మానసిక ఆనందం

  

మానసిక ఆనందం


మానసిక ఆనందం
★★★★★★★
జీవితం అనే యుద్ధంలో ప్రతికూల ఆలోచనలు అనే
శత్రువులు మనపై దాడి చేయడానికి ఎప్పుడూ పొంచి
ఉంటాయి.పౌరాణిక యుద్ధాలలో ఒక ఆయుధాన్ని మరొక
ఆయుధం జయించేది. శత్రువు అగ్ని బాణం వేస్తే
కథానాయకుడు నీటి బాణం వేసి ఆర్పేవాడు.ప్రతికూల ఆలోచన
బాణం మన వైపు దూసుకువస్తే ‘అనుకూల ఆలోచన’ అనే
అసాధారణమైన బాణాన్ని అందుకోండి…
‘మైండ్ మనం పెంచుకునే పూలతోట లాంటిది’
అంటారు ప్రఖ్యాత రచయిత రాబిన్శర్మ. ఆ తోటను ఎంతబాగా
చూసుకుంటే అంత అందంగా వికసిస్తుంది. అదే
నిర్లక్ష్యం చేస్తే ఆ తోటలో
కలుపుమొక్కలు పుట్టుకొస్తాయి. అలాగే వదిలేస్తే..
కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి. కొన్నాళ్లకు ‘తోట’
అనే పదానికే అర్థం లేనట్టుగా తయారవుతుంది అంటారాయన.
కలుపుమొక్కలను తొలగించాలంటే పాజిటివ్ థింకింగ్ ఒక్కటే
సరైన ఆయుధం. అనుకూలమైన ఆలోచనలతో మన మైండ్లో
ఉన్న కలుపుమొక్కల్లాంటి నెగిటివిటీని దూరం చేసుకుంటే
శక్తివంతంగా ఎదుగుతాం.ప్రతిభ సమానంగా
ఉన్నవారందరిలోనూ పరాజితుల నుంచి విజేతలను వేరుచేసేది
వారి ఆలోచనలే.
ఆలోచనే మొదటి మెట్టు…
మన ఆలోచనలను విత్తుగా నాటితే అది చర్య అనే మొక్కలా
పెరుగుతుంది. ఆ చర్య దాన్ని మళ్లీ విత్తుగా నాటితే అది
అలవాటు అనే మొక్కలా పెరుగుతుంది. ఆ అలావాటునే విత్తితే
అదినడవడిక అనే పంటలా ఫలిస్తుంది. ఆ నడవడికనే నాటితే అది
మన అదృష్టాన్నే మార్చివేస్తుంది. అంటే ముందుగా మన
మైండ్లో ఒక ఆలోచన ఉదయించాలి.
రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేవాలనే ఆలోచన
వచ్చిందనుకుందాం. అదే ఆలోచన రోజూ కలిగితే ఒక
రోజు అనుకున్న సమయానికే మేల్కొంటాం. పనులను చకచకా
చేసేస్తాం. అదే రోజూ త్వరగా నిద్రలేవడం అనేది అలవాటుగా
మారి, పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటే కొన్నాళ్లకు అది ఒక
క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది. చివరకు అది మన
క్యారెక్టర్నే మార్చివేస్తుంది. అదే ఒకరిలో ‘మద్యం తాగాలి’ అనే
ఆలోచన కలిగిందనుకుందాం. ఒకరోజుతో ‘తాగడం’
మొదలుపెట్టి, దానిని రోజూ ఓ అలవాటుగా తాగుతూ పోతే
చివరకు అతని క్యారెక్టర్ అందరిలోనూ తాగుబోతుగా
ముద్రపడే అవకాశం ఉంది. అందుకే మొదట మైండ్లో
ఉదయించే ఆలోచన ‘మంచి, చెడు’ ఎలాంటి
క్యారెక్టర్ను సృష్టిస్తుందో మనకు మనమే చెక్ చేసుకోవాలి.
నెగిటివ్ చీడ…
నెగిటివ్ ఆలోచనలు చీడపురుగుల్లాంటివి. అవి
ఎప్పుడూ మైండ్ను తొలుస్తూనే ఉంటాయి. పాజిటివ్
ఆలోచనలతోనే వాటిని ఎదుర్కోగలం.
ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను, భర్తను భార్యను,
ఉద్యోగిని పై అధికారి తిట్టడం, దూషించడం వంటివి
చూస్తుంటాం. వారి మాటలు, ప్రవర్తన మనలో ఎంతో
నెగిటివిటీని నింపవచ్చు. ఇలాంటప్పుడు నిరాశ
నిసృ్పహలకు లోనైతే మరింత కుంగుబాటు తప్పదు.
మనల్ని మనం మరింత శక్తివంతంగా మలుచుకోవాలంటే ఆ
నిరాశను దూరం చేసుకోవాలి. ‘నా బాగు కోసమేగా ఇలా జరిగింది.
వారంత నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన
ఇప్పుడు కోల్పోయిందేముంది.. దీనిని సవాల్గా తీసుకొని
ఇంకాస్త ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం’ అని
ఎప్పటికప్పుడు మనల్ని
మనం అనుకుంటూ ప్రోత్సహించుకుంటే ఉంటే కొత్త
ఉత్సాహం చెంతకు చేరుతుంది. మరింత బాగా పని చేసి,
శక్తివంతులమవుతాం.
లోకంలో రకరకాల మనస్తత్వాలు గలవారు ఉంటారు. వారికి
తోచినట్టు వారు మాట్లాడుతుంటారు. ప్రవర్తిస్తుంటారు.
వీలైతే అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి. వారి స్థానాన్ని
పాజిటివ్గా ఉండేవారితో భర్తీచేయాలి. ఏ కారణంగానైనా మనలో
నెగిటివిటీ తొంగిచూస్తే ఒక్క పాజిటివ్ ఆలోచనతో దానిని రీప్లేస్
చేస్తే సరి అనుకూలమైన ఆలోచనలతో జీవితం ఆనందంగా మారినట్టే.
పాజిటివ్ – టెక్నిక్స్
ఆశావాద దృక్ఫథంతో వ్యవహరించే మనుషుల మధ్య ఉంటే
నిరాశావాదం మెల్లగానైనా తప్పుకుంటుంది.
గుడికి వెళ్లడమో, నచ్చిన సినిమా చూడటమో, కొత్త
వంటకం చేయడమో, పుస్తకం చదవడమో… ఏదైనా
మనసుకు నచ్చినపనిని చేస్తూ ఉండాలి. ఆ పనిలో కలిగే
సంతృప్తి నిరాశను తరిమికొడుతుంది.
ఒంటరిగా ఉండటంలో వచ్చే నిరాశాపూరితమైన
ఆలోచనలను వదిలించుకోవాలంటే నలుగురితో కలివిడిగా
ఉండాలి. వీలైనంతవరకు సహోద్యోగులతోనో,
బంధుమిత్రులతోనో, ఇరుగుపొరుగువారితోనో..
మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాజిటివ్నెస్ను పెంచుతుంది.
మనకు అందరూ ఉన్నారు అన్న భరోసాను ఇస్తుంది.
బలం, బలహీనతలు గుర్తించాలి
ఆలోచనలు విశాలంగా ఉండాలి. మన బలం, బలహీనతలేంటో
ఎవరికి వారు అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడే
బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేయగలం.
మరింత శక్తివంతులుగా మారగలం. అందుకే నెగిటివ్
ఆలోచనలను దరికి రానీయకుండా బలహీనతలను దాటడానికి
మనల్ని మన మే ప్రోత్సహించుకోవాలి. అలాగే మన
బలాలను గుర్తించి వాటిని ఇంకా బాగా వాడుకోవాలి.
నా కోసం నేను… అనుకోవాలి…
శుభ్రంగా ఉన్న కాఫీ గ్లాసు లాంటిది మన మైండ్. కాఫీ తాగిన
ప్రతిసారి ఆ గ్లాసును శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా అదే
గ్లాసులో మళ్లీ మళ్లీ కాఫీ పోసుకొని తాగితే ఎలా ఉంటుందో ప్రతి
ఒక్కరు ఆలోచించగలిగితే మన మైండ్
మనకు అర్థమైపోతుంది. పాజిటివ్ ఆలోచనలు మళ్లీ మళ్లీ
రానిస్తే మన మైండ్ అలాగే తయారవుతుంది. ‘నాకు మంచి
జరగాలని నేను కోరుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోరు’
అనుకున్నా పాజిటివ్ ఆలోచనలతో జీవితం హ్యాపీగా
గడిచిపోతుంది.

Comments

Popular posts from this blog

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి