విశ్వ పౌరత్వం
Posted On:3/18/2015 11:49:46 PM
భావ విశుద్ధి, జ్ఞానం, ప్రజాహితవర్తనం, దయార్ద్రహృదయం, ధైర్య సాహసాలు, విశృంఖల నిశ్చల సత్యదీక్ష ప్రతీ పౌరునిలో ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతం. మానవత్వం ఉట్టిపడేలా ప్రపంచం కోసం, జ్ఞానం కోసం నా ఈ జన్మ అని ప్రకటించిన గౌతమ బుద్ధుని విశ్వపౌరత్వం అవనికే ఆదర్శం.
ఏకం వినిన్యే సజుగోప సప్త, సప్తైవ తత్యాజరరక్షపంచ
ప్రాప త్రీవర్గం బుబుధే త్రీవర్గం జజ్ఞే ద్వివర్గం ప్రజాహౌ ద్వివర్గమ్ ॥
ఎదుటివారికి చెప్పే ముందు మనం దానిని అవలంబించాలనే సామాన్యధర్మాన్ని విశ్వశ్రేయస్సుకై ఉపయోగించిన బుద్ధుడు మనసును వశం చేసుకున్నాడు. ఆ ఒకటీ చాలు అనేక అద్భుతాలకూ, ఉపద్రవాలకూ హేతువు. ఏడు మలినాలను వదిలి సప్తధాతువులను రక్షించాడు. ఐదు తత్తాలనూ కాపాడినాడు. ధర్మార్థకామాలను ఆచరించాడు. శత్రుమిత్ర ఉదాసీనమనే మూడింటినీ తెలుసుకున్నాడు. నయం-అనయం అనే రెండింటిని అర్థం చేసుకొని కామక్రోధాలు రెండింటినీ వదిలివేశాడు. అజ్ఞానంధకారాన్ని పారద్రోలడానికి జ్ఞానసూర్యుడిలా ఉద్భవించిన గౌతమబుద్ధుడు లోకధర్మాన్నీ, జీవనతత్వాన్నీ, అర్థం చేసుకున్నాడు కనుకనే ప్రపంచాన్ని దుఃఖార్ణవం నుంచి దాటించాడు. సున్నితమై న, సునిశితమైన ఆలోచనలతో ధర్మవ్యవస్థను స్థిరపరిచాడు.
దుఃఖం నుంచి అన్వేషణ సాగించి జ్ఞానశోధన చేసిన బుద్ధుని ప్రస్థానం క్లిష్టపరిస్థితుల నుంచే మనిషి ఉన్నత శిఖరాలను చేరే ఆలోచనలు పుట్టుకొస్తాయనే తత్తం ధ్వనిస్తుం ది. మోహాన్ని విడిచి వాస్తవంతో లోకాన్ని పరికిస్తే మానవధర్మం అర్థమవుతుందనే ఆయన ప్రబోధం ప్రపంచశాంతిని పరిపుష్టం చేసింది. విశాలం, స్నిగ్ధం, దీప్తివంతం అయిన బుద్ధుని నల్లని కనుదోయి విశ్వం లోతుల్ని దర్శించింది.
జీవితంలోనైనా, తత్తదర్శనంలోనైనా ఒక్కో దశలో ఒక్కో మెట్టే అధిగమించి పూర్వపు వాసనలు మెల్లగా వదిలిపోతుంటే సంస్కారవంతమై జ్ఞానవిజయం సుసాధ్యమవుతుంది. వివేకం గల మనిషి అజ్ఞానంలో బతికినన్నాళ్ళు అశాంతి, అసంతృప్తి అతన్ని విడిచిపెట్టవు. జ్ఞానం అంటే సత్యం, వాస్తవం, అనంతం దానిని తెలుసుకొని మసులుకుంటే సొంత మనశ్శాంతితో పాటు ప్రపంచశాంతినీ పొందగలడు. వ్యక్తి శ్రేయస్సే విశ్వశ్రేయస్సై శోభిల్లుతుంది.
-ఇట్టేడు అర్కనందనాదేవి
Thursday, March 19, 2015
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment