Tuesday, May 13, 2025

జనమా..గులాబి వనమా! #kallem_naveen_reddy


జనమా..... గులాబి వనమా!

ప్రతీ అడుగూ ఆశల తోటలో ఓ పువ్వై విరబూస్తోంది!


అతను నిరంతరం ప్రవహించే నది

వేసవి వేడి తట్టుకుంటూ వెలిసిన నేలకూ 

చల్లదనం అందించే సెలయేరు!


ఎండిన చోటల్లా ప్రవహిస్తూనే ఉంటాడు

అతను ఒక ప్రభం "జనం", ఒక చరిత్ర!

జనంతోనే అతని జయగాధ, జనమే అతని నడక!


జనం వెంటే తను – జనం తన వెంటే!

అతని హృదయం జనహృదయం

ప్రతి ఊపిరిలో అతని పోరాట పటిమనే!


అతను నాయకుడు కాదు – సేవకుడు

జీవితంలో కొందరిని కలిసినప్పుడు,

ఒకరిని అమితంగా అభిమానిస్తూ

హృదయంలో నిలుపుకున్నప్పుడు

మనం ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందుతాము

అతను అలాంటి ఓ స్ఫూర్తి శిఖరం, నడిచే నైతికత!


25 ఏళ్ల పార్టీ ప్రస్థానం

ఒక అద్భుతమైన ప్రయాణం

స్వప్నాలకోసం మొదలైన ప్రయాణం

ఇంకా కొనసాగుతున్న గొప్ప భాధ్యత గల యాత్ర!


ఈ యాత్రలో నువ్వు నేను

అతని ఆలోచనల్లో ఉన్నవాళ్లందరినీ సమీకరించి

రేపటి భవిష్యత్ తరాల కోసం భాగమై

ప్రయాణించాల్సిన అవసరం ఉంది!

DOWNLOAD LINK: https://drive.google.com/file/d/1dW0axiEYrnigDtyc21OmV61qdLO6ZGDN/view?usp=drive_link

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular