Posts

గానలోల! కరుణాల వాల! గాచి బ్రోవు నిరుపమ గుణశీల!#swami_sundara_chaitanyananda

Image
https://youtube.com/shorts/WGScGy6qH0Y?si=_3iF9Fjg0nUYeUvL గానలోల! కరుణాల వాల! గాచి బ్రోవు నిరుపమ గుణశీల! *అగుపించ వేమి శ్రితజన పాల? వరుల దృష్టి నిన్నేమి చేయు దర్శనము దృశ్యము ద్రష్టవు కావా! కాలము దూరము కల్పన కావా! *ఉపచారములు నేర్వని వారము అపచారములే ఎరిగిన వారము అర్హత లేవియు పాపొందని వారము సారము లేని మేము నీ వారము *కన్నులలో వెలుగువు నీవే వెన్నెలలో వెలుతురు నీవే జలమున ప్రాణము జగతిలో జీవము అంతా నీవే! అనంతము నీవే! *వినుమా గోల - శ్రీరమణీ లోల మాయాజాలము నే తాళ జాల నీలి నయనాల త్రిభువన పాల! ఆశ్రిత మందార! చైతన్య శీల!

నీవే నీవే నీవే నీవే నీవేనా యెద కదిపిన కళ నీవే#swami_sundara_chaitanyananda

Image
  https://youtube.com/shorts/-EcMSmTitQY?si=jcTolWcgyzdw_Jyt

అంతర్యామి - అసలైన సౌభాగ్యం#అప్పరుసు రమాకాంతరావు

Image
  అంతర్యామి అసలైన సౌభాగ్యం సమాజంలో అందరిదీ ఒకే రీతి జీవిత గమనం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు. ఎందరో వారిలోని సామర్థ్యాన్ని సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశమూ ఆలోచనా లేనివారు. వీళ్లంతా సంతోషంగా బతుకుతున్నారా అంటే, కచ్చితంగా ఔనని చెప్పలేం. ఆనందం మనసుకు సంబంధించింది.అదేమీ ఎండమావి కాదు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు. సంతోషం లేని సంపదలు విషతుల్యమైన రసభరిత ఫలాల్లాంటివని కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలో చెబుతాడు. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం! ఏది ఉన్నా లేకున్నా, అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అందని ద్రాక్ష లాంటిదే. జీవన మార్గంలో ఎంత వేగిరపడినా అందరికీ అన్నీ అందవు. దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. ఈ హద్దులను గుర్తించలేకపోతే నిరాశ, నిస్పృ...

ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు#swami_sundara_chaitanyananda

Image
https://youtube.com/shorts/KGy-IW_ZxS4?feature=share

GIRIDHARI MARCH 2026#pdf

Image

#ఆప్తవాక్యం_దాసోహం #video ##swami_sundara_chaitanyananda

Image

మల్లెకన్నా తెల్లనైన మనసు నాకుందిరా#swami_sundara_chaitanyananda

Image
   మల్లెకన్నా తెల్లనైన మనసు నాకుందిరా మనసు లేని స్వామీ నా మనసు నేలరా! *వెన్నపూస పెట్టి నిన్ను దాచుకొందు నాలో వట్టి బాస చేసి నన్ను వదలి పోకురా! *దోర వయసు దోచుకున్న దొంగ నీవు కావా దొంగ మనసు దాచిపెట్టి దొరలాగ రావా  *పాటలతో సాగిపోవు బాటసారి నేను దారి తప్పి పోతినా నీ దరికి చేరలేను  *ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా!   https://youtube.com/shorts/u-b2fVedt6k?feature=share DOWNLOAD FOLDER LINK: https://drive.google.com/drive/folders/1FPcta0ZURlIMkUCcX_gEsu_gsWR_rh_Z?usp=drive_link