Sunday, May 18, 2025

#PARIJATAMALA_AYYAPPA_SONGS_BOOK&VIDEOS#yesudasevergreensongs#నిడదవోలుసర్వేశ్వర్రావు#yesudasevergreensongs#MUSTWATCH

#PARIJATAMALA_AYYAPPA_SONGS_BOOK#yesudasevergreensongs#నిడదవోలుసర్వేశ్వర్రావు#PARIJATAMALA_AYYAPPA_SONGS_BOOK#yesudasevergreensongs#నిడదవోలుసర్వేశ్వర్రావు LINK: https://drive.google.com/file/d/1383EIcUNQB39_gACuFMMxW8iFjJ7HXoD/view

Tuesday, May 13, 2025

STOTRA VAHINI #PDF BOOK

NAMASTHE TELANGANA 14MAY2025

జనమా..గులాబి వనమా! #kallem_naveen_reddy


జనమా..... గులాబి వనమా!

ప్రతీ అడుగూ ఆశల తోటలో ఓ పువ్వై విరబూస్తోంది!


అతను నిరంతరం ప్రవహించే నది

వేసవి వేడి తట్టుకుంటూ వెలిసిన నేలకూ 

చల్లదనం అందించే సెలయేరు!


ఎండిన చోటల్లా ప్రవహిస్తూనే ఉంటాడు

అతను ఒక ప్రభం "జనం", ఒక చరిత్ర!

జనంతోనే అతని జయగాధ, జనమే అతని నడక!


జనం వెంటే తను – జనం తన వెంటే!

అతని హృదయం జనహృదయం

ప్రతి ఊపిరిలో అతని పోరాట పటిమనే!


అతను నాయకుడు కాదు – సేవకుడు

జీవితంలో కొందరిని కలిసినప్పుడు,

ఒకరిని అమితంగా అభిమానిస్తూ

హృదయంలో నిలుపుకున్నప్పుడు

మనం ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందుతాము

అతను అలాంటి ఓ స్ఫూర్తి శిఖరం, నడిచే నైతికత!


25 ఏళ్ల పార్టీ ప్రస్థానం

ఒక అద్భుతమైన ప్రయాణం

స్వప్నాలకోసం మొదలైన ప్రయాణం

ఇంకా కొనసాగుతున్న గొప్ప భాధ్యత గల యాత్ర!


ఈ యాత్రలో నువ్వు నేను

అతని ఆలోచనల్లో ఉన్నవాళ్లందరినీ సమీకరించి

రేపటి భవిష్యత్ తరాల కోసం భాగమై

ప్రయాణించాల్సిన అవసరం ఉంది!

DOWNLOAD LINK: https://drive.google.com/file/d/1dW0axiEYrnigDtyc21OmV61qdLO6ZGDN/view?usp=drive_link

BHAVANS JOURNAL MARCH 16to 31 2025

Sunday, May 11, 2025

స్వామి సుందరచైతన్య

స్వామి సుందరచైతన్య - ఆత్మ తత్త్వాన్ని తెలుసు కొనడానికి దేశం ప్రధానం కాదు. కాలం పృధానం కాదు. మరి ఎవరు ప్రధానం ? జ్ఞానం కలిగిన గురువు. మోక్షాపేక్ష కలిగిన Monday శిశ్యుడు, కాబట్టి మన గృహనాలూ వరణం కాని మన కుటుంబ పరిస్థితులు కాని మనకు ఇష్టం లేనిని కావచ్చు. అవి అనుకూలమైనవి కాకపోవచ్చు. కానీ అవసరమైనవేనని 10 మనం గ్రహించాలి. అటువంటి పరిస్థితులలోనే మన భక్తిని, విశ్వాసాన్ని, ధృడపరచుకొని కర్మయోగం ద్వారా ప్రశాంత మైన వాతావరణాన్ని ముందు మన ఆంతర్యంలో తయారు 11 చేసుకొని ఆ తరువాత పరిసర ప్రాంతాలలో ప్రసరింప జేయగ లుగుతాం. ఏదీ కూడా మన దగ్గర లేనిదే ఇతరులకు పంచలేవారు. ఇంట్లో భర్త, బిడ్డలు, అత్తమామలు మన ప్రేమతో అనగాహనలో సానుభూతితో జీవించడం అలవరచుకోవాలి, ఓర్పుతో, సహనంతో పిల్లల అలవాట్లను, వారి జీవితాలను చక్కదిద్దడం నేర్చుకోవాలి. ఇదంతా చేయగలగాలంటే ముందు మారు 01 ఆదర్శంగా జీవించగలగాలి. అందుకుగాను ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన విషయాలను నాలుగు సూత్రాల రూపంలో అందిస్తున్నాను. వీటిని మీరందరూ వ్రాసుకొని నిత్వం మననం చేస్తూ హృదయంలో నిలుపుకోండి. - 1) మొదటిది: - అనివార్యాలను జీవితంలో ఎప్పుడూ 1 pm 2 pm P తప్పించుకోలేమని గ్రహించండి. 305) రెండవది :- జరిగేవాటిని అంగీకరించడం. మూడవది :- సరైన అవగాహనతో ఇంట్లో అందరిని అర్ధం చేసుకోవడం. 3) M 4949) నాల్గవది :- పరిస్థితులు మన ఆధీనంలో ఉండరు. ప్రవర 'న మన ఆధీనంలో ఉంటుంది అని తెలుసుకోవడం . 5 pm భోంచేస్తే ఆకలి తీరుతుంది ఆచరిస్తే అనేదక అంతరిస్తుంది. జీవితం ఏట అవగాహన:-ది అనుకోనివి జరగడం శ్రీ దేవా బాధలు ఆ మనో సంబంధమైన బాధలు ® మనం ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా ఉన్నత స్థాయిత ఉండాలతో ఒకోవడం * గృహంలోని హితావరణం పై అయిదు కారణాలు... దుఃఖానికి కారణాలు 1990

TELANGANA SONGS

*అమ్మ గాయపడిన కావ్యం* - వనపట్ల సుబ్బయ్య 9492765358

 *అమ్మ గాయపడిన కావ్యం*

•••••••••••••••••••••••••••••






అమ్మకు చదువు రాదు

అమ్మ చేసే పనులన్నీ కవిత్వమే

పొరుకాట చేతపట్టి కల్లాపు చల్లి

వాకిటిని శ్వేతపత్రం చేస్తుంది

రంగుల ముగ్గేస్తే

పదాలు వాక్యాల్ని అల్లినట్లుంటది

తల్లెలు చెంబులు తోమితే

సంగీతం వినిపిస్తున్నట్లుంటది

పుటలను  పేర్చినట్లుంటది

కొడవలి చేతపట్టి

వరి మెద‌లను కట్టకట్టుతుంటే

కవితలను సంకలనంగా పేర్చినట్లుంటది


అమ్మ 

పాటలు పాడుతది

కథలు కూడ చెపుతుంది

విత్తనం నాటినా కోతలకు వొంగినా

ఇసుర్రాయి ఇసిరినా

వడ్లు దంచినా పాటలే పాటలూ...

పొయ్యి దగ్గర రొట్టెలు  ఒక కథ

అమ్మ ప్రతి క్రియలో పదాలు నలుగుతాయి

వంటింట్లో పోపు డబ్బాల్లోంచి మసాల దినుసులు తీసినట్టు

సమాసానికి శబ్దాలంకారాల్ని  తాపిపినట్లుంటది

నోట్లో నీళ్లూరినట్లు 

ఎదనిండా నిండా పదాలే


అమ్మేడుంటే

అక్కడొక గుంపు 

అదొక కవిసమ్మేళనం

భిన్న చర్చలు విభిన్న వాదాలు ఒడువని జీవితాలు

అమ్మను యాది చేసుకోవడం

అమ్మ లేని నేను

అమ్మ గాయపడిన జీవితం

రాస్తే

కన్నీళ్ల  కావ్యం


అమ్మకు వందనాలు

పొద్దుకు విరామం వుంది

విశ్రాంతి  లేనిది అమ్మే

ప్రవహించే నది గురించి

నడిచే దేవత గురించి 

కంటికి వెలుగైన అమ్మ గురించి ఏమి రాయగలం

నా విజయాలన్నింటికి కారణం  అమ్మనే !


అమ్మ జీవితానికి మాటలు సరిపోవు

బొమ్మ వేయాలంటే రంగులు సరిపోవు

అమ్మ గురించి రాయాలంటే 

పదాలు, వాక్యాలుగా, వాక్యాలు కావ్యాలుగా 

ఒక్కరోజు సరిపోదు అమ్మకోసం

అన్నీ రోజులు అమ్మవే

అమ్మకు వందనాలు

◆మాతృదినోత్సవం శుభాకాంక్షలు

వనపట్ల సుబ్బయ్య

11.05.2025

9492765358

jayajayahe telangana song by children mp3

BEST CARNATIC FUSION 2012

అమ్మ my videos melody#అమృతమయి అమ్మ రేడియో రూపకం mp3 audio#must watch&share all

YOUTUBE PLAYLIST LINK: https://www.youtube.com/playlist?list=PLm6t-vBDvaAFSW135eMmEdBuz1kDVsUkd

అమృతమయి అమ్మ రేడియో రూపకం mp3 audio

Thursday, May 8, 2025

BRS Vinod Kumar Sensational Comments On CM Revanth Reddy | KCR | Pallavi TV#mustwatch#తప్పక విషయాలను తెల్సుకోండి

NAMASTHE TELANGANA 09MAY2025

GIRIDHARI MAY 2025#ఆధ్యాత్మిక మాసపత్రిక

సాధకులకు సాధనా గుళికలు

 సాధకులకు సాధనా గుళికలు

గుణములనగా ఏమి? 

* ఇతరులకు అపకారం చేయక పోవడం.  ఉపకార బుద్ది కలిగి ఉండటం, సత్యం చెప్పడం, భగవంతుని విశ్వసించడం ఇవే మంచి గుణములు. ప్రకృతి గుణాలంటే

సత్వ రజస్తమోగుణాలు.

* బాధ్యత నిర్వర్తించాలి *

"నేను అందరిని ఆదుకుంటాను." అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి చెప్పిన మాట భక్తులకు ఎంతో తృప్తినిస్తుంది.  తనకోసం అంటూ ఒకరున్నారనే భావం కలిగితే వారికోసం ఏ పని చేయటానికైనా వెనుకాడడు మానవుడు.భగవంతుడు ఆదుకుంటాననే మాట ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన నీతి మార్గంలో మనమంతా నడిచేందుకు సంశయించాల్సిన పనిలేదు.

భగవంతుడు అర్జునునికి చెప్పిన మరో విశేశం నీ కర్మలను నీవు విధిగా ఆచరించి ఫలితాన్ని నాకు వదిలేయమని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యత నిర్వహణలో

ఏమాత్రం విసుగు కోపం చెందక నిర్వహించాలి. భార్య, భర్తలకు కూడా వేరు వేరు బాధ్యతలను సమాజం నిర్దేశించింది. ఇందులో ఒకరి బాధ్యత గొప్పదని కానీ, రెండవవారిది హీనమైనది అని కానీ లేదు. తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించటం ద్వారా

కుటుంబ సభ్యులకు తృప్తి కలిగించాలి. ఆ బాధ్యత నిర్వహణలో కోపం, విసుగు, ప్రదర్శనవలన

వారికి దక్కాల్సిన ఫ్రతిఫలం దక్కదు.

 ************************************

*సాధకుడు నిరంతరం భగవద్ధ్యానంలో నిమగ్నుడవుతాడు. భగవన్నామ జపం వల్ల పూర్వ జన్మ పాపనాసనలు పూర్తిగా తొలగి పోతాయి. హృదయ మలినం క్షాళనమవుతుంది. భగవన్నామం రుచి తెలుస్తుంది. నామ స్వాదం తెలిసిన తర్వాత దాన్ని విడిచి పెట్టడం అత్యంత కఠిన నవుతుంది. ఆ నామాన్ని ఒక్క క్షణం కూడా విస్మరించడం జరగదు. అలా జరిగితే ఆ

భక్తుడు మహావ్యాకులతకు లోనవుతాడు.

*ప్రార్ధనకు ముందు మనస్సులో  భావాలను యథేచ్ఛగా రానివ్వాలి , అలా అయిదు నిమిషాలు అయిన తరువాత ఆ భావాలను జాగ్రత్తగా గమనిస్తే అవి ఆగిపోతాయి. అపుడు మనస్సును

మనకు కావలసిన విధంగా మలచుకోవచ్చు. మీకు ప్రార్ధన సులభమవుతుంది

*******************************************

సంస్కృత సూక్తి రత్న కోశః  

1. పాము నోట్లో ఉన్నా కప్ప ఎదుట ఉన్న పురుగుల   కోసం నోరు చాపినట్లు కాలం అనే సర్పం చేత మింగబడుతున్నా జనం అశాశ్వతమైన భోగాలను కోరుతుంటారు.

2.మానకుండా ప్రయత్నం చేయాలి . ఫలమా, పిల్లికి లభించినట్లు లభిస్తుంది. పుట్టినది మొదలు దానికి ఆవులేదు; పాలు మాత్రం రోజూ తాగుతూనే ఉంటుంది.

3.దుర్జనుడు మంచిగా ప్రవర్తిస్తున్నాడంటే ఎవరి కొంపో మునిగి నట్టే. పెద్ద పులి ఉపవాసం

చేస్తే తరువాత అదిచేసే పారణం మృగాలను చంపడమే .

4.తమకు వృత్తి ఎక్కడ లేకుండా పోతుందోనని. భయ పడతారు సామాన్యులు. మరణానికి భయపడతారు మధ్యములు, అవమానానికి భయపడతారు ఉత్తములు

5.ఎవడు దేశ సంచారం చేస్తాడో, పండితులను సేవిస్తాడో, వాని బుద్ది నీటి మీద నూనె చుక్క 

వ్యాపించి నట్లు వ్యాపిస్తుంది.

6. గొప్ప వాళ్ళ గొప్పతనమంతా ఇతరులను ఏమీ యాచించ నంత వరకే . బలి చక్రవర్తిని

యాచింటేటప్పుడు లక్ష్మీపతియైన మహా విష్ణువు గూడ పొట్టివాడు కావలసి వచ్చింది ...


*****************************************************


"భగవన్నాను సరణ శక్తి"

ముక్తిమార్గంలో పయనించాలని కోరిక వుండీ ఆచరించే విధానం తెలియక కొందరు సందిగ్ధస్థితిలో వుంటారు. యజ్ఞాలు, వ్రతాలు, జపాలు, తపాలు వంటి విషయాలు

ఆచరించే స్థోమత, అర్థంచేసుకునే శక్తి లేని వారు తాము భగవంతుని చేరలేమా అని చింత పడాల్సిన పనే లేదు. ఏ రీతిన భగవంతుని ప్రార్ధించారనేది అనవసరం, ఎంతగొప్ప

నైవేద్యం విగ్రహం ముందుంచారన్నది పట్టించుకోడు ఆ భగవంతుడు. ఆయన చూసే దల్లా భక్తుని భక్తి మాత్రమే. అటువంటి సామాన్య భక్తులకు ముక్తి ప్రసాదించేందుకే భగవంతుని గుణ

గణాలను వర్ణించే నామాలను మునిపుంగవులు తయారుచేశారు. ప్రతి రోజు క్రమం తప్పక భగవంతుని గుణగణాలనను భక్తితో స్మరిస్తేచాలు. కోరిన కోరికలు తీరుతాయి.

భారతంలో ద్రౌపది తపాలను ఆచరించినట్టు, వ్రతదీక్షలు వ్రత దీక్షలు చేసినట్టు ఎక్కడా లేదు. కాని ఆమె మనసులో భగవంతుడు నెలకొనివున్నాడు. అందుకే నిండు సభలో వస్త్రాపహరణం

చేస్తున్నప్పుడు గొంతెత్తి, కృష్ణుని పిలవగానే ఆ పరమాత్ముడు ఆమె మానాన్ని రక్షించేందుకు హుటాహుటిన వస్తాడు. నన్ను ఎటువంటి పరిస్థితిలోనైనా ఆదుకునేవాడు భగవంతుడే

అనే నమ్మకం భక్తునికి ఏర్పడాలి. అందుకోసం ఆయన నామస్మరణ చాలు.

* ఉత్తమ పురుష లక్షణం *

ఇతరులకు మాట ఇవ్వడంలో, ఆపదలో వున్నవారిని ఆదుకొనడంలో మనుషుల మనస్తత్వం వేరువేరుగా వుంటుంది. మంచి పనికి ఏమాత్రం సందేహించక తమంతట తాముగా

సహాయం అందించేవారు మొదటి రకం మరోరకం మనుషుల మనసులో ఇతరులకు సహాయం అందించాలని వుంటుంది. కాని అవతలి వారు అర్థిస్తేనే కాని వీరు రంగంలోకి దిగరు. తమచేతిలో శక్తి వుండి కూడా ఇతరులకు అందించేందుకు ముందుకు రానివారు మూడోరకం. అయితే అందరిలోకి అధములు సహాయం చేస్తామని మాట ఇచ్చి అవతలి వారు వచ్చినపుడు వెనక్కి తగ్గేవారు. ఒకసారి మాట ఇచ్చి వెనక్కి తగ్గడమనేది నీచుల లక్షణం. ఎంతటి కష్టాలు పడైనా ఇచ్చినమాటను నిలబెట్టుకోవడం ఉత్తముల లక్షణం .

మధుర సూక్తులు

*నీవు ప్రేమను అర్థించితివేని పథమమున నీకు పెక్కు చిక్కులు వాటిల్లును. వెనుకంజ వేసితినా

చాలా నష్ట పడెదవు. ధైర్యముగా ముందుకు సాగితివా విజయం నీదే అవుతుంది.

*నీ ఆర్జనలో కొంత భాగము మంచి పనులకై వినియోగింపుము. ధనార్జనయే గొప్పతనం కలిగింపదు. మంచి పనులయందు చేయబడిన వ్యయము చేతనే అది కలుగుతుంది.

నీ మనోవాక్కాయములచే పూర్ణముగ భగవానుని పాదపద్మముల శరణుజొచ్చుము. పరోపకారమే నీ జీవితాశయముగ పెట్టుకొనుము. తతిమా నియములు, వ్రతములు వగైరా

ఎందుకూ కొరగావు.

*ఏవిషయము లోను తాను గొప్పవాడు కాడనియు, ఇతరులే తనకన్నా అధికులని గ్రహించుట పరిపూర్ణత్వానికి గుర్తని తెలిసికొనుము - శ్రీ కుసుమ హరనాథ మహాప్రభు.

వర్ణాశ్రమ  ధర్మాలు

నారద మహర్షి వ్యాసుని అంతరంగం తెలుసుకొని "ఓ! మహర్షీ నీవు  రచించిన గ్రంథంలో భగవద్భక్తిని, భగవల్లీలలను నిరూపణ చేసే అవకాశం నీకు లభించలేదు. అదే నీ అశాంతికి, ఆవేదనకు కారణం. కేవలం వర్ణాశ్రమ ధర్మాలను కర్తవ్యాలుగా ప్రభోదించి నందువలన

సాధకునికి భగవత్పాప్తి కలుగదు. భగవద్భజనలోన అంతర్ముఖు డైనవాడు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించక పోయినప్పటికీ అమంగళం కలుగదు . భగవద్భక్తి  పరమ ఫలమైనది  భగవత్ ప్రేమ. 

నిరంతర భగవత్ భజనతో సాధకుడు పవిత్రుడే అవుతాడు. కృతార్డుడవుతాడు.. భక్తి సాధకుడైన వానికి శరీర పతనానంతరము నీచమైన జన్మ ప్రాప్తించదు. ఒక వేళ పూర్వసంచితం వల్ల

*******************************

 మనోనిగ్రహం

మనిషికి మనసు సేవకుడులాంటిది చేయకూడని పనులు ఆ మనసు ద్వారా చేసినట్లయితే దానికి చులకన అవవలసి వస్తుంది. అధర్మ వర్తనానికి అలవాటుపడి జీవించినంత కాలం

 మనసును నిగ్రహించు కోవటం కష్టమవుతుంది. రాగద్వేశాల మధ్య ఊగిసలాడినంతవరకు మనసుపై ఆధిపత్యం లభించదు. అన్యులను గూర్చి అతిగా ఆలోచించినంత కాలం మనసుపై పట్టు చిక్కదు. ఇతరులను గాయపరచే నిరంకుశమైన ప్రవృత్తికి స్వస్తి చెప్పనంతవరకు మనసును మరలించడం సాధ్యం కాదు. మన ఆలోచనలు ధర్మ బద్ధంగా వుండాలి, తినినా, వినినా,అనినా, కవినా, కన్ను మూసినా, పని చేసినా,అన్నీ మితంగా, హితంగా వుండాలి..

అహంకారం గట్టిపడినవారికి అతఃకరణ పలుచ బడదు. నిరహంకారులే మనసును జయించ గలుగుతారు. అర్హతనుమించి ఆంశలను పెంచుకుగానే వారు మనసుకు దాసులు . ఇతరుల

సంపదమ చూసి ఓర్వలేని వారు మనసుకు దాసులు. మనసును నిగ్రహించాల్సింది మనసే. అవరోధాలు కలగడంవల్ల నిగ్రహం సాధ్య పడటంలేదు, అనేది కూడా మనసే. మనసుకి క్రమశిక్షణ లేని కారణంగానే, భిన్న మార్గాలలో చరించి, భిన్నరుచులకు అలవాటు పడ్డ మనస్సును ఒక్కసారిగా దానిని అదుపు చేయడం సాధ్యం కాదు. ఈ అవరోధాన్ని అధిగమించే

ప్రయత్నంలో సోపానక్రమంగా సాగిపోవాలి. “ఇది నాకు అవసరం లేదు” అని అనుకున్నప్పుడే దానినుండి. మనం విడివడగలం. ప్రపంచ విషయంలో కానీ, ప్రపంచంలోని వస్తువుల విషయంలో కానీ, మన అభిప్రాయాలు, అవి తయారుచేసిన విలువలు

సరైన మార్గంలో లేవు. అందువలన మనం అయోమయంగా వాటిని అంటి పెట్టుకుని ఉంటున్నాం. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన చిగురిస్తే మనం వాటికి దూరంగా పోము. వాటిని దాటి పోతాము. ఇదే మనో జయం. ఆ మధ్య  జరిగేది మనోనిగ్రహం.

- స్వామి సుందర జైతన్యా నంద

*****************************************

గీత - భగవన్నామం

భగవంతుని కీర్తించడానికి సర్వ జనులకు అధికారముంది. ఇందులో వర్ణాశ్రమ భేద భావాలకు తావుండదు. యోగులు కూడా గొంతెత్తి భగవంతుడ్ని కీర్తించడం మనం చూస్తూనే యున్నాము. కీర్తనం వల్ల శరీరం హరి రూపమువుతుంది. భగవత్ప్రేమ చంధస్సులాగా నాట్యమాడిస్తుంది. శ్రీహరి కీర్తనంలో భగవంతుడు, భక్తుడు, భగవన్నామమూ

కలసి త్రివేణీ సంగను మువుతుంది. భగవత్పేమ , భక్తుడు ఏ చోట శ్రీహరి గుణగానం చేస్తాడో, ఆచోట భగవంతుడు వినడానికి నిలుచుంటాడు. భగవద్ సంకీర్తనం  వల్ల సంపార దుఃఖం దూరమవుతుంది. భగవద్ సంకీర్తనం లోకంలో నాలుగువైపుల ఆనందపు పుహరీ గోడలు నిర్మిస్తుంది. లోకాన్ని సుఖ సంతోషాలతో నింపుతుంది. కీర్తనం వల్ల విశ్వమంతా ధనళితమై వైకుంఠం పృథ్వీతలం మీదికి దిగి వస్తుంది. భగవంతుడ్ని కీర్తించేప్పుడు హృదయ కవాటాలను పూర్తిగా తెరిచి లజ్జ బిడియం లేకుండా నోరారా స్తుతించాలి. భావంలో భగవంతుడు లేనప్పుడు సాధన వల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదు. శ్రీహరి కథయే మనుష్యుడికి సుఖ సమాధి కావాలి. అమృత బీజం , ఆత్మ తత్త్వసారం, గుహ్యాతి గుహ్యమైన రహస్య శ్రీకృష్ణ నామం. పై విధంగా పెద్దలు భగవన్నామ సంకీర్తన మహిమను గురించి తమ అనుభవాలను వెల్లడించారు. ధృడ నిశ్చయం గల భక్తులు నిరంతరం నన్ను కీర్తిస్తారని

"శ్రీ కృష్ణ భగనానుడు గీతలో చెప్పాడు (9-14)

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।

నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥ 14 ॥

"అర్జునా! నా పట్ల అత్యంత ప్రీతితో నన్ను కీర్తించడం, నాకుప్రీతికరమైన, కార్యాలకు ప్రయత్నించడం, నాకు నమస్కరించడం అనేవి లేకుండా ఒక్క క్షణం కూడా నా భక్తులు గడపజాలరు. నా గుణ విశేశాలను, నా నామాలను తలచి సర్వాంగాలు పులకింప

గద్గద స్వరంతో కృష్ణా కృష్ణా అని కీర్తిస్తూ నా దాస్యంలో నిమగ్నులై నన్ను ఉపాసిస్తుంటారు.

ఎక్కడ తలపునకు వస్తే అక్కడ నిలబడి నాకు నమస్కరిస్తుంటారు.

అనగా ఇది బురదనేల, ఇది రోత ప్రదేశము అని భగవన్నామం కీర్తించకుండా వుండరు.

పై శ్లోకంలోని ధృడ వృతమంటే హఠాత్తుగా కలిగిన ఆపదల వల్లగానీ, ఆకస్మికంగా వచ్చిపడిన సంపదల వల్లగానీ మతి చలించి మరొక దారి తొక్కకుండుట యని అర్థం.

“సతతం - కీర్తయంతః”  ఈ రెండు పదాలు కలసి ఒక అపూర్వమగుఅర్ధాన్ని స్ఫురింపజేస్తున్నాయి. "తతం - వీణాదీకం వాద్యం" తతమనగా తంత్రులను

మీటుతూ వాయించు వీణ. అది ఒక వాద్య విశేశం. "తతేన సహితం సతతం" ఇదే అపూర్వమైన అర్ధ విశేశం అనగా వీణను మీటుతూ పాడుతున్నవారు. భగవంతుడు

సామగానలోలుడని ప్రసిద్ది. 'కృష్ణ' పదం వసుదేవుని పుత్రుడు అని మాత్రమే కాదు.

సమస్త అవ తారాలలోను కృష్ణపదం ప్రయోగింపబడింది. దీనిని బట్టి కృష్ణుడు అవతారియే కాని అవతారం కాదని గ్రహించవచ్చు. మత్స్యకూర్మాది అవతారాలను జరిపించిన

వాడు శ్రీ కృష్ణుడు. ' సతతం ' అనడంలో కర్మయోగంలో లోగా దేశకాల పాత్ర

భేదం లేదని తెలపడానికే అని సారార్ధ వర్షిణి టేకలో విశ్వ నాథ చక్రవర్తి విశదపరిచాడు.

నదేశ నియమస్తత్ర  న కాల నియమస్తథా

నోచ్ఛిష్ఠాదౌ నిషేధోస్తి శ్రీహరే నిమ్నిలుబ్ధకే ||

(శ్రీహరి నామాన్ని ప్రేమించే వారికి దేశకాలాలకు సంబంధించిన ఏ విధమైన 

నిషేధమూ లేదు సరావస్థలలోను భగవన్నామాన్ని కీర్తించవచ్చు. శ్రీధర్ స్వామి ఈ శ్లోకాన్ని వాఖ్యానిస్తు సర్వదా స్తోత్ర మంత్రాదిభిః కీర్తయంతః అని ఉటంకించారు. మంత్రంలో గలది భగవన్నామమే ఆ నామమే మంత్ర రాజు మవుతుంది అని. శ్రీ బలదేవ విద్యా భూశణాలు ఈ శ్లోకా టీక వ్రాస్తూ "దేశ కాలాదుల పరిశుద్దిని విచారించకుండా సర్వదా భగవంతుని గుణక్రియలను అనుసరించి గోవింద గోవర్ధనధారి ఆది వివిధ అమృతమయ

మధుర మంగళప్రద నామాలను ఉచ్ఛైస్వరంతో ఉచ్ఛరించడమే భగవంతుని ఉపాసించడమవుతుంది..

'కలేర్దోషనిదే రాజన్

అస్తిహ్యేకో మహా గుణః

కీర్తనా దేవ కృష్ణ స్య 

ముక్తసంగః 'పరం వ్రజేత్ || శ్రీ మద్భా  - 12-3-51||

ఈ కలి యుగం దోషభూయిష్టమైనది. ఇందులో ఒకే ఒక మహా గుణమున్నది. అది ఏమంటే : శ్రీ కృష్ణ నామ సంకీర్తనంతో జీవుడు సమస్త సంగాలను పరిత్యజించి భగవద్ ప్రాప్తిని పొందుతాడు. ఈ భాగవత శ్లోకాన్ని పురస్కరించుకొని శ్రీ బైతన్య మహాప్రభువు ఇలా ఉపదేశించారు.

నయనం గళదశ్రుధారా

వదనం గద్గద  రుద్దయా గిరా

పులకైర్ని చితమ్ వపుః కదా

తవ నామ గ్రహణో భవిష్యతి ||

హే! కృష్ణా నీ నామాన్ని ఉచ్ఛరించిన వెంటనే కళ్ళల్లో  ఆనందాశ్రువులు ధారలు కట్టడం, వాక్కులు  గాద్గదిగం కావడం, శరీరమంతా గగుర్పొడవడం ఇవి కలిగే సుసమయం ఎప్పుడు సంప్రాప్తిస్తుందో అప్పుడు భక్తులు పరమానందంలో ఓ ల లాడతారు. అంతకంటే జీవికి

ఏమికావాలి?

ఓం….ఓం తత్సత్.. 

*********************************************************

* గీతామృతం * * జగము - జగతి *

హృదయానికి అన్నిటి కంటే ఆకర్షనలకు మైనది ఒక ప్రేమ మాత్రమే. హృదయంలో ప్రేమ

లేనప్పుడు దాన్ని బలవంతంగా భగవంతుని వైపునకు మళ్ళించడానికి ఎంత ప్రయత్నించినప్పటికి ఫలితం ఉండరు. క్షణం సేపైనా భగవంతుని యందు నిలువదు .

కర్మయోగ, జ్ఞాన యోగాలు రెండూ భక్తియోగానికి సహకరించినప్పుడే అవి చరితార్థమవుతాయి. కర్మమార్గం - జ్ఞానమార్గం ఒకదానికొకటి కలుసుకున్న చోట

భక్తిమార్గం ద్యోతకమవుతుంది. భక్తిలోని మాధుర్యంతో ఆ రెండూ ఒక దాని లోపాన్ని మరొకటి పూర్తి చేసుకుంటాయి.

అప్పుడు ఆ రెండింటికీ లక్ష్యం ఒకటే అవుతుంది. చరితార్దత కలుగుతుంది.భక్తియోగానికి ఆధారమైనది కేవలం భగవత్కృప మాత్రమే. భక్తిసహాయం లేకుంటే కర్మయోగి యొక్క నిష్కామ జీవితం సఫలం కాదు. మానవ హృదయం నిష్కామంగా ఉండటం దుర్ఘటం. భక్తియోగాన్ని ఆశ్రయిస్తే హృదయం దానంతట అదే శాంతిస్తుంది. భగవదనుభూతి కలిగిన వెంటనే మనస్సుకున్న మాయా బంధాలు తెగిపోతాయి. భక్తికి రెండు రూపాలున్నాయి. 1. ఉపాసన. 2.కెంకర్యం భగవంతుని యందు విశ్వాసముంచి నిరంతర చింతన చేయడం ఉపాసన. భగవంతునితో మానవ హృదయం ఏకాకారం కావకం ఉపాసన. ఉపాసన సఫలం కావడానికి భగవంతుని పట్ల అత్యధికమైన ప్రేమ ఆవశ్యకమవుతుంది. ప్రీతి ఉంటే ప్రేమ కలుగుతుంది. మనం అధికంగా ప్రేమించిన దానినే రాత్రింబవళ్ళు స్మరిస్తుంటాము. ఆస్మరణలో, చింతనలో, ధ్యానంలో ఆనందాను భూతిని పొందుతాము. దాని మీద ప్రేమతో ఉన్మాదుల మవుతాము. ఒక్కక్షణం ప్రేమించిన దానిని మరచిపోతే ఎంతో వ్యాకుల పడతాము. అంతా పోగొట్టు కొన్నట్లుగా వ్యధ చెందుతాము. ఇందుకు  కారణ మేమిటి ?

మనస్సు చాలా చంచలమైనది. మనస్సును బంధించడం గాలిని పట్టి మూట కట్టడమే.

మనస్సు భగవంతుని యందు నిలిచి నట్లుగా నిలిచి హఠాత్తుగా ఇంద్రియ సుఖాలవైపు

మళ్ళుతుంది. ఎప్పుడు మళ్ళిందో కూడా మనకు తెలియదు. అంతేకాదు అలవాటు పడిన విషయంలో కూడా చలించిపోయే స్వభావం మనస్సుకు ఉంది. ఇంద్రియ భోగరస పానానికి అలవాటు పడిన చంచలమైన మనస్సును భగవంతుని వైపునకు మరలించడానికి రెండు సాధనాలు ప్రారంభంలో అవుసరమవుతాయి.

1. అభ్యాసం 2. వైరాగ్యం

అభ్యాసానికి మొదలు, వైరాగ్యానికి ప్రారంభంనకు అవసరమైనది అభిరుచి, అదే ప్రతి, ప్రేతి కలగడానికి రామాయణ, భాగవతాది సద్యంథాలు పఠించాలి. శ్రద్ధాసక్తులతో వినాలి. భగవంతుని పట్ల వైముఖ్యాన్ని కలిగించే మాయను ఎప్పటికప్పుడు పారదోలాలి. 

