ్మచర్య వ్రతమును సలుపువానికి మితముగ నిద్రయు, బ్రహ్మచర్య
వ్రతమునకు భంగము కలుగనిమితమైన ఆహారమున్ను, నిరాడంబరమై శుభ్రమైన వస్త్ర పరిగ్రహమున్ను, మిత భాషణమున్ను కలిగి ఉండవలెను.
శ్లోకం : చిరు .
14
15
===============================
శ్లోకం
: దేవే తీర్దేచ మంత్రేచ దైవజ్ఞే భేషజే గురౌ |
యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ || తాత్పర్యం : దేవతయందుగాని, తీర్థమందుగానీ (బ్రహ్మనిష్ఠునీయందు గాని),
మంత్రమందుగానీ, జ్యోతిష్యునియందుగానీ, వైద్యునియందు గాని, గురువునందుగానీ, ఎవరెవరికి ఎట్టి భావన యుండునో ఆ
ప్రకారమే ఫలితము సిద్ధించుచుండునని శాస్త్ర ప్రమాణము. శ్లోకం : జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః - జిహ్వాగ్రే మిత్ర బాంధవాః |
జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః - జిహ్వాగ్రే మరణం ధృవమ్ || తాత్పర్యం : నాలుక వలన సంపద, బంధుమిత్రులు, సంకేళ్ళు, మరణం
కలుగుతాయి. (మనకు మంచి చేసినా కీడు చేసినా అది మన నాలుకయే కనుక మంచి, మృదువైన, ప్రియ సంభాషణలతోనే ఎదుటివారిని ఆకట్టుకోవాలి. మనసుకు బాధ కలిగించే మాటలవల్ల
కలిగే సంకెళ్ళను, మరణమును దగ్గరకు రానీయరాదు) శ్లోకం
: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శృక్తిః పరాక్రమః |
షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవోహి తిష్ఠతి || తాత్పర్యం : ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్భుద్ధి, శక్తి, పరాక్రమము -
అను ఆరు సుగుణాలున్నచోట సాక్షాత్ భగవానుడు
నివాసముండును. శ్లోకం : హనుమన్నితీ మే స్నానం, హనుమన్నతి మే జపః |
హనుమన్నితి మే ధ్యానం, హనుమశీర్తయే సదా || తాత్పర్యం : హనుమ నామమే నా స్నానం. హనుమ నామమే నా జపం.
హనుమ నామమే నాధ్యానం. హనుమను ఎల్లప్పుడూ కీర్తించుదును. శ్లోకం : ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖైస్త్రీక్షణేః
యుక్తా మిన్లు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ట వర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాం కుశ కశా శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిన్ద యుగళం హస్తి ర్వహన్తం భజే || తాత్పర్యం : గాయత్రీదేవికి ఐదు ముఖులు. ఒకటి ముత్యపు రంగువలె
తెల్లగానూ, రెండవది పగడమువలె ఎర్రగానూ, మూడవది.
బంగారపు రంగువలె పచ్చగానూ, నాల్గవది నల్లని రంగులోనూ, ఐదవది తెలుపురంగులోనూ శోభిస్తూ ఉంటాయి. ముత్యమువంటి తెలుపు, ఎరుపు, బంగారం, నీలం, తెలుపు వర్ణాల పంచముఖాలతో, మూడు కన్నులతో, చంద్రరేఖ కలిగిన కిరీటంతో వున్న తల్లి గాయత్రి. ఆ వేదమాత చేతుల్లో వరద, అభయ, అంకుశ, కశ (కొరడా), కపాలం, గద, శంఖ, చక్ర, పద్మద్వయం ఉన్నాయి. ఈ రూపంతో ఉన్న గాయత్రిని ధ్యానిస్తూ సూర్యుని భక్తితో నమస్కరించాలి. ప్రతి ముఖమునకు మూడు నేత్రములు ఉన్నవి. శిరస్సుపై రత్న కిరీటంలో చంద్రరేఖ ఉన్నది. ఈమె తత్త్వార్థములను తెలుపు అక్షరములనే స్వరూపముగా గలది. ఈమెకు పది చేతులు. ఆ పది చేతులలో ఒక కుడిచేతితో వరదముద్రను, ఒక ఎడమ చేతితో అభయముద్రను, మరియొక కుడిచేతితో అంకుశము ఎడమచేతితో చిల్లకోలను, ఆ విధంగానే మరొక కుడిచేతితో కపాలమును, ఎడమ చేతితో గద, మరొక కుడిచేతితో శంఖమును, ఎడమ చేతితో చక్రమును, తక్కిన రెండు చేతులతో రెండు తామర పుష్పములను ధరించియుండును. ఈ విధముగా ఉన్న గాయత్రీదేవిని ధ్యానించెదను. (ఈ శ్లోక పఠనం వల్ల ఐశ్వర్యం, విద్య, సుఖ జీవనం, జ్ఞానం లభిస్తుంది.)
ఈ ఈఈఈrs- ఉ ఊ
శ్లోకం
: యత్రాస్తి భోగో - నహతత్ర మోక్ష? యత్రాస్తి మోక్షో - నహి తత్ర భోగః! శ్రీ మారుతేస్సేవన తత్పరాణాం
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ || తాత్పర్యం : ఎచ్చట భోగముండునో అచ్చట మోక్షముండదు. ఎచ్చట మోక్షమున్నదో అచ్చట భోగముండదు. కాని ఆంజనేయ సేవా తత్పరులకు భోగము మోక్షము రెండును సిద్ధించును.
No comments:
Post a Comment