మాయాదేవికి నమస్కారం పెట్టి " అమ్మా! నీవు నా జోలిక రావద్దని వేడుకొనవలెను":

'జగమును' నపుంసక మనుకొన్నవారికి వైరాగ్యం కలుగుతుంది  ' జగతి' స్త్రీలింగ మను కొన్నవారికి భోగబుద్ధి జీవిస్తుంది. వైరాగ్యం ద్వారా భగవంతుని యనురక్తి; జగత్తు పట్ల విరక్తి

ఉత్పన్నమవుతాయి. భక్తికి మరొక రూపం కైంకర్యం. జీవుడు శాశ్వతంగా  భగవంతునికి దాసుడు. భగవత్సేవ చేయడం జీవుని ధర్మం.


*************************************************************

అయ్యప్ప స్వామి దర్శనం

18 మెట్ల తత్త్వం

* భగవద్గీతలో చెప్పిన సాధనలు - అయ్యప్ప దీక్ష

- తత్త్వమసి

- ధర్మమును అనుష్టించిన వాడు 18 మెట్లు ఎక్కగలడు.

మొదటి మెట్టు:- అద్వైత మూలం, ఏక  మేవ  అద్వైతం బ్రహ్మం

-అజ్ఞానం పోవాలి, మెట్టు అర్హత: అహం బ్రహ్మాస్మి.

రెండవ మెట్టు :- ద్వయపాదసారం, - విద్య, అవిద్య, ఆత్మ, ఆనాత్మ

-ఆత్మ తత్వం, తెల్సుకోవాలి

మూడవ మెట్టు :- త్రిదో శహరణం,

- త్రిగుణములను (సత్త్వ, రజ, తమస్సు)

పోగొట్టుకొని - సత్త్వ గుణం లో  ఉండాలి.

నాలుగవ మెట్టు - చతుర్విద యోగాలు

- జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయా

-సర్వావస్థలయందు భగవంతుని ధ్యానించుట

అయిదవ మెట్టు - ఆకార పంచకం :

- మనోమయ, ఆనందమయంగా వుండాలి.

ఆరవ మెట్టు - అరిషడ్వర్గాలు జయించాలి

కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహం

7 వ మెట్టు - జన్మల చిత్రం 

- పుట్టుట, చచ్చాట, రహస్యం తెల్సుకోవాలి

- జన్మ రాహిత్యం కోసం సాధన.

8. వ మెట్టు -  ఆనందాష్టకం - ఆత్మానందం.

- 8 రకముల ఆనందం -

- జీవనం, మనుష్యా, గాంధర్వ, పురుష, దేవత

9. వ మెట్టు - నవతర జ్ఞానం.

సభ్య, అసత్య, నిత్య, అనిత్య వస్తువివేకం విచారణ.

10 వ మెట్టు - దశదానఫలం

- గోదానం, హిరణ్యదానం, కన్యాదానం,

జలదానం, భూదానం, రజిత, వస్త్ర, గృహా, శాఖాదానం,

ఉత్తమము - విద్యాదానం

11 వ మెట్టు - రుద్రస్వరూపం . (character)

1. కార్యాచరణ సిద్ధి, 2. చిత్తశుద్ధి

3. సర్వ కర్మపరి త్యాగం 4. గురు భక్తి 

5. వేదాంత శ్రవణం ( మననం)

6. మనన, ధ్యానం.

12. వమెట్టు - ద్వాదశాక్షరీ మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ

- మంత్ర సిద్ది   - భగవంతునికి సాధకునికి తేడా ఉండదు.

భగవంతునిలో లీనం కావడం .

13. వమెట్టు - తత్వజ్ఞానం - గురుబోధ, భగవద్గీత

శివమంత్రం - వాసుదేవ మంత్రం నిత్యం దానంచేస్తూ బ్రహ్మస్వరూపం పొందాలి.

14. వమెట్టు : చతుర్దశ న్యాయం.

చతుర్దశ లోకాల్లో పరమాత్మ జ్ఞానం - స్థితప్రజ్ఞుడు

15 వమెట్టు - పంచదశ యోగము

-అయిదు దశల యోగం

త్యాగం, ప్రాణాయామం, విజ్ఞానం, కాలము,నియమము.

16 వమెట్టు - శోడశ చంద్రయోగము :

శోడశ కళాపూర్ణుడు - 16 కళల పూర్ణడు.

17 వమెట్టు - భవ భయ హరణం.

పుట్టుట, చచ్చుట నుండి బైటికి రావడము.

- దుఃఖము లేకుండా - జన్మలేకుండా, జన్మరాహిత్యం.

18 వమెట్టు :- అయ్యప్ప నిలయం (వైకుంఠం)

అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కగానే

"తత్వమసి" తద్ + త్వం + అసి

****************************************


NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